క్రెడిట్ స్కోరును పెంపొందించుకోండి ఇలా..

క్రెడిట్ కార్డు వాడకాన్ని ప్రారంభించేటప్పుడు లేదా చిన్నరుణాల కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు, మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి.

క్రెడిట్ స్కోరును పెంపొందించుకోండి ఇలా..

క్రెడిట్ కార్డులు, రుణ ఈఎమ్ఐ భారం ఎందుక‌ని వాటి జోలికెళ్ల‌డం లేదా? అయితే అర్హ‌త ఉన్న‌వారు క్రెడిట్ తీసుకోవడం మంచిదే అంటున్నారు నిపుణులు. ప్ర‌తీ ఒక్క‌రూ మంచి క్రెడిట్ ప్రొఫైల్‌ను నిర్మించడం చాలా అవసరం. క్రెడిట్ కార్డ్ లేదా రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు, మీ క్రెడిట్ స్కోరు ఆమోద ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీ ఆమోద అవకాశాలను మెరుగుపర్చడానికి మీరు మంచి క్రెడిట్ చరిత్రను కొనసాగించడం అత్యవసరం నిపుణులు అంటున్నారు.

అయితే, మీరు రుణాలు తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల క్రెడిట్ స్కోర్ను నిర్మించడం కుదురుతుందా? మీకు క్రెడిట్ చరిత్ర లేకపోతే, అప్పు తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించే మీ సామర్థ్యాన్ని బ్యాంకు లేదా రుణ సంస్థ‌లు అంచనా వేయలేనందున రుణాలు ఇవ్వడానికి వెనుకాడతారు. ఇంకొక‌టి మీకందించే రుణంపై వ‌డ్డీ శాతం ఎక్కువ‌గా ఉండొచ్చు. కాబ‌ట్టి మంచి క్రెడిట్ స్కోరును క‌లిగి ఉండ‌టం ద్వారా రుణాల ల‌భ్య‌త అవ‌కాశాల‌ను పెంచుకోవ‌చ్చు.

క్రెడిట్ వినియోగ విధానం, తిరిగి చెల్లించే విధానం ఆధారంగా క్రమశిక్షణతో ఉంటే, క్రెడిట్ పరిమితి మెరుగుప‌డుతుంది. ఒక వ్యక్తికి రుణ లభ్యతలో అధిక ప‌రిమితిని క్రెడిట్ స్కోర్‌ సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. అందువల్ల, భ‌విష్య‌త్తులో మీరు అధిక పరిమితులు కలిగిన క్రెడిట్ కార్డులు, పెద్ద మొత్తంలో రుణాల‌ను త‌క్కువ వ‌డ్డీ పొందాల‌నుకుంటే క్రెడిట్ చ‌రిత్ర చాలా ముఖ్యం. సంస్థలు విశ్లేషించడాని సున్నా క్రెడిట్ చరిత్రను క‌లిగి ఉండ‌టం కంటే కొంత మంచి క్రెడిట్ చ‌రిత్ర‌ను క‌లిగి ఉండ‌టం మంచిది. సున్నా క్రెడిట్ చరిత్ర అంటే మీరు గతంలో ఎలాంటి క్రెడిట్ లేదా రుణ ఉత్పత్తులలో లావాదేవీలు చేయలేదు. అత్యవసర సమయాల్లో రుణాలు పొందేందుకు ముందుగానే మీ క్రెడిట్ స్కోర్‌ను నిర్మించే దిశగా పనిచేయడం ప్రారంభించండి. మీరు తక్కువ వడ్డీ రేటుతో క్రెడిట్ కార్డ్ లేదా చిన్న రుణం పొందవచ్చు కొత్తగా డిజిటల్ ప‌ద్ధ‌తుల్లో రుణాలు అందించే సంస్థ‌లు క్రెడిట్ స్కోర్ను నిర్మించడానికి కృత్రిమ మేధస్సు , మెషిన్ లెర్నింగ్ ల‌ను ఉపయోస్తున్నారు.

అయితే, మీరు మొదటి క్రెడిట్ కార్డు వాడకాన్ని ప్రారంభించేటప్పుడు లేదా చిన్నరుణాల కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు, మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి.

క్రెడిట్ కార్డు కోసం ఎంపిక చేస్తున్నప్పుడు, మీ బిల్లులను సమయానికి చెల్లించటం మ‌ర్చిపోవ‌ద్దు. అధిక క్రెడిట్ వినియోగ ప‌రిమితి ప్రభావం క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూలంగా ఉంటుంది. ఎక్కువ క్రెడిట్ కార్డుల పొందేందుకు కొందరు ఎక్కువ‌ బ్యాంకు ఖాతాలను కూడా తెరవవచ్చు. ఈ ప్రవర్తన రుణం కోసం ఎక్క‌వ‌గా ఆశిస్తున్న ప్ర‌వ‌ర్త‌న‌ను ప్రతిబింబిస్తుంది. దీంతో ఇది క్రెడిట్ స్కోరుపై ప్రతికూలంగా ప్రభావం చూపుతుంది.

క్రెడిట్ కార్డులు వ‌డ్డీలేని రుణాన్ని నిర్ణీత కాలంపాటు అందిస్తుంది. మీరు నిర్ణీత కాలంలో బిల్లులు చెల్లించిన‌ట్ట‌యితే ఎటువంటి వ‌డ్డీ లేని రుణం పొందిన‌ట్లు అవుతుంది. రిజ‌ర్వు బ్యాంకు క్రెడిట్ కార్డు చెల్లింపుల‌పై 3 రోజులు గ్రేస్ పిరియ‌డ్ ఇవ్వాల‌ని సూచించ‌డంతో ఆ స‌మ‌యంలో చెల్లించ‌డం ద్వారా ఎటువంటి వ‌డ్డీ వ‌ర్తించ‌దు.
రుణాలు తీసుకునే వారు నిర్ణీత కాల‌ప‌రిమితిలో రుణ ఈఎమ్ఐలు చెల్లించాలి. ఎక్కువ సంఖ్య‌లో రుణాల‌కు ద‌ర‌ఖాస్తులు చేయ‌వ‌ద్దు. ఇది రుణం కోసం ఎక్క‌వ‌గా ఆశిస్తున్న ప్ర‌వ‌ర్త‌న‌ను ప్రతిబింబిస్తుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly