మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో సిప్‌ని పెంచ‌డం ఎలా?

మార్కెట్లు బ‌ల‌హీనంగా ఉన్న‌ప్ప‌టికీ సిప్‌ని పూర్తిగా నిలిపివేయ‌డం మంచిది కాదు

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో సిప్‌ని పెంచ‌డం ఎలా?

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌దుపు చేసేందుకు సిస్ట‌మేటిక్ ఇన్‌వెస్ట్‌మెంట్ ప్లాన్‌(సిప్‌) ఒక విధానం. ఇటివ‌లీ కాలంలో సిప్ విధానం ద్వారా మ్యూచువ‌ల్ ఫండ్లలో మ‌దుపు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. సిప్ ద్వారా ప్ర‌తీనెలా మ‌దుప‌రి నిర్ణ‌యించిన ప్ర‌కారం కొంత మొత్తం మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి చేసేందుకు వీల‌వుతుంది. దీర్ఘ‌కాలంలో చూస్తే స్థిరంగా ఒకే మొత్తం సిప్‌ పెట్టుబ‌డి కొన‌సాగించ‌డం కంటే మ‌ధ్య‌లో కొంత‌కొంత‌ పెంచుతూ వెళ్తే వ‌చ్చే ప్ర‌తిఫ‌లం ఎక్కువ‌గా ఉంటుంది. ప్ర‌తీ ఏడాది సిప్ మొత్తం పెంచుకునేందుకు రెండు మార్గాలు ఉన్నాయి ఒక‌టి అదే ఫండ్‌లో ఎంత మొత్తం పెంచాల‌నుకుంటున్నారో తెలియ‌చేయ‌డం. రెండోది కొత్త సిప్ ను తీసుకోవ‌డం. ఈ రెండు ప‌ద్ధ‌తుల్లోనూ అదే ఫండ్లో పెట్టుబ‌డి చేయ‌వ‌చ్చు. సిప్ ద్వారా కాంట్రీబ్యూష‌న్‌ను పెంచేందుకు స్టెప్ అప్ సిప్ విధానాన్ని అనుస‌రించ‌వ‌చ్చు. స్టెప్ అప్ సిప్‌లో ముందుగా నిర్ణ‌యించిన మొత్తానికి, ముందుగా నిర్ణ‌యించిన కాలానికి స్వ‌యంచాలాకంగా మ‌దుపర్లు, మ‌దుపు చేసే మొత్తం పెరుగుతుంది. అంటే ఏడాదికోసారి లేదా ఆరునెల‌ల‌కోసారి సిప్ మొత్తాన్ని పెంచే అవ‌కాశం ఉంటుంది. క్ర‌మంగా సిప్ పెంచ‌డం మూలంగా అంతిమ ఫ‌లితాం భారీగా పెరుగుతుంది.

సిప్ పెంచే విధానం, నియ‌మాలు:
సిప్ మొత్తాన్ని పెంచేందుకు ఎటువంటి నియమాలు లేవు. ఎప్పుడైనా పెంచుకోవ‌చ్చు. ప్రతీ ఆస్తి నిర్వహణ సంస్థ రూ.100 నుంచి రూ.1000 వ‌ర‌కు క‌నీసం సిప్ చేయాల‌నే నియమాన్ని క‌లిగి ఉంటుంది. ముందుగా సిప్‌ ప్రారంభించిన సంస్థ‌ను సంప్రదించాలి. ఈసీఎస్ వంటి నిర్ధిష్ట విధానం ద్వారా సిప్ ప్రారంభించిన‌ట్ల‌యితే అద‌న‌పు మొత్తానికి కొత్త సిప్‌ను ప్రారంభించాల్సి ఉంటుంది. ఒన్ టైమ్ మ్యానిడేట్ ద్వారా ప్రారంభించి ఉంటే అద‌న‌పు మొత్తాన్ని అదే మాధ్య‌మం ద్వారా కొన‌సాగించ‌వ‌చ్చు. ఇందుకు అద‌న‌పు పేప‌ర్ వ‌ర్క్ అవ‌స‌రం లేదు.

స‌రైన స‌మ‌యం:
సిప్ ప్రారంభం లేదా పెంచాల‌నే నిర్ణ‌యం తీసుకునే ముందు మీరు ఎంచుకునే ల‌క్ష్యం, దానికి గ‌ల స‌మయం, కార్ప‌స్‌ల‌పై దృష్టి పెట్టాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్లు బ‌ల‌హీనంగా ఉన్న‌ప్ప‌టికీ సిప్‌ని పూర్తిగా నిలిపివేయ‌డం మంచిది కాదు. ఇందుకు బ‌దులుగా మార్కెట్ల‌తో పూర్తిగా సంబంధం లేని పెట్టుబ‌డుల‌కు మ‌ళ్ళించ‌వ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly