ఎన్‌పీఎస్ టైర్‌-II ఖాతాను ఎలా ప్రారంభించాలి?

యాక్టీవ్‌ టైర్‌-I ఖ‌తా ఉన్న‌వారు మాత్ర‌మే ఎన్‌పీఎస్‌లో టైర్‌-II ఖాతాను ప్రారంభించాలి

ఎన్‌పీఎస్ టైర్‌-II ఖాతాను ఎలా ప్రారంభించాలి?

దీర్ఘ‌కాలంపాటు పొదుపు అల‌వాటుతో ప్ర‌జ‌లు సంప‌ద సృష్టించుకోవాల‌నే స‌దుద్దేశంతో భార‌త ప్ర‌భుత్వం నేష‌న‌ల్ పెన్ష‌న్ స్కీమ్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ఆర్థిక భ‌ద్ర‌త‌కు, ఈ ప‌థ‌కం తోడ్ప‌డుతుంది. ఇందులో ప్ర‌ధానంగా టైర్‌-I, టైర్‌-II అనే రెండు ఖాతాలు ఉంటాయి. టైర్‌-I ఖాతా ప్రాథ‌మిక ప‌ద‌వీ విర‌మ‌ణ ఖాతా. దీనికి అన్ని ప‌న్ను ప్ర‌యోజ‌నాలు వ‌ర్తిస్తాయి. దీనితోపాటు ఎన్‌పీఎస్ చందాదారులు టైర్‌-II ఖాతాను కూడా స్వ‌చ్ఛంధంగా నిర్వ‌హించుకోవ‌చ్చు. దీనిని పెట్టుబ‌డుల ఖాతాగా భావించ‌వ‌చ్చు. యాక్టీవ్‌లో ఉన్న టైర్‌-I ఖాతాను క‌లిగి ఉన్న ఎన్‌పీఎస్ చందాదారుడు టైర్‌-II ఖాతాను తెర‌వ‌వ‌చ్చు. టైర్‌-II ఖాతాకు 3 సంవ‌త్స‌రాల లాక్ ఇన్ పిరియ‌డ్ ఉంచాల‌నే ప్ర‌తిపాద‌న‌లో కేంద్ర ప్ర‌భుత్వం ఉంది. దీనితో పాటు ప్రభుత్వం ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80 సీ ప్ర‌కారం టైర్‌-II ఖాతా లో ప‌న్ను మిన‌హాయింపు అవకాశాన్ని కూడా ప్రతిపాదించింది.

టైర్‌-II ఖాతాను ప్రారంభించడానికి రెండు విధానాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

ఏ. ఆఫ్‌లైన్ విధానం:

 1. సీఎస్ఆర్ఎప్‌-Iకి సంబంధించిన‌ అనుబంధం I ని పూరించండి.

 2. మీ కార్యాలయంలో/ పీఓపీ-ఎస్‌పీలో సంబంధిత డాక్యుమెంట్‌ల‌తో పాటు వివ‌రాలు నింపిన దరఖాస్తు ఫార‌మ్‌ను స‌మ‌ర్పించ‌డం.

 3. కావ‌ల‌సిన ప‌త్రాలు

 • సీఎస్ఆర్ఎప్‌-Iకి సంబంధించిన‌ అనుబంధం I ఫార‌మ్‌
 • ప్రాన్‌(పీఆర్ఏఎన్‌) కార్డ్ కాపీ
 • పాన్ కార్డు & ర‌ద్దు చేసిన చెక్కు
 1. క‌నీస కాంట్రీబ్యూష‌న్ మొత్తం వెయ్యి రూపాయిలు చెల్లించి ర‌సీదు తీసుకోవాలి.

బీ. ఆన్‌లైన్ విధానం:

 1. ఈఎన్‌పీఎస్ వెబ్‌సైట్‌లోకి ప్ర‌వేశించేందుకు ఈ లింకును(https://enps.nsdl.com) క్లిక్‌చేస్తే దిగువ‌న చూపించిన విధంగా పేజీ వ‌స్తుంది.
NPS Tier II a.jpg

ఇందులో నేష‌నల్ పెన్ష‌న్ సిస్ట‌మ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఈ కింది విధంగా మ‌రో పేజీ వ‌స్తుంది.

NPS Tier II b.jpg

ఇందులో టైర్‌-II యాక్టీవేష‌న్‌ పై క్లిక్ చేయాలి.

 1. ఓటీపీ పొంద‌డం కోసం ఈ కింది వివ‌రాల‌ను త‌ప్ప‌నిస‌రిగా పూర్తిచేయాలి.
 • శాశ్వ‌త ప‌ద‌వీవిర‌మ‌ణ ఖాతా సంఖ్య (పీఆర్ఏఎన్‌)
 • పుట్టిన తేదీ( తేదీ/నెల‌/సంవ‌త్స‌రం విధానంలో)
 • శాశ్వ‌త ఖాతా సంఖ్య (పాన్‌)
NPS Tier II c.jpg
 1. ఆన్‌లైన్‌లో అందించ‌వ‌ల‌సిన అన్ని త‌ప్పినస‌రి వివ‌రాల‌ను పూర్తి చేసిన త‌రువాత ఆన్‌లైన్ చెల్లింపులు చేయాలి. చెల్లింపులు చేయ‌వ‌ల‌సిన క‌నీస మొత్తం రూ.1000
 2. పాన్, ర‌ద్దు చేసిన చెక్కుల‌తో పాటు ద‌ర‌ఖాస్తు ఫార‌మ్‌ను పోస్ట్ ద్వారా ఎన్ఎస్‌డీఎల్ - సీఆర్ఏకి పంపించాలి.

దీనికి సంబంధించి అద‌నంగా ఎలాంటి పీఓపీ ఛార్జీల‌ను చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. ఖాతా యాక్టివేష‌న్ కోసం సీఆర్ఏ రూ.20 ఛార్జీల‌ను విధిస్తుంది. అలాగే ప్ర‌తీ లావాదేవికి విడివిడిగా ఫీజుల‌ను విధిస్తుంది. కాంపోజిట్ అప్లికేష‌న్‌ను నింప‌డం ద్వారా ఒకేసారి టైర్‌-1, టైర్‌-2 ఖాతాల‌ను ప్రారంభించుకోవ‌డం మంచిది. ఈ టైర్‌-2 ఖాతా ద్వారా ఉప‌సంహ‌రించుకున్న సొమ్ముపై ఎలాంటి నిష్క్ర‌మ‌ణ రుసుములు ఉండ‌వు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly