వర్షా కాలం వచ్చింది..మీ వాహనం సురక్షితమేనా?

దేశంలో సంభవించిన వరదలు కోట్లాది మంది వాహనదారుల ఆర్ధిక పరిస్థితి పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి

వర్షా కాలం వచ్చింది..మీ వాహనం సురక్షితమేనా?

సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మందికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే మరికొందరికి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. మరీ మఖ్యంగా వాహన వినియోగదారులను అనేక కష్టాలకు గురి చేస్తుంది. ఇటీవల అనేక రాష్టాల్లో కురిసిన వర్షాల కారణంగా సంభవించిన వరదల్లో వందల మంది ప్రాణాలను కోల్పోగా, లక్షల సంఖ్యలో ప్రజల ఇల్లు, వాహనాలు పాడైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో గృహ, వాహన యజమానులకు ఇంటి బీమా, వాహన బీమా రక్షణగా నిలవనున్నాయి.

ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు దాని బారి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అయితే, దాని తీవ్రత నుంచి బయటపడటానికి మనకున్న ఏకైక మార్గం ఏమిటంటే బైకు, కారు మొదలైన వాహనాలకు సరైన మోటారు బీమా కవరేజ్ ను తీసుకుని వాటికి ఆర్థిక రక్షణ కల్పించడం. దేశంలో సంభవించిన వరదలు కోట్లాది మంది వాహనదారుల ఆర్ధిక పరిస్థితి పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ ఆర్థిక భారం నుంచి బయటపడటానికి సమగ్ర మోటార్ బీమా పాలసీని తీసుకోవడం మంచిదని కవర్ఫాక్స్.కామ్ ఫౌండర్ దేవేంద్ర రానే తెలిపారు.

ఒక సమగ్ర మోటార్ బీమా పధకం, మీ వాహనం కోసం సంపూర్ణ ఆర్థిక రక్షణ పొందగల ఏకైక మార్గం. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కార్యకలాపాల కారణంగా మీ వాహనానికి ఏదైనా నష్టం వాటిల్లితే ఈ పాలసీ ద్వారా కవరేజ్ లభిస్తుంది. వాటిలో

 1. వరదలు, అన్ని రకాల తుఫాన్లు, హరికేన్, ఉరుములు, వడగళ్ళు తుఫాను, భూకంపం, మెరుపు, కొండచరియలు విరిగిపడడం వంటి ప్రకృతి వైపరీత్యాలు లేదా తీవ్ర వాతావరణ పరిస్థితుల వలన కలిగే నష్టం.

 2. మంట, పేలుడు, స్వీయ - ఇగ్నిషన్

 3. దొంగతనం, ఇల్లు కూలిపోవడం

 4. ధర్నాలు, సమ్మెలు

 5. ఇతర మార్గాల ద్వారా జరిగే ప్రమాదం

 6. రహదారి, రైలు, జలమార్గం, లిఫ్ట్, ఎలివేటర్ లేదా గాలి ద్వారా రవాణా చేసినప్పుడు

ఒకవేళ వాహనం వరదలు కారణంగా నష్టపోయినట్లైతే, సమగ్ర మోటార్ బీమా పాలసీ కింద క్లెయిమ్ కోసం దావా వేయవచ్చు. భారీ వరదల కారణంగా వాహన ఇంజిన్ పాడైపోయినప్పుడు, చెట్లు పడిపోవడం వలన వాహనానికి తీవ్రమైన నష్టం వాటిల్లినప్పుడు లేదా కొన్ని వస్తువులు ఢీ కొట్టడం వలన కారు విన్షీల్డ్ కి ఏదైనా నష్టం వాటిల్లితే వాటికి కవరేజ్ లభిస్తుంది. అయితే, కొన్ని సందర్భాల్లో సమగ్ర మోటార్ బీమా కవరేజ్ కూడా సరిపోదు.

ప్రకృతి వైపరీత్యాల కారణంగా సంభవించే అన్ని రకాల నష్టాలకు మోటార్ బీమా పాలసీ ద్వారా కవరేజ్ లభిస్తుందని బీమాదారులు చెప్తారు. అయినప్పటికీ, వినియోగదారులు చేసే కొన్ని రకాల చర్యల ద్వారా సాధారణ మోటార్ బీమా పాలసీ కవరేజ్ లభించదు.

అలాంటి వాటిలో హైడ్రో స్టాటిక్ లాక్ లేదా ఇంజిన్ సీజర్ ఒకటి. సాధారణంగా తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న కార్ల ఇంజన్లోకి నీరు ప్రవేశించినప్పుడు, ఇంజిన్ సీజ్ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో సంభవించే నష్టాలకు మోటారు బీమా పధకాలు కవరేజ్ ని అందించవు. అందువలన రోడ్లు ఎక్కువ నీటితో నిండిన ప్రాంతాలలో కారు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో మొదటగా మీరు చేయవలసిన పని ఏమిటంటే, నీరు ఎక్కువగా లేని చోట కారును నిలిపి, ఇంజిన్ ను ఆపేయడం మంచిది. ఒకవేళ మీరు ‘ఇంజిన్ ప్రొటెక్టర్’ వంటి యాడ్-ఆన్ కవర్ ను కలిగి ఉన్నట్లయితే, అప్పుడు మీకు బీమా క్లెయిమ్ లభిస్తుంది. అలాగే, పాలసీదారుడు ‘రోడ్ సైడ్ అసిస్టెన్స్’ యాడ్-ఆన్ కవర్ ను కలిగి ఉంటే, అప్పుడు కేవలం ఒక ఫోన్ కాల్ చేసినట్లయితే, మీ వాహనాన్ని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్తారని ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్. కన్నన్ తెలిపారు.

ఒకవేళ మీకు ఇంజిన్ ప్రొటెక్టర్, రోడ్ సైడ్ అసిస్టెన్స్ యాడ్ ఆన్ కవరేజ్ లేకపోతే, నీరు ఎక్కువగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో కారును నడపకపోవడం మంచిది. నీటి ప్రవాహం తగ్గేవరకూ అక్కడ వేచి ఉండాల్సిన అవసరం లేకుండా టోయింగ్ ఏజెన్సీ కి ఫోన్ చేస్తే, వారు వచ్చి మీ వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తారు.

ఒకవేళ వాహనం పూర్తిగా నీటిలో మునిగి ఉన్నట్లయితే, ఇంజిన్ లోకి అధిక మొత్తంలో నీరు చేరడం ద్వారా కారుకి పూర్తి నష్టం వాటిల్లవచ్చు. అటువంటి సందర్భాలలో, న్యూ వెహికల్ రీప్లేస్మెంట్ కవర్ సహాయపడుతుంది, లేదంటే కేవలం ఐడీవీ (బీమా చేసిన డిక్లెర్స్ విలువ) ను మాత్రమే సంస్థ చెల్లిస్తుంది.

మీ వాహనాలను పూర్తిగా రక్షించుకోవడానికి, మీరు అదనపు యాడ్- ఆన్ రైడర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మీరు కొనుగోలు చేయగల కొన్ని ముఖ్యమైన రైడర్లను కింద తెలియచేశాము.

 • రిటర్న్ టూ ఇన్వాయిస్ కవర్ :

పూర్తిగా దెబ్బతిన్న వాహనం లేదా చెట్టు విరిగిపడడం వలన జరిగే ప్రమాదాల నుంచి మీ వాహనాన్ని రక్షించుకోడానికి ఈ కవర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ వాహనానికి పూర్తి నష్టం వాటిళ్లినా లేదా దొంగతనానికి గురైనా కేవలం ఐడీవీ (బీమా చేసిన డిక్లెర్స్ విలువ) కాకుండా రిజిస్ట్రేషన్ రుసుము, రహదారి పన్ను, బీమా తో కలిపి పూర్తి మొత్తం లభించేలా ఈ యాడ్ - ఆన్ కవర్ మీకు సహాయపడుతుంది.

 • అత్యవసర రోడ్డు సైడ్ అసిస్టెన్స్ :

ఒకవేళ మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు అనుకోకుండా మీ వాహనానికి ఏదైనా సమస్య ఏర్పడితే, అలాంటి సమయంలో ఈ యాడ్ ఆన్ కవర్ చాలా ఉపయోగపడుతుంది. ఈ యాడ్ ఆన్ ద్వారా బీమా సంస్థ ఇంధనం నింపడం, పంక్చర్ అయిన టైర్ ను మార్చడం, ప్రమాదానికి గురైన వాహనాన్ని సర్వీస్ స్టేషన్ కు తీసుకెళ్లడం, వాహనాన్ని రిపేర్ చేయడం వంటి సేవలను అందిస్తుంది. అలాగే ప్రమాద వశాత్తు కారు బ్రేక్ డౌన్ అయిన సందర్భాల్లో కూడా ఈ కవర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

 • ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్ :

ఒకవేళ మీరు ఎక్కువగా వరదలు సంభవించే ప్రాంతంలో నివసిస్తున్నట్లైతే, మీరు ఈ యాడ్ ఆన్ కవర్ ను తీసుకోవడం మంచిది. వాహన ఇంజిన్ పూర్తిగా నీటిలో ఉండడం వలన ఇంజిన్ కు కలిగే నష్టం ఈ యాడ్ ఆన్ ద్వారా కవర్ అవుతుది. అలాగే ఇది ఆయిల్ లీకేజ్, గేర్ బాక్స్ డామేజ్ వంటి వాటికి కూడా వర్తిస్తుంది.

 • యాక్ససరీస్ కవరేజ్ :

ఒక వ్యక్తి కారును తనకు అనుకూలంగా మార్చుకుంటే, కారులో చేసిన మార్పుల కారణంగా బీమా రద్దు అవుతుందనే విషయాన్ని నిర్ధారించుకోవాలి.
ఉదాహరణకు ఇంజిన్ కు లేదా మెకానికల్ వస్తువులకు చేసిన మార్పులు ప్రామాణిక కవరేజ్ కిందకు రావు. ఒకవేళ మీరు బీమా కవరేజ్ ను పొందాలనుకుంటే, మీరు చేయాలనుకుంటున్న మార్పులను పరిమితం చేయాలి. కారులో మార్పులు చేయాలనుకునే ముందు బీమా పరిమితులకు సంబంధించి ఏజెంట్ ను సంప్రదించడం మంచిది.

 • జీరో డిప్రిసియేషన్ కవర్ :

ఈ యాడ్ ఆన్ ను కొత్త కార్ల కోసం ఎక్కువగా సిఫార్సు చేస్తారు, ఎందుకంటే ఇది పాలసీదారుడికి నష్టాల వ్యయాన్ని తగ్గించటానికి సహాయపడుతుంది. ఒకవేళ ఈ యాడ్ ఆన్ తీసుకోకపోతే, ప్లాస్టిక్ / రబ్బరు, ఫైబర్, మెటల్, పెయింట్ పదార్థాలకు అయ్యే ఖర్చును పాలసీదారుడు భరించవలసి ఉంటుంది. దీనిని నిల్ డిప్రిసియేషన్ లేదా బంపర్ టూ బంపర్ అని కూడా పిలుస్తారు, ఇది మీకు పూర్తి కవరేజ్ ను అందిస్తుంది. ఇది సాధారణ బీమా ప్రీమియం కంటే 15 నుంచి 20 శాతం ఎక్కువగా ఉంటుంది. జీరో డిప్రిసియేషన్ కవర్ విలాసవంతమైన కార్లు, ఖరీదైన విడిభాగాలు ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly