ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేస్తున్నారా? ఇది చదవండి..

ఈక్విటీ ఫండ్లలో మదుపు చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేస్తున్నారా? ఇది చదవండి..

మ్యూచువల్ ఫండ్లలో, ముఖ్యంగా ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయడం ద్వారా మంచి రాబడి పొంది, తద్వారా సంపద సృష్టించుకోవచ్చనే విషయం ఇప్పటికే అందరికి తెలిసిన విషయం. కానీ 40 ఏఎమ్సీ(అసెట్ మ్యానేజ్మెంట్ కంపెనీస్) లో కలిపి సుమారుగా 1600 మ్యూచువల్ ఫండ్ పధకాలు ఉన్నాయి. వీటిలో ఏది, ఎలా ఎంచుకోవాలి? పైగా మార్కెట్ ఒకోసారి ఒకో లాగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఈక్విటీ ఫండ్లలో మదుపు చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం…

  1. స్వల్ప కాలం రాబడి చూసి మోసపోకండి, దీర్గాకాలం రాబడి చుడండి. గత 3, 5 సంవత్సరాల రాబడి ని బట్టి నిర్ణయం తీసుకోండి. అలాగే ప్రతి 6 నెలలకోసారి సమీక్షించుకోండి, దీని వల్ల వరుసగా రాబడి తక్కువగా ఉన్న ఫండ్లను మార్చుకోవచ్చు.

  2. కొత్తగా ప్రవేశ పెట్టే ఫండ్ల నుంచి దూరంగా ఉండండి. ఎందుకంటే వీటి రాబడి గురించి కానీ, పని తీరు గురించి కానీ మనకి ఎటువంటి అవగాహన ఉండదు.

  1. ఫండ్ పని తీరు గురించి తెలుసుకోవడానికి సంబంధించిన బెంచ్ మార్క్ రాబడి తో పోల్చండి. టోటల్ రిటర్న్ ఇండెక్స్ తో పోల్చడం మంచిది.

  2. ఫండ్ నిర్వహణ కింద ఆస్తులు(ఏయూఎమ్) కనీసం రూ. 2000 కోట్లు ఉన్న ఫండ్లలో మదుపు చేయడం మంచిది. కొన్ని పరిస్థితుల వల్ల ఉపసంహరణలు ఎక్కువ ఉన్నప్పుడు చిన్న వాటికంటే పెద్ద ఫండ్లు తట్టుకోగలవు. పైగా పెద్ద ఫండ్లలో చార్జీలు తక్కువ ఉంటాయి.

  3. నిలకడగా ఉన్న ఫండ్లకు ప్రాధాన్యత ఇవ్వండి. కొన్ని ఫండ్లు ఒకే సంవత్సరం లో 30 లేదా 40 శాతం రాబడి ఇవ్వచ్చు, కానీ తరువాత రెండు సంవత్సరాల్లో నష్టం చూపించవచ్చు. ఇలాంటి ఫండ్లకంటే నిలకడగా 10 లేదా 12 శాతం రాబడి ఇవ్వడం మంచిది.

  4. రాబడి ఎంత ముఖ్యమో ఫండ్ లో రిస్క్ కూడా అంతే ముఖ్యం. ఎక్కువ రిస్క్ తో 15 రాబడి కంటే తక్కువ రిస్క్ తో 12 శాతం రాబడి వచ్చిన పరవాలేదు. అధిక రిస్క్ ఉంటే పెట్టుబడి పై నష్టాలు కూడా రావచ్చని గమనించండి. రిస్క్ తెలుసుకోవడానికి ప్రామాణిక విచలనం (స్టాండర్డ్ డీవియేషన్) ని పరిశీలించండి, ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది.

  5. ఫండ్ కి సంబంధించిన ముఖ్య సిబ్బంది, అంటే ఫండ్ మ్యానేజర్, సీఈఓ, సిఐఓ లాంటి వారి గురించి ఆరా తీయండి. వీరు నిలకడగా ఉంటే మంచిది. ఎందుకంటే సిబ్బంది మారుతున్నా కొద్దీ ఫండ్ నిర్వహణ పద్ధతులు కూడా మారతాయి.

  6. మీ మిగులు డబ్బు, లక్ష్యాలను బట్టి ప్రతి నెలా సిప్ చేయండి. దీని వల్ల మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోగలుగుతారు, మంచి సంపద సృష్టించుకోగలుగుతారు. ఈక్విటీ ఫండ్లలో స్వల్ప కాలం లో నష్టాలు కూడా రావచ్చు, కానీ సిప్ ద్వారా దీర్ఘకాలం లో ఇది తగ్గవచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly