ఈపీఎఫ్ఓ ​​పోర్టల్ లో కేవైసీని ఎలా అప్‌డేట్ చేయాలి?

ఈపీఎఫ్ఓ ​​యూఏఎన్ పోర్టల్‌ లో లాగిన్ అయ్యి, అవసరమైన పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా మీ కేవైసీని అప్‌డేట్ చేసుకోవచ్చు

ఈపీఎఫ్ఓ ​​పోర్టల్ లో కేవైసీని ఎలా అప్‌డేట్ చేయాలి?

చాలా మంది ఈపీఎఫ్ఓ చందాదారులకు ఇది సాధారణ సమస్య. యూఏఎన్ ను ఉపయోగించి, ఈపీఎఫ్ఓ ​​పోర్టల్ లో లాగిన్ అవ్వడం ద్వారా మీ కేవైసీ సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ ​​పోర్టల్‌లో మీ కేవైసీ వివరాలను అప్‌డేట్ చేయడానికి లేదా మార్చడానికి మీకు యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నంబర్) అవసరం. మీరు ఈపీఎఫ్ఓ ​​యూఏఎన్ పోర్టల్‌ లో లాగిన్ అయ్యి, అవసరమైన పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా మీ కేవైసీని అప్‌డేట్ చేసుకోవచ్చు.

కేవైసీ వివరాలలో పాన్ కార్డ్ నంబర్, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు ఉంటాయి. ఒకవేళ మీరు ఈ వివరాలను ఈపీఎఫ్ఓ ​​పోర్టల్‌లో ఇంకా అప్‌డేట్ చేయకపోతే, వెంటనే అప్‌డేట్ చేయండి. ఈపీఎఫ్ లో కేవైసీని అప్‌డేట్ చేయడం ద్వారా కింద తెలిపిన ప్రయోజనాలను పొందవచ్చు.

కేవైసీ ప‌త్రాల‌ను అప్‌డేట్ చేయడం ద్వారా నగదు బదిలీ లేదా నగదు ఉపసంహరణ సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. ఒకవేళ మీ బ్యాంక్ ఖాతా వివరాలను అప్‌డేట్ చేయకపోతే, మీ క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ కేవైసీ పత్రాలను సమర్పించకపోతే, ఈపీఎఫ్ చందాదారులు ఎస్ఎంఎస్ అలర్ట్స్ ను పొందలేరు.

కేవైసీ వివరాలను అప్‌డేట్ చేసుకోడానికి కింద తెలిపిన పత్రాలు అవసరం.

  • జాతీయ జనాభా రిజిస్టర్
  • ఆధార్ నెంబర్
  • పాన్
  • బ్యాంకు ఖాతా నెంబర్
  • పాస్ పోర్టు
  • డ్రైవింగ్ లైసెన్స్
  • ఎలక్షన్ కార్డు
  • రేషన్ కార్డు

ఈపీఎఫ్ యూఏఎన్ ఆన్‌లైన్ కోసం కేవైసీని ఎలా అప్‌డేట్ చేయాలి?

స్టెప్ - 1 - యూఏఎన్ ను ఉపయోగించి ఈపీఎఫ్ఓ యూఏఎన్ పోర్టల్‌లో లాగిన్ అవ్వండి - https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/. మ్యానేజ్ టాబ్‌లో, మీకు ‘కేవైసీ’, కాంటాక్ట్ డిటైల్స్ కనిపిస్తాయి.

స్టెప్ - 2 - మీరు జాబితా నుంచి అప్‌డేట్ చేయాలనుకుంటున్న కేవైసీ సమాచారాన్ని ఎంచుకోండి.

స్టెప్ - 3 - ఒకసారి మీరు సిస్టమ్‌ను ఎంచుకున్న తర్వాత డాక్యుమెంట్ ప్రకారం, డాక్యుమెంట్ నంబరు, పేరును నమోదు చేయడానికి అనుమతిస్తుంది. ఒకవేళ మీరు బ్యాంక్ ఖాతాను అప్‌డేట్ చేస్తున్నట్లైతే, ఐఎఫ్ఎస్సీ కోడ్‌ను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ ను అప్‌డేట్ చేస్తున్నట్లైతే, వాటి గడువు తేదీని తప్పనిసరిగా నమోదు చేయాలి. బ్యాంక్ అకౌంట్ నంబర్, పాన్, ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ మొదలైనవాటిని మీరు అప్‌డేట్ చేయగలరు. కేవైసీకి పాన్, బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ తప్పనిసరి.

స్టెప్ - 4 - మీరు డేటాను నమోదు చేసిన తర్వాత సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. అనంతరం మీరు కేవైసీ డేటా అప్‌డేట్ విజయవంతంగా పూర్తయిందనే పాప్ అప్ ను పొందుతారు. మీరు కేవైసీ పత్రాలను సరిగ్గా అప్‌డేట్ చేసినట్లయితే, “కేవైసీ పెండింగ్ ఫర్ అప్రూవల్” అనే మెసేజ్ ను చూడవచ్చు. సవరించిన వివరాలను సంస్థ యజమాని ఆమోదించే వరకు కేవైసీ స్టేటస్ పెండింగ్‌ అని చూపిస్తుంది.

ఒకవేళ మీ కేవైసీ వివరాలను సరిగ్గా నమోదు చేయకపోతే, మీరు “డిలీట్” బటన్‌ పై క్లిక్ చేయండి. ఇది మీరు సబ్మిట్ చేసిన కేవైసీ సమాచారాన్ని తొలగిస్తుంది.

స్టెప్ -5 - మీరు చేసిన సవరణలను మీ యజమాని ఆమోదించినట్లైతే, అప్పుడు ‘అప్రూవ్డ్ బై ఎంప్లోయర్’ అని కనిపిస్తుంది. అలాగే మీరు ఎస్ఎంఎస్ ను కూడా పొందుతారు.

సాధారణంగా ఈపీఎఫ్ఓ చందాదారులకు ఎక్కువగా వచ్చే సందేహాలను కింద చూద్దాం…

కేవైసీ వివరాలను అప్‌డేట్ చేయడం తప్పనిసరా?

కేవైసీ వివరాలను అప్‌డేట్ చేయడం తప్పనిసరి కాదు. అయితే, మీ క్లెయిమ్‌ వేగంగా ప్రాసెస్ అవడానికి ఈ వివరాలు మీకు సహాయపడతాయి. ఒకవేళ మీ కేవైసీ వివరాలు అప్‌డేట్ అయినట్లయితే, మీరు రెగ్యులర్ గా ఎస్ఎంఎస్ అప్‌డేట్ లను పొందవచ్చు.

డాక్యుమెంట్ ను నేరుగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయవచ్చా?

మీరు ఎలాంటి డాక్యుమెంట్ ను ఆన్లైన్ లో అప్‌లోడ్ చేయలేరు. కేవైసీ ని అప్‌డేట్ చేసేటప్పుడు, మీరు డాక్యుమెంట్ ప్రకారం, డాక్యుమెంట్ నెంబర్, పేరును నమోదు చేయాలి. ఒకవేళ మీరు పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ను అప్‌డేట్ చేస్తున్నట్లైతే, వాటి గడువు తేదీని తప్పనిసరిగా నమోదు చేయాలి.

మరింత సమాచారం కోసం హెల్ప్ డెస్క్ నెంబర్ - 1800118005 కి కాల్ చేయండి లేదా హెల్ప్ డెస్క్ ఈ-మెయిల్ ఐడీ - uanepf@epfindia.gov.in కి మెయిల్ చేయండి.

చివరగా :

ఈపీఎఫ్ యూఏఎన్ పోర్టల్‌లో కేవైసీని అప్‌డేట్ చేయడానికి అందించిన సౌకర్యం ఈపీఎఫ్ఓ ​​చందాదారులకు అనేక్ ప్రయోజనాలను అందిస్తుంది. ఒకవేళ మీ వివరాలను ఇంకా అప్‌డేట్ చేయకపోతే, వెంటనే అప్‌డేట్ చేయండి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly