ఈపీఎఫ్ ఖాతాలోని నగదును ఉపసంహరించుకోండిలా..

నగదును ఉపసంహరించుకోవాలనుకున్న వారు తమ ఆధార్ నెంబర్ ను పాన్ ఖాతాతో జత చేయాల్సి ఉంటుంది

ఈపీఎఫ్ ఖాతాలోని నగదును ఉపసంహరించుకోండిలా..

ప్రస్తుతం ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) లో దాదాపు ఐదు కోట్ల కంటే ఎక్కువ మంది చందాదారులు ఉన్నారు. ఒకవేళ పదవీ విరమణ చేసిన ఉద్యోగులను కలుపుకుంటే ఈ సంఖ్య 19 కోట్లకు పైమాటే. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వీరిలో సుమారు 8.38 కోట్ల మంది చందాదారుల పుట్టిన తేదీ, అలాగే సుమారు 11.07 కోట్ల మంది చందాదారుల తండ్రి పేరు ఈపీఎఫ్ఓ తో నమోదు కాలేదు.

ఇటీవల, ఈపీఎఫ్ఓ తన చందాదారులకు ఒక ప్రయాజనాన్ని కల్పించింది. ఎవరైతే తమ ఉద్యోగాన్ని కోల్పోయి, నెల రోజుల పాటు నిరుద్యోగిగా ఉన్నట్లైతే, అలాంటి సందర్భంలో తమ ఈపీఎఫ్ ఖాతా నుంచి 75 శాతం వరకు నిధులను ఉపసంహరించుకునే అవకాశాన్ని కల్పించింది. ఒకవేళ రెండు నెలల పాటు నిరుద్యోగిగా ఉన్న సందర్భంలో మిగిలిన 25 శాతాన్ని కూడా ఉపసంహరించుకునే అవకాశాన్ని తమ చందాదారులకు కల్పించింది.

అయినప్పటికీ, మీ ఖాతాలోని నగదును ఉపసంహరించుకోడానికి మీరు కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. నగదును ఉపసంహరించుకోవాలనుకున్న వారు తమ ఆధార్ నెంబర్ ను పాన్ ఖాతాతో జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈపీఎఫ్ఓ ఖాతాకు ఆధార్ నెంబర్ ను జత చేయకపోతే, నగదును ఉపసంహరించుకునే అవకాశం ఉండదు.

ఆధార్ ను ఈపీఎఫ్ఓ ​​ఖాతాతో అనుసంధానించడం ఈపీఎఫ్ఓ తప్పనిసరి చేసింది. అయితే, ఆధార్ ను అనుసంధానించే ముందు, మీ మొబైల్ నెంబర్ ను ఆధార్ తో అలాగే యూఏఎన్ నంబర్ తో అనుసంధానించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇంకా దీనిని పూర్తి చేయకపోతే, కింద తెలిపిన విధంగా దీనిని పూర్తి చెయ్యవచ్చు.

ss.png
  • యూఏఎన్ ఆధార్ లింక్ పై క్లిక్ చేయండి
  • యూఏఎన్ నెంబర్ ను నమోదు చేయండి
  • మీ మొబైల్ నెంబర్ ను నమోదు చేసి, జనరేట్ ఓటీపీ పై క్లిక్ చేయండి
  • మీ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీ ని నమోదు చేయండి
  • మీ జండర్ ను ఎంచుకోండి
  • ఆధార్ నెంబర్ ను నమోదు చేయండి
  • నమోదు చేసిన (ఓటీపీ పొందే) మొబైల్ నెంబర్/ఈ-మెయిల్ ను ఎంచుకోండి.
  • అనంతరం సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి
  • మరలా మీ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది
  • ఓటీపీ ని నమోదు చేసి సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి

ప్రత్యామ్నాయంగా, మీరు ఈపీఎఫ్ఓ ఆన్ లైన్ పోర్టల్ లో లాగిన్ అవ్వడం ద్వారా కూడా మీ ఆధార్ ను అనుసంధానించవచ్చు. లాగిన్ అవ్వడానికి ముందుగా మీరు పోర్టల్ లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly