ఆన్ లైన్ ద్వారా పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోండిలా..

గతంలో, నగదును ఉపసంహరించుకోడానికి ఉద్యోగులు తప్పనిసరిగా సంస్థ నుంచి ధృవీకరణ పత్రాన్ని తీసుకోవాల్సి వచ్చేది

ఆన్ లైన్ ద్వారా పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోండిలా..

వేతన జీవులు తాము సంపాదించే డబ్బులో కొంత మొత్తాన్ని ఆదా చేసుకోడానికి అందుబాటులో ఉన్న ఉత్తమ మార్గాలలో ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) ఒకటి. పదవీ విరమణ ప్రయోజనాలను అందించడం కోసం ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో, మీ పీఎఫ్ ఖాతాలోని డబ్బును ఉపసంహరించుకోవచ్చు. అలాగే మీరు నేరుగా లేదా ఆన్ లైన్ ద్వారా కూడా డబ్బుని ఉపసంహరించుకోవచ్చు. మీ ఆధార్ నెంబర్ ను మీ యూఏఎన్ తో అనుసంధానించిన్నప్పుడు మాత్రమే మీరు ఆన్ లైన్ ద్వారా నగదును ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. గతంలో, నగదును ఉపసంహరించుకోడానికి ఉద్యోగులు తప్పనిసరిగా సంస్థ నుంచి ధృవీకరణ పత్రాన్ని తీసుకోవాల్సి వచ్చేది.

ఈపీఎఫ్ ఉపసంహరణ ఫారంను పూరించడానికి, ఆన్ లైన్ లో క్లెయిమ్ ని దాఖలు చేయడానికి అనుసరించాల్సిన స్టెప్స్ ను మీ కోసం కింద తెలియచేయడం జరిగింది.

1.యూఏఎన్ నెంబర్, పాస్ వర్డ్ ను ఉపయోగించి ఈపీఎఫ్ఓ పోర్టల్ లో లాగిన్ అవ్వండి.

2.‘మ్యానేజ్’ ట్యాబ్ పై క్లిక్ చేసి కేవైసీ వివరాలను ధృవీకరించండి.

3.అనంతరం పైన మెనూలో ఉన్న ‘ఆన్ లైన్ సర్వీసెస్’ ట్యాబ్ పై క్లిక్ చేసి క్లెయిమ్ (ఫారం -31, 19 & 10సీ) ఎంచుకోండి.

4.‘మెంబర్ డిటైల్స్’ స్క్రీన్ పై కనిపిస్తాయి. అనంతరం మీ బ్యాంకు ఖాతా చివరి 4 అంకెలను నమోదు చేసి, ‘వెరిఫై’ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

5.అనంతరం ‘యెస్’ పై క్లిక్ చేసి, ‘ప్రొసీడ్ ఫర్దర్’ పై క్లిక్ చేయండి.

  1. ఆన్ లైన్ ద్వారా ఉపసంహరణ క్లెయిమ్ ను దాఖలు చేసేటప్పుడు, మూడు రకాల ఫారంలు ఉంటాయి :

a) ఫారం 31 (పీఎఫ్ మొత్తంలో కొంత భాగాన్ని ఉపసంహరించుకోవడానికి) - ఈ ఫారంను పాక్షిక ఉపసంహరణ అభ్యర్థనను ప్రాసెస్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు.

b) ఫారం 19 (పీఎఫ్ ఉపసంహరణకు మాత్రమే) - ఇది మీరు సేకరించిన మొత్తం పీఎఫ్ ను ఉపసంహరించుకోడానికి ఉపయోగించబడుతుంది, దీనిని ఫైనల్ సెటిల్మెంట్ అని కూడా పిలుస్తారు.

c) ఫారమ్ 10సీ (పెన్షన్ ఉపసంహరణకు మాత్రమే) - ఈ ఫారంను పెన్షన్ మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తారు.

  1. ‘ప్రొసీడ్ ఫర్ ఆన్ లైన్ క్లెయిమ్’ ట్యాబ్ పై క్లిక్ చేసి, క్లెయిమ్ ఫారమ్ ను సమర్పించండి.

ఈపీఎఫ్ఓ మీ ఆధార్ వివరాలను యూఐడీఏఐ నుంచి పొంది, మీ ఆన్ లైన్ పీఎఫ్ క్లెయిమ్ ను ప్రాసెస్ చేస్తుంది. ఒకసారి ఆమోదం పొందిన తరువాత, 10 రోజుల్లో మీ పీఎఫ్ మొత్తం మీ ఖాతాలో క్రెడిట్ అవుతుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly