ఈఎంఐ రహిత రుణం గురించి మీకు తెలుసా?

మీరు ప్రతి నెలా మొత్తం రుణంపై కేవలం వడ్డీని మాత్రమే చెల్లించి, అసలు మొత్తాన్ని మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి లేదా రుణ మొత్తాన్ని ఒకేసారి చెల్లించవచ్చు

ఈఎంఐ రహిత రుణం గురించి మీకు తెలుసా?

ప్రస్తుతం పెరుగుతున్న యువత డిమాండ్లను నెరవేర్చడానికి అనేక డిజిటల్ రుణ సంస్థలు నిరంతరంగా విస్తృతమైన, సౌకర్యవంతమైన రుణ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. దానిలో భాగంగా నేడు ప్రీమియం బైకులు, వివాహాలు, ప్రయాణం, అద్దె డిపాజిట్ల చెల్లింపుకు అవసరమైన అనేక రకాల రుణాలను అందుబాటులోకి తెచ్చాయి. అయితే, ఇలాంటి రుణాలను మీకు అనుకూలంగా మార్చుకునే వీలు ఉండదు. అందుకోసమే కొత్తగా ఈఎంఐ రహిత రుణం అందుబాటులోకి వచ్చింది.

ఈఎంఐ రహిత రుణం అనేది ఒక కొత్త రకం రుణం. మీరు ప్రతి నెలా మొత్తం రుణంపై కేవలం వడ్డీని మాత్రమే చెల్లించి, అసలు మొత్తాన్ని మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి లేదా రుణ మొత్తాన్ని ఒకేసారి చెల్లించవచ్చు.

ఈఎంఐ రహిత రుణం గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ఇతర ప్రయోజనాలను కింద చూద్దాం…

  1. ఈ రుణాన్ని పొందడానికి మీ నెలవారీ జీతం కనీసం రూ. 30,000 ఉండాలి.
  1. వినియోగదారులు ప్రతి నెలా కేవలం వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. అసలు రుణ మొత్తాన్ని ఆరు నెలలకు ఒకసారి లేదా మొత్తం ఒకేసారి చెల్లించవచ్చు.

  2. అసలు చెల్లింపును పెంచుకునే లేదా తగ్గించుకునే ఆప్షన్ ను ఈ రుణం మీకు అందిస్తుంది. ఉదాహరణకి మీకు దీపావళి బోనస్ వచ్చినట్లయితే, అదనంగా వచ్చిన ఈ డబ్బును అసలు చెల్లించడానికి ఉపయోగించుకోవచ్చు.

  3. ఈఎంఐ రహిత రుణం విషయంలో నెలవారీ వడ్డీ మొత్తానికి అదనంగా మనం ఎంత నదగును చెల్లిస్తే అంత ఔట్‌స్టాండింగ్ తగ్గుతుంది.

  4. మీ రుణ దరఖాస్తును సమర్పించిన అనంతరం, రుణదాతలు వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసి, 24 గంటలలోపు మీ ఖాతాలోకి నగదును బదిలీ చేస్తారు. ఎలాంటి పేపర్ లను సమర్పించాల్సిన అవసరం లేకుండా, వేగంగా, సౌకర్యవంతంగా రుణ ప్రక్రియ పూర్తి అవుతుంది.

  5. ఈ రుణాలపై ఎలాంటి హిడెన్ చార్జీలు, ముందస్తు చెల్లింపు చార్జీలు ఉండవు. అలాగే తక్కువ డాక్యుమెంటేషన్ తో పాటు, సురక్షితమైన ప్రక్రియలతో రుణాలు అందుబాటులో ఉంటాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly