త్వరలో తక్కువ ధరకే ఐఫోన్లు..

ప్రస్తుతం ఈ ఫోన్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వలన వాటిపై దిగుమతి సుంకాలు భారీగా ఉన్నాయి

త్వరలో తక్కువ ధరకే ఐఫోన్లు..

స్మార్ట్ ఫోన్లు వాడేవారిలో ఎక్కువ మందికి ఒక్కసారైనా ఐఫోన్‌ ను ఉపయోగించాలనే కోరిక ఉంటుంది. కానీ దానిని కొనుగోలు చేయడానికి చాలా ఆలోచిస్తుంటారు. దానికి కారణం వాటి ధర చాలా ఎక్కువగా ఉండడమే. అయితే అలాంటి వారికి ఇది శుభవార్త అనే చెప్పవచ్చు. త్వరలో భారత మార్కెట్లో ఐఫోన్‌ ధరలు తగ్గనున్నాని సమాచారం. మేడ్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా యాపిల్‌ సంస్థకు చెందిన టాప్‌ ఎండ్‌ ఐఫోన్లను మన దేశంలో అసెంబిల్‌ చేస్తున్నారు. ఇక్కడ తయారు చేస్తున్న ఫోన్లపై దిగుమతి సుంకాలు లేకపోవడంతో ఐఫోన్ ధరలు తగ్గనున్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వలన వాటిపై దిగుమతి సుంకాలు భారీగా ఉన్నాయి. అలాగే ఇతర మొబైల్ తయారీ సంస్థలు తక్కువ ధరకే అన్ని ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్లను వరుసగా విడుదల చేస్తుండడంతో మన దేశ మార్కెట్లో ఐఫోన్ అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. దీంతో యాపిల్‌ సంస్థ మేడి ఇన్‌ ఇండియాపై దృష్టిపెట్టింది. దీనిలో భాగంగా ఇక్కడే అసెంబిల్‌ చేయడంతో పాటు సొంత రిటైల్‌ స్టోర్లను కూడా ప్రారంభించాలని భావిస్తుంది. మన దేశంలో ఐఫోన్లను ఫాక్స్‌కాన్‌ అనే సంస్థ తయారు చేస్తుంది. మార్కెట్‌ వర్గాల అంచనా ప్రకారం ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌, ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌ ఫోన్లు ఆగస్టు నాటికి మార్కెట్ లోకి రానున్నాయి. ఇప్పటికే ఐఫోన్ ఎస్‌ఈ, ఐఫోన్‌ 6ఎస్‌, ఐఫోన్‌ 7 స్మార్ట్ ఫోన్లను బెంగళూరులో అసెంబిల్‌ చేస్తోంది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly