ఈఎంఐ ల సడలింపు ప్రకటించిన ఐసిఐసిఐ

వడ్డీ మినహాయింపు ఉండదన్న విషయాన్ని ఐసీఐసీఐ స్పష్టంగా తెలియజేసింది.

ఈఎంఐ ల సడలింపు ప్రకటించిన ఐసిఐసిఐ

కొద్దీ రోజుల క్రితం ఈఎంఐ ల సడలింపు ను ఆర్ బీ ఐ సూచించిన విషయం మనకి తెలిసిందే. కొన్ని బ్యాంకులు ఇప్పటికే వారి కస్టమర్లకి ఈ విషయాన్నీ సూచించడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఐసీఐసీఐ బ్యాంకు కూడా ఒక ప్రకటన చేసింది.

మే 31 వరకు ఈఎంఐ లు చెల్లించడమా లేదా వాయిదా వేయడమే అన్నది రుణ దారులు ఎంచుకోవచ్చని ఐసీఐసీఐ తెలిపింది. దీనికి సంబంధించి ఈ బ్యాంకు తన కస్టమర్లకు ఒక sms/email కూడా పంపినట్టు తెలిపింది. ఇందులో ఒక లింక్ ఉంటుంది. దీని ద్వారా మొరటోరియం తీసుకోవడంలో లేదా యధా విధిగా కొనసాగడమే చేయవచ్చు.

ఈ ప్రకటనలోని మరో విషయం కూడా తెలిపింది. వడ్డీ మినహాయింపు ఉండదన్న విషయాన్ని ఐసీఐసీఐ స్పష్టంగా తెలియజేసింది. ఈఎంఐ వాయిదా వేసినట్లయితే ఈ వడ్డీ ని రాబోయే ఈఎంఐ లకు కలిపి కాల పరిమితి ని కూడా దానికి అనుగుణంగా మార్పులు చేస్తారు.

వీలైనంత వరకు ఈఎంఐలు చెల్లించడమే మేలు. దీనికి సంబంధించి ఈ కథనాన్ని చదవండి:

3 నెల‌లు గృహ రుణ చెల్లింపులు వాయిదా వేస్తున్నారా ? ఇవి తెలుసుకోండి

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly