ఐసీఐసీఐ బ్యాంక్ మల్టీ కరెన్సీ కార్డు..

ఇందులో 15 రకాల కరెన్సీలను లోడ్ చేయవచ్చు

ఐసీఐసీఐ బ్యాంక్ మల్టీ కరెన్సీ కార్డు..

దేశీయ ప్రైవేటు బ్యాంకు దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఆన్‌లైన్ ట్రావెల్ బుకింగ్ పోర్టల్ అయిన గోఐబీబో తో కలిసి కో-బ్రాండెడ్ మల్టీ కరెన్సీ కార్డును ప్రారంభించింది.

తరచుగా విదేశాలకు వెళ్ళే వారు, తమకు ఐసీఐసీఐ బ్యాంక్ పొదుపు ఖాతా ఉన్నా, లేకపోయినా గోఐబీబో వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ ద్వారా గోఐబీబో ఐసీఐసీఐ బ్యాంక్ ట్రావెల్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, ఇది 200 దేశాలలోని 4.6 కోట్ల వ్యాపార సముదాయాల్లో పనిచేస్తుంది, అలాగే ఇందులో 15 రకాల కరెన్సీలను లోడ్ చేయవచ్చు. వినియోగదారులు ఐసీఐసీఐ బ్యాంక్ ఇంటర్నెట్ పోర్టల్ ద్వారా తక్షణమే ఒక కరెన్సీ నుంచి మరొక కరెన్సీకి డబ్బును బదిలీ చేయవచ్చు, అదే విధంగా బ్యాంకుకు సంబంధించిన మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి ఎప్పుడైనా, ఎక్కడ నుంచి అయినా కార్డులోకి కరెన్సీని రీలోడ్ చేయవచ్చు.

అలాగే ఈ కార్డు రూ. 20,000 వరకు విలువగల ప్రయోజనాలను అందిస్తుంది, వీటిలో గోఐబీబో కు సంబంధించిన రూ. 15,000 విలువగల గిఫ్ట్ వోచర్లు ఉన్నాయి. దీనితో పాటు, వినియోగదారులు కనీసం 1,000 డాలర్లను లోడ్ చేయడం ద్వారా కరెన్సీ మార్పిడి రేటుపై 40 పైసల తగ్గింపును పొందుతారు.

అలాగే ఒకవేళ మీ కార్డు దొంగతనానికి గురైనా లేదా పోగొట్టుకున్నా కూడా కాంప్లిమెంటరీ కార్డు ప్రొటెక్షన్ ప్రయోజనం కింద రూ. 5 లక్షల వరకు నష్టపరిహారాన్ని పొందుతారు. ఈ కార్డును ఉపయోగించడం ద్వారా కౌలాలంపూర్, దుబాయ్, లండన్, సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాక్ వంటి ఆరు విదేశీ నగరాల్లో 100కి పైగా భారతీయ రెస్టారెంట్లలో 15 శాతం తగ్గింపును పొందవచ్చు. అదే విధంగా ఈ కార్డు రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ప్రయాణ బీమాను కూడా అందిస్తుంది. పర్యాటక రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండవ అతి పెద్ద దేశం భారత్ అని ఇటీవల ఐక్యరాజ్యసమితి తెలిపినట్లు ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డులు & వ్యక్తిగత రుణాల విభాగం హెడ్ సుదీప్తా రాయ్ తెలిపారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

  • గోఐబీబో వెబ్‌సైట్ లేదా మొబైల్ అప్లికేషన్‌ లో లాగిన్ అవ్వండి (https://imobile.icicibank.com/icicitravelcard/landing.do)

  • మీ పేరు, మొబైల్ నంబర్, పాస్‌పోర్ట్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, పాన్ నంబర్ వంటి కొన్ని వివరాలను పూరించండి.

  • మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీకి వచ్చిన ఓటీపీని నమోదు చేయండి.

  • లోడ్ చేయాల్సిన కరెన్సీ, మొత్తాన్ని ఎంచుకోండి.

  • ఐసీఐసీఐ బ్యాంక్ వినియోగదారులు వారి పొదుపు ఖాతా ద్వారా, ఇతర బ్యాంకు వినియోగదారులు బిల్ డస్క్ పోర్టల్ ద్వారా చెల్లింపు చేయండి.

  • అనంతరం, పత్రాలను ధృవీకరించడానికి వెరిఫైయర్ మీరుంటున్న చిరునామాకు వచ్చి పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, వీసా ఫోటోకాపీని సేకరించి ట్రావెల్ కార్డు కిట్‌ను మీకు అందచేస్తారు.

  • ధ్రువీకరణ పత్రాలను సమర్పించిన ఒక్క రోజులో కార్డు యాక్టీవేట్ అవుతుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly