ఆదాయ‌పు ప‌న్ను శాఖ మిన‌హాయింపుల‌ను ఏవిధంగా వర్గీక‌రిస్తుంది?

ఆదాయ‌ప‌న్ను చెల్లించే వారు త‌మ‌కు వ‌ర్తించే ప‌న్ను మిన‌హాయింపుల‌ను తెలుసుకోవ‌డం ద్వారా ప‌న్ను మొత్తాన్ని కొంత వ‌ర‌కు త‌గ్గించుకోవ‌చ్చు.

ఆదాయ‌పు ప‌న్ను శాఖ మిన‌హాయింపుల‌ను ఏవిధంగా వర్గీక‌రిస్తుంది?

ఆదాయ‌పు ప‌న్ను శాఖ మనం చేసే పెట్టుబ‌డులకు మిన‌హాయింపులు ఇస్తుంది. ఈ మిన‌హాయింపులు మూడు ర‌కాలుగా ఉంటాయి. 1.ఈఈఈ(మిన‌హాయింపు-మిన‌హాయింపు-మిన‌హాయింపు) 2.ఈఈటీ(మిన‌హాయింపు-మిన‌హాయింపు- ప‌న్నువ‌ర్తింపు) 3.ఈటీఈ (మిన‌హాయింపు-ప‌న్నువ‌ర్తింపు-మిన‌హాయింపు). ఈ మిన‌హాయింపుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1.ఈఈఈ వ‌ర్గం:
ఇందులో మూడు ర‌కాలైన మిన‌హాయింపులు వ‌స్తాయి.

 • మొద‌టి ఈ(మిన‌హాయింపు): డిడ‌క్ష‌న్‌కు అర్హ‌త పొందిన పెట్టుబ‌డి వార్షిక ఆదాయంలో భాగం అయితే అది మొద‌టి మిన‌హాయింపు కింద‌కు వ‌స్తుంది.
 • రెండ‌వ ఈ(మిన‌హాయింపు): పెట్టుబ‌డుల‌పై వ‌చ్చిన ఆదాయంపై మిన‌హాయింపు
 • మూడ‌వ ఈ(మిన‌హాయింపు): పెట్టుబ‌డి నుంచి వ‌చ్చిన న‌గ‌దు విత్‌డ్రాల‌ను సూచిస్తుంది. ప‌న్ను త‌ట‌స్థంగా ఉంటుంది
 • పెట్టుబ‌డి సాధ‌నాలైన ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్‌, ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్‌లు ఈఈఈ వ‌ర్గానికి చెందిన మిన‌హాయింపు కింద‌కు వ‌స్తాయి.

2.ఈఈటీ వ‌ర్గం:
ఇందులో పెట్టుబ‌డిదారుడు తాను చేసిన పెట్టుబ‌డుల‌పై రెండు మిన‌హాయింపులు పొంద‌వ‌చ్చు.

 • పెట్టుబ‌డులకు మిన‌హాయింపు పొందే అర్హ‌త ఉంద‌ని మొద‌టి ‘ఈ’ సూచిస్తుంది.
 • డివిడెండ్‌లు, పెట్టుబ‌డులు చేసిన కాలానికి గానూ వ‌చ్చే వ‌డ్డీలు వంటి రాబ‌డుల‌పై ప‌న్ను ఉండ‌ద‌ని రెండ‌వ ‘ఈ’ సూచిస్తుంది.
 • మెచ్యూరిటీ లేదా విత్‌డ్రా స‌మ‌యంలో ఏక‌మొత్తంగా తీసుకునే న‌గ‌దుపై ప‌న్ను వ‌ర్తిస్తుంద‌ని ‘టీ’ సూచిస్తుంది.
 • ఈక్వీటీ లింకెడ్ సేవింగ్స్ స్కీమ్‌(ఈఎల్ఎస్ఎస్‌) ల‌ను ఈఈటీకి ఉదాహ‌ర‌ణ‌లుగా చెప్ప‌వ‌చ్చు. ఈఎల్ఎస్ఎస్‌ మూడు సంవ‌త్స‌రాల నిర్భంధ కాల‌ప‌రిమితితో వ‌స్తాయి. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం ప్ర‌కారం రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.
 1. ఈటీఈ వ‌ర్గం:
 • పెట్టుబ‌డులకు మిన‌హాయింపు పొందే అర్హ‌త ఉంద‌ని మొద‌టి ‘ఈ’ సూచిస్తుంది.
 • పెట్టుబ‌డులు చేసినంత కాలం వ‌చ్చే రాబ‌డుల‌పై ప‌న్ను వ‌ర్తిస్తుంద‌ని ‘టీ’ సూచిస్తుంది.
 • మెచ్యూరిటీ లేదా విత్‌డ్రా స‌మ‌యంలో ఏక‌మొత్తంగా తీసుకునే న‌గ‌దుపై ప‌న్ను వ‌ర్తించ‌ద‌ని ‘ఈ’ సూచిస్తుంది.
 • 5 సంవ‌త్స‌రాల ప‌న్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు ఈ కేట‌గిరిలోకి వస్తాయి. ఇందులో పెట్టుబ‌డులకు ప‌న్ను మిన‌హాయింపు వ‌ర్తిస్తుంది. వ‌డ్డీపై ప‌న్ను వ‌ర్తిస్తుంది. అయితే మెచ్యూరిటీ స‌మ‌యానికి విత్‌డ్రా చేసుకునే మొత్తంపై ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది.
 • జాతీయ పొదుపు ప‌త్రాల‌ను ఇందుకు మ‌రొక ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు.
 • ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ ‘80సీ’ కింద ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly