ప‌దేళ్లు మదుపు చేస్తే ... రాబ‌డి ఎంత‌?

వయసు పెరిగే కొద్దీ అనుభవం, సంపాదనా పెరిగినా , ఖర్చులు కూడా అలాగే పెరుగుతుంటాయి . అయితే ఉన్నంతలో కొంత మదుపు చేయాల్సి ఉంటుంది. అది ఎవరి వీలును బట్టి వారు చేసుకోవచ్చు.

ప‌దేళ్లు మదుపు చేస్తే ... రాబ‌డి  ఎంత‌?

మన అవసరాలు, కోరికలు ఎప్పుడూ ఉంటాయి. అవి పెరుగుతుంటాయే తప్ప తరగవు. ప్రజల ఆలోచనలలో, జీవన విధానంలో, జీవన ప్రమాణాలలో అనేక మార్పులు వస్తున్నాయి. వస్తు సేవల వినియోగం కూడా పెరుగుతోంది. నెలమొత్తం కష్టపడ్డ సొమ్ము చాలా వరకు వీటికే ఖర్చవుతోంది. ఒక ఆరోగ్యకర జీవితానికి ఇవి తప్పనిసరి . ఒకప్పటిలాగా సాదాసీదాగా ఉండాలనుకుంటే కష్టం. వయసు పెరిగే కొద్దీ అనుభవం, సంపాదనా పెరిగినా , ఖర్చులు కూడా అలాగే పెరుగుతుంటాయి . అయితే ఉన్నంతలో కొంత మదుపు చేయాల్సి ఉంటుంది. అది ఎవరి వీలును బట్టి వారు చేసుకోవచ్చు.

కిందటి కధానాలలో నెలకు రూ. 2,000 లతో మదుపు మొదలు పెట్టి, ప్రతి సంవత్సరం నెలకు రూ. 500, రూ. 1,000, రూ.1,500 ,రూ. 2,000,రూ. 2,500, రూ.3,000 లతో పెంచుకుంటూ మదుపు చేస్తే, 8%, 10%, 12% రాబడి అంచనాతో 10 ఏళ్ల తరువాత ఎంత లభిస్తుంది, అలాగే 20 ఏళ్ల తరువాత ఎంత లభిస్తుందో తెలుసుకున్నాము.

అయితే కొందరికి అధిక మొత్తంలో మదుపు చేసే అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని నెలకు రూ. 5,000 లతో మదుపు మొదలు పెట్టి, ప్రతి ఏడాది రూ. 500, రూ.1,000, రూ.1,500 ,రూ. 2,000,రూ. 2,500, రూ.3,000 లతో పెంచుకుంటూ మదుపు చేస్తే, 8%, 10%, 12% రాబడి అంచనాతో 10 ఏళ్ల తరువాత ఎంత లభిస్తుందో ఈ కింది పట్టికల ద్వారా తెలుసుకుందాము.

ఉదా : రామం , నెలకు రూ 5,000 లతో మొదలు పెట్టి, ప్రతి ఏడాది మొదటి నెలలో రూ 500 లు పెంచితే , అంటే రెండవ ఏడాది రూ 5,500 లు, మూడవ ఏడాది రూ 6,000 లతో మొదలు పెట్టి 10 ఏళ్ల పాటు మదుపు చేస్తే 8 శాతం రాబడి అంచనాతో అతనికి చివర్లో రూ 12,75,267 లభిస్తుంది. ఈ కాలంలో అతను చేసిన మొత్తం పెట్టుబడి రూ. 8,70,000. అంటే అతనికి లభించిన రాబడి రూ. 4,05,267.

t1.jpg

అలాగే రూ. 5,000 లతో మొదలు పెట్టి, ప్రతి ఏడాది రూ. 1,000, రూ. 1,500, రూ. 2,000, రూ. 2,500, రూ. 3,000, లతో పెంచుకుంటూ వెళితే 8 శాతం రాబడి అంచనాతో ఎంత లభిస్తుందో కూడా తెలుసుకోవచ్చు.

ఉదా : శివ , నెలకు రూ 5,000 లతో మొదలు పెట్టి, ప్రతి ఏడాది మొదటి నెలలో రూ 500 లు పెంచితే , అంటే రెండవ ఏడాది రూ 5,500 లు, మూడవ ఏడాది రూ 6,000 లతో మొదలు పెట్టి 10 ఏళ్ల పాటు మదుపు చేస్తే 10 శాతం రాబడి అంచనాతో అతనికి చివర్లో రూ 14,14,036 లభిస్తుంది. ఈ కాలంలో అతను చేసిన మొత్తం పెట్టుబడి రూ. 8,70,000. అంటే అతనికి లభించిన రాబడి రూ. 5,44,036.

t2.jpg

అలాగే రూ. 5,000 లతో మొదలు పెట్టి, ప్రతి ఏడాది రూ. 1,000, రూ. 1,500, రూ. 2,000, రూ. 2,500, రూ. 3,000, లతో పెంచుకుంటూ వెళితే 10 శాతం రాబడి అంచనాతో ఎంత లభిస్తుందో కూడా తెలుసుకోవచ్చు.

ఉదా : కేశవ , నెలకు రూ 5,000 లతో మొదలు పెట్టి, ప్రతి ఏడాది మొదటి నెలలో రూ 500 లు పెంచితే , అంటే రెండవ ఏడాది రూ 5,500 లు, మూడవ ఏడాది రూ 6,000 లతో మొదలు పెట్టి 10 ఏళ్ల పాటు మదుపు చేస్తే 12 శాతం రాబడి అంచనాతో అతనికి చివర్లో రూ 15,72,678 లభిస్తుంది. ఈ కాలంలో అతను చేసిన మొత్తం పెట్టుబడి రూ. 8,70,000. అంటే అతనికి లభించిన రాబడి రూ. 7,02,678.

t3.jpg

అలాగే రూ. 5,000 లతో మొదలు పెట్టి, ప్రతి ఏడాది రూ. 1,000, రూ. 1,500, రూ. 2,000, రూ. 2,500, రూ. 3,000, లతో పెంచుకుంటూ వెళితే 12 శాతం రాబడి అంచనాతో ఎంత లభిస్తుందో కూడా తెలుసుకోవచ్చు.

ముగింపు:
ఈ విధంగా ప్రతి ఒక్కరు తమకు అనుకూలమైన మొత్తంతో, దీర్ఘకాలం మదుపు చేస్తే అధిక రాబడి పొందొచ్చు. దీనికి పట్టుదల, క్రమశిక్షణ ఎంతో ముఖ్యం. ఇది ఒక అలవాటుగా మారాలి. కొంత సొమ్ము జమ అయిన తరువాత మనమీద మనకే ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. డబ్బుతో కొంత ధైర్యం ఏర్పడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. మదుపు మొదలు పెడదామా?

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly