తక్కువ ధరకే విమాన టిక్కెట్లు..

ఇండిగో అందించే ఈ ఆఫర్ జూలై 31 నుంచి ప్రారంభమై ఆగస్టు 4 తో ముగియనుంది

తక్కువ ధరకే విమాన టిక్కెట్లు..

బడ్జెట్ ధరలకే విమాన టిక్కెట్లను అందించే దేశీయ విమానయాన సంస్థ ఇండిగో తన 13వ వార్షికోత్సవం సందర్భంగా సేల్ ను ప్రారంభించింది. దీనిలో భాగంగా తక్కువ ధరకే దేశీయ, అంతర్జాతీయ విమాన టిక్కెట్లను అందిస్తోంది. దేశీయ విమాన చార్జీలను రూ. 999 నుంచి, అలాగే అంతర్జాతీయ విమాన చార్జీలను రూ. 3499 నుంచి ఇండిగో అందిస్తోంది. ఇండిగో అందించే ఈ ఆఫర్ జూలై 31 నుంచి ప్రారంభమై ఆగస్టు 4 తో ముగియనుంది. ఈ ఆఫర్ 15 ఆగస్టు 2019 నుంచి 28 మార్చి 2020 మధ్య చేసే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుందని ఇండిగో ట్వీట్ చేసింది.

అయితే, యానివర్సరీ సేల్ ఆఫర్ కింద ఎన్ని సీట్లను అందుబాటులో ఉంచిందో ఇండిగో తెలుపలేదు. ఈ ఆఫర్ కింద కేవలం పరిమిత సంఖ్యలో సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని, సీట్ల లభ్యత ఆధారంగా వినియోగదారులకు డిస్కౌంట్ లభిస్తుందని ఇండిగో తెలిపింది. ఆఫర్ పీరియడ్ లో చేసే బుకింగ్స్ పై, అలాగే ప్రయాణ తేదీకి కనీసం 15 రోజుల ముందు చేసే బుకింగ్స్ పై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే ప్రయాణ తేదీ మార్చి 28, 2020 మించకూడదని ఇండిగో తెలిపింది. అన్ని ఛానెల్స్ ద్వారా చేసుకునే విమాన బుకింగ్స్ పై ఇండిగో యానివర్సరీ సేల్ ఆఫర్ వర్తిస్తుంది.

ఈ ఆఫర్ ను బదిలీ చేయడం గానీ, ఎక్స్చేంజి చేయడం గానీ, క్యాష్ చేసుకోవడం గానీ కుదరదు. అలాగే ఇండిగో గ్రూప్ బుకింగ్స్ పై కూడా ఈ ఆఫర్ వర్తించదని ఇండిగో తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ప్రయాణీకులు బ్యాంక్ ఆఫ్ బరోడా డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి దేశీయ విమాన టిక్కెట్లను, అలాగే యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి అంతర్జాతీయ విమాన టిక్కెట్లను బుక్ చేసుకున్నట్లైతే క్యాష్‌బ్యాక్ ను పొందవచ్చని ఇండిగో తెలిపింది.

ఇండిగో అక్టోబర్ 3 నుంచి కోల్‌కతా మీదుగా వియత్నాం రాజధాని హనోయికి నాన్ స్టాప్ విమాన సర్వీసులను ప్రారంభించనుంది. ఈ విమాన చార్జీలు రూ. 9999 నుంచి ప్రారంభమవుతాయి. వచ్చే ఆగస్టు 14 నుంచి ఢిల్లీ - అగర్తాలా, ఢిల్లీ - దిబ్రుగా మార్గాల్లో ప్రతిరోజూ నాన్ స్టాప్ విమానాలను ఇండిగో నడపనుంది. ప్రస్తుతం ఇండిగో 200కి పైగా విమానాలను కలిగి ఉండి, ప్రతి రోజూ 1,400 సర్వీసులను నడుపుతుంది. అలాగే ఇండిగో 55 దేశీయ గమ్యస్థానాలకు, 17 అంతర్జాతీయ గమ్యస్థానాలకు తన సర్వీసులను నడుపుతోంది.

(source - livemint)

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly