త‌క్ష‌ణ‌మే ఇ-పాన్

ఆధార్ డేటాబేస్‌లో ఉన్న వివ‌రాల ఆధారంగా ఇ-పాన్‌ను జారీ చేస్తారు. అందువ‌ల్ల ఆధార్‌లో అన్ని స‌రైన వివ‌రాలు ఉండేలా చూసుకోవాలి

త‌క్ష‌ణ‌మే ఇ-పాన్

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు ఫైల్ చేయ‌డం, బ్యాంకు ఖాతా తెర‌వ‌డం, ఆర్థిక లావాదేవీల నిర్వ‌హ‌ణ వంటి వివిధ ప్ర‌యోజ‌నాల కోసం పాన్ కార్డు అవ‌స‌రం అవుతుంది. పాన్ కార్డును పొందేందుకు ఇంత‌కు ముందు ఫార‌మ్‌ను నింపి ఇవ్వాల్సి వ‌చ్చేది. ఇందుకు దాదాపు 15 రోజుల స‌మ‌యం ప‌ట్టేది. అయితే ప్ర‌స్తుతం ఆదాయ‌పు ప‌న్ను విభాగం వారు ఇ-పాన్‌ను త‌క్ష‌ణ‌మే జారీ చేస్తున్నారు. ఇ-పాన్ అనేది ఐటీ శాఖ వారు ఎల‌క్ట్రానిక్ ఫార్మెట్‌లో జారీ చేస్తారు. దీనిపై డిజిట‌ల్ సంత‌కం ఉంటుంది. ఇందుకోసం దర‌ఖాస్తు దారునికి వ్యాలీడ్ ఆధార్ నెంబ‌రు ఉండాలి.

https://www.pan.utiitsl.com/PAN/newA.do లింక్ ద్వారా ఇ-పాన్‌కి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఇక్క‌డ ఉన్న అప్లైయ్ ఫ‌ర్ న్యూ పాన్ కార్డ్‌(ఫారం 49ఏ) ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి. త‌క్ష‌ణమే ఇ-పాన్ పొందేందుకు డిజిట‌ల్ మోడ్ ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకోవాలి. డిజిట‌ల్‌మోడ్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను భౌతికంగా ఇవ్వాల్సి అవ‌స‌రం లేదు. ఆధార్ బేసెడ్ ఇ-సిగ్నేచ‌ర్ ద్వారా గానీ, డిజిట‌ల్ సిగ్నేచ‌ర్ ద్వారా గానీ ద‌ర‌ఖాస్తు ఫార‌మ్‌పై సంత‌కం చేయాలి. అయితే ఆధార్ వివ‌రాల‌లో మొబైల్ నెంబ‌రును త‌ప్ప‌నిస‌రిగా అప్‌డేట్ చేయాలి. ఇ-కేవైసీ కోసం ఆధార్‌తో రిజిస్ట‌ర్ అయిన మొబైల్ నెంబ‌రుకు ఓటీపీని పంపిస్తారు.

ఇందుకోసం దర‌ఖాస్తు దారుడు జ‌న్మ న‌మోదు ప‌త్రం, అడ్ర‌స్ ఫ్రూఫ్ వంటి ప‌త్రాల‌ను ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు. ఆధార్ డేటాబేస్‌లో ఉన్న వివ‌రాల ఆధారంగా ఇ-పాన్‌ను జారీ చేస్తారు. అయితే వెబ్‌సైట్‌లో సూచించిన విధంగా సంత‌కం ఇమేజ్‌ను, తాజా ఫోటోగ్రాఫ్‌ను అప్‌లోడ్ చేయాలి.

ఆన్‌లైన్ ద్వారా పాన్ కార్డు పొంద‌డంలో ఆధార్ కార్డు కీల‌క పాత్ర పోషిస్తుంది. అందువ‌ల్ల ఆధార్ కార్డులోని వివ‌రాలు అన్ని సరిగ్గా ఉండ‌డం అవ‌స‌రం ఒక‌వేళ వివ‌రాలలో త‌ప్పులు ఉంటే ద‌ర‌ఖాస్తు తిర‌స్క‌రిస్తారు.

ద‌ర‌ఖాస్తు చేసేప్పుడు మీకు ఇ-పాన్ కావాలా… లేదా పాన్ కార్డు భౌతికంగా కావాలా… లేదా రెండూ కావాలా… అనే విష‌యాన్ని తెలియ‌జేయాలి. ఒక‌వేళ మీకు ఇ-పాన్‌తో పాటు పాన్ కార్డు కూడా కావాలంటే మీరు రూ.107 చెల్లించాల్సి ఉంటుంది. ఒక‌వేళ మీకు ఇ-పాన్ మాత్ర‌మే కావాలంటే రూ.66 చెల్లిస్తే స‌రిపోతుంది. మీ అవ‌స‌రాల కోసం ఇ-పాన్‌ను ప్రింట్ అవుట్ తీసుకోవ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly