సంక్షిప్త వార్తలు:

 • భారీ లాభాల‌తో ముగిసిన మార్కెట్లు ; సెన్సెక్స్ @ 35,843, నిఫ్టీ @ 10,551
 • గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం (2019-20)లో దేశంలో 3వ అతిపెద్ద టెలికాం సంస్థ `వొడాఫోన్ ఐడియా` రికార్డు స్థాయిలో రూ. 73,878 కోట్ల నిక‌ర న‌ష్టాన్ని చ‌విచూసింది.
 • 99ఏక‌ర్స్‌.కామ్ యొక్క స‌ర్వేలో 31% ఇప్ప‌టికీ రియ‌ల్ ఏస్టేట్‌లో పెట్టుబ‌డికి మొగ్గు చూపుతున్నారు.
 • 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రంలో 13 శాతం వృద్ధితో రూ.963 కోట్ల ఆదాయాన్ని న‌మోదు చేసిన సెబీ
 • పాన్-ఆధార్ గ‌డువును జూన్ 30 వ‌ర‌కు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ‌
 • మ్యూచువ‌ల్ ఫండ్ యూనిట్ల రిడెంప్ష‌న్‌కు స్టాంప్ డ్యూటీ వ‌ర్తించ‌ద‌ని `సెబీ` స్ప‌ష్టం చేసింది.
 • కో-ఆప‌రేటివ్ బ్యాంకుల‌ను ఆర్‌బీఐ నియంత్ర‌ణ‌లోకి తీసుకొచ్చేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణ‌యం
 • యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) దేశ‌వ్యాప్తంగా 125 ప్రాంతీయ కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేసింది.
 • నేడు డాల‌ర్‌తో రూ. 74.88 వ‌ద్ద కొన‌సాగుతోన్న రూపాయి మార‌కం విలువ‌
 • ఈ రోజు హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.83.49, డీజిల్ ధ‌ర రూ.78.69

పాలసీదారుల సమస్యలు− ఫిర్యాదులు నమోదు

అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో మ‌న‌ల్ని ఆర్థిక‌ప‌రంగా ఆదుకుంటుంద‌నే ఉద్దేశంతో బీమా పాల‌సీ తీసుకుంటాం. బీమా కంపెనీ సేవ‌ల‌తో మ‌నం సంతృప్తి చెంద‌క‌పోతే ఫిర్యాదు చేసే హ‌క్కుంది. స‌రైన పాల‌సీ తీసుకోవ‌డం ఎంత ముఖ్య‌మో సమస్య ఎదురైతే ఫిర్యాదు చేసే విధానం తెలుసుకోవ‌డమూ అంతే ముఖ్యం. ఒక‌వేళ ఫిర్యాదుకు స‌రైన స్పంద‌న రాక‌పోతే దాన్ని ఉన్న‌త శ్రేణుల‌కు ఫిర్యాదు చేయ‌డం తెలుసుకుని ఉండ‌టం అవ‌స‌రం.

బీమా పాలసీలతో సాధారణంగా ఎదురయ్యే సమస్యలు

పాలసీకి సంబంధించిన సమస్యలు

 • పాలసీ బాండ్‌ అందకపోవడం
 • మనం ఎంచుకున్న పాలసీ కాకుండా పొరపాటుగా వేరే పాలసీ పత్రాలు అందడం
 • పాలసీలో మార్పులు
 • పాలసీ రద్దవ్వడం
 • ఒక బ్రాంచీ నుంచి మరోదానికి పాలసీ బదిలీ కావడం
 • రద్దయిన పాలసీలను పునరుద్ధరించకపోవడం
 • నామినీకి లేదా మనం అనుకున్న వ్యక్తికి ఎదురయ్యే సమస్యలు

క్లెయిం సంబంధిత సమస్యలు

INSURANCE.jpg
 • క్లెయిం చెల్లించకపోవడం
 • స్వాధీన విలువ చెల్లించకపోవడం
 • మెచ్యూరిటీ సొమ్మును అందించకపోవడం
 • యాన్యుటీలను ఇవ్వకపోవడం
 • క్లెయింను నిరాకరించడం

ఇవే కాకుండా బీమా మధ్యవర్తులైన బీమా బ్రోకర్లు , ఏజెంట్లు , అగ్రిగేటర్లకు సంబంధించిన సమస్యలూ ఉంటాయి.

పాలసీదారుల సమస్యలను పరిష్కరించేందుకు ఐఆర్‌డీఏ మార్గదర్శకాలను రూపొందించింది. వివిధ రకాల సమస్యలను తీర్చేందుకు, ఫిర్యాదుల నమోదు, పరిష్కారానికి పట్టే సమయాన్ని నిర్ణయించి అందుబాటులో ఉంచింది.

బీమా సమస్యలను పరిష్కరించేటప్పుడు

బీమా కంపెనీలు, ఏజెంట్ల ద్వారా తలెత్తే సమస్యలను పరిష్కరించడంలో పాలసీదారులకు ఐఆర్‌డీఏ సహకరిస్తుంది.

కంపెనీ ఫిర్యాదుల స్వీకరణ అధికారి:

బీమా పాలసీలతో వచ్చే సమస్యలు చాలా వరకు కంపెనీ ఫిర్యాదుల స్వీకరణ అధికారికి తెలియజేసి పరిష్కరించుకోవచ్చు.

 • మీ ఫిర్యాదు రాతపూర్వకంగా అధికారికి అందించాలి. దీంతో పాటు సంబంధిత ధ్రువపత్రాలను జతచేయాల్సి ఉంటుంది.
 • ఫిర్యాదు స్వీకరించినట్టుగా తేదీతో కూడిన లిఖితపూర్వక పత్రం తీసుకోవాలి.
  లేదా
 • ఆన్‌లైన్‌లో ఫిర్యాదుచేయవచ్చు.

జీవిత బీమా కంపెనీకి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు న‌మోదు చేసేందుకు కింద ఇచ్చిన లిస్ట్ మీద క్లిక్ చేయండి

Screen Shot 2017-02-19 at 18.34.47.png
 • 15రోజులలోగా మీ ఫిర్యాదుకు బీమా కంపెనీలు స్పందించాలి.
 • 15రోజుల వరకూ ఎలాంటి స్పందన రాకపోయినా … వచ్చిన స్పందనతో మీరు సంతృప్తి చెందకపోయినా ఐఆర్‌డీఏ వినియోగదారుల ఫోరంను సంప్రదించాలి.

ఐఆర్‌డీఏ వినియోగదారుల ఫోరం వ‌ద్ద‌ ఫిర్యాదు చేసేందుకు ఉన్న మార్గాలు…

 • టోల్‌ ఫ్రీ నంబరు 155255 లేదా 1800 425 4732 సోమవారం నుంచి శనివారం దాకా ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ సంప్రదించవచ్చు.
 • ఫ్యాక్స్‌ ద్వారా ఫిర్యాదు చేయాలనుకుంటే 040− 66789768 నంబరుకు చేయవచ్చు.
 • ఈమెయిల్‌ చేయడం ద్వారా
 • ఫిర్యాదును నేరుగా లేదా కొరియర్‌ రూపంలో పంపేందుకు చిరునామా

వినియోగదారుల సేవా విభాగం
ఐఆర్‌డీఏ, 3−5−817/818,
యూనైటెడ్‌ ఇండియా టవర్స్‌
9వ అంతస్తు,
హైదర్‌గూడ, బషీర్‌బాగ్‌, హైదరాబాద్‌ − 500029

 • ఇంటిగ్రేటెడ్‌ గ్రీవెన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఐజీఎమ్‌ఎస్‌) ద్వారా ఫిర్యాదును నమోదు చేయడం…

 • ఐజీఎమ్‌ఎస్‌తో మీ ఫిర్యాదును నమోదుచేయించుకున్నాక, ఫిర్యాదు స్వీకరించినట్టుగా ఓ టోకెన్‌ నంబరు మీరిచ్చిన చిరునామాకు లేదా మీ ఈ మెయిల్‌కు పంపిస్తారు.

 • 15రోజులలోగా మీ ఫిర్యాదుకు స్పందన రావాలి.

 • 15రోజుల వరకూ ఎలాంటి స్పందన రాకపోయినా … వచ్చిన స్పందనతో మీరు సంతృప్తి చెందకపోయినా బీమా అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు.

అంబుడ్స్‌మన్‌ లేదా వినియోగదారుల ఫోరం లేదా సివిల్‌ కోర్టుల పరిధి…

భారత ప్రభుత్వం అంబుడ్స్‌మన్‌ను నియమిస్తుంది. బీమాకు సంబంధించి మొత్తం 12 మంది అంబుడ్స్‌మన్‌లు ప్రాంతాలవారీగా నియమితులై ఉన్నారు.

అంబుడ్స్‌మన్‌ స్వీకరించే ఫిర్యాదులు…

 • పాక్షికంగా లేదా పూర్తిగా నిరాకరించిన క్లెయింలు
 • పాలసీ నియమనిబంధనల ప్రకారం ప్రీమియం చెల్లింపు వివాదాలు
 • క్లెయింలకు సంబంధించి పాలసీల తయారీలో చట్టవిరుద్ధ వివాదాలు
 • క్లెయింల పరిష్కారంలో జాప్యం
 • ప్రీమియం చెల్లించాక కూడా బీమాకు సంబంధించిన పత్రమేదైనా ఇవ్వకుండా ఉండడం…

అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేసేముందు గుర్తుంచుకోవాల్సినవి

 • వ్యక్తులు అంబుడ్స్‌మన్‌ వ‌ద్ద‌ బీమా సంబంధిత ఫిర్యాదులు మాత్రమే చేయాల్సి ఉంటుంది.

 • మీ ఫిర్యాదు మొదట బీమా కంపెనీకి చేసి ఉండి అక్కడ దాన్ని నిరాకరించి ఉండాలి. లేదా 30 రోజుల వరకూ ఎలాంటి స్పందన రాకుండా ఉన్నదై ఉండాలి లేదా వచ్చిన స్పందనతో మీరు సంతృప్తి చెందకపోయినదై ఉండాలి.

 • సమస్య పరిష్కారానికి అంబుడ్స్‌మన్‌కు ఏడాదిలోగా ఫిర్యాదు చేయాలి.

 • ఇదే ఫిర్యాదు ఏ కోర్టులోనూ లేదా వినియోగదారుల ఫోరంలోనూ అదే సమయంలో ఇవ్వరాదు.

 • సమస్యల పరిష్కార విలువ రూ.20లక్షలకు మించకూడదు.

పైన పేర్కొన్న నిబంధనలకు లోబడి ఉంటే అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదుచేయొచ్చు.

 • ఫిర్యాదు చేసే బీమా కంపెనీ లేదా దాని సంబంధిత బ్రాంచీ అంబుడ్స్‌మన్‌ పరిధిలో ఉండాలి. న్యాయసంబంధ వివాదాలన్నీ ఆ పరిధిలోని అంబుడ్స్‌మన్‌తో తీర్చుకోవాల్సి ఉంటుంది.

 • సమస్యలను పరిష్కరించేందుకు అంబుడ్స్‌మన్‌ ఓ కౌన్సెలర్‌ లేదా మధ్యవర్తిగా వ్యవహరిస్తారు.

 • మన సమస్య లేదా ఫిర్యాదులో వాస్తవముందని అంబుడ్స్‌మన్‌ భావిస్తే అందుకు తగ్గట్టు పరిష్కార మార్గాన్ని సూచిస్తారు.

 • అంబుడ్స్‌మన్‌ సూచించిన విధానం మనకు అంగీకారమైతే బీమా కంపెనీని 15రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని ఆదేశిస్తారు.

 • ఒకవేళ అంబుడ్స్‌మన్‌ సూచించిన పరిష్కార మార్గంతో పాలసీదారు సంతృప్తి చెందకపోయినా లేదా పరిహార విలువ రూ.20 లక్షల కంటే మించిన వ్యవహరమైతే వినియోగదారుల ఫోరం లేదా సివిల్‌ కోర్టును సంప్రదించాల్సి ఉంటుంది.

ఫిర్యాదు చేసే సమయంలో అందుబాటులో ఉంచుకోవాల్సిన వివరాలు…

 • ఫిర్యాదుదారు పేరు, చిరునామా, ఫోన్‌ నంబ‌రు, ఈ మెయిల్‌
 • పాలసీదారు పేరు, బీమా కంపెనీ వివరాలు, ఏజెంటు పేరు, వివరాలు
 • పాలసీ సంఖ్య
 • క్లెయిం సంఖ్య, ప్రమాదం లేదా నష్ట వివరాలు
 • కంపెనీ లేదా ఏజెంటుతో సమస్య గురించి జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల కాపీ, కంపెనీ ప్రోడక్ట్‌కు సంబంధించిన బ్రోచర్‌లు, చెల్లించిన రశీదులు, ఇన్‌వాయిస్‌లు, క్యాన్సిల్‌ చేసిన చెక్కులు అందుబాటులో ఉంచుకోవాలి.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

కొత్త పాలసీలు

ఓ అంచనాకు రండి

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

సిస్ట‌మేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%