హలో సిరి , నేను ఐసీఐసీఐ నుంచి లిమిటెడ్ ప్రీమియం పేయింగ్ టర్మ్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. బీమా హామీ రూ 1 కోటి. వార్షిక ప్రీమియం రూ 22వేలు . పది ఏళ్ళు కట్టాలి. పాలసీ పీరియడ్ 28 ఏళ్ళు. లిమిటెడ్ ప్రీమియం పేయింగ్ మంచిదేనా ? మా బంధువు ఒకరు ఐసీఐసీఐ లో పనిచేస్తున్నారు. ఆన్లైన్ కన్నా , బ్యాంకు ద్వారా పాలసీ తీసుకోమని సలహా ఇస్తున్నారు. ఆన్లైన్లో ప్రీమియం రూ 21 వేలు ఉంటే, బ్యాంకు ద్వారా ప్రీమియం రూ 22 వేలు ఉంది. బ్యాంకు ద్వారా పాలసీ తీసుకుంటే నాకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా?

మీ అనుకూలాన్ని బట్టి లిమిటెడ్ ప్రీమియం పేయింగ్ టర్మ్ ని ఎంచుకోవచ్చు. ఆన్లైన్ పాలసీ లలో ఏజెంట్ కమిషన్ వుండదు కాబట్టి ప్రీమియం తక్కువగా ఉంటుంది. క్......

డియ‌ర్ సిరి, నా పేరు న‌రేష్‌, మాది నిజామాబాద్‌, నాకు ఐసీఐసీఐ ట‌ర్మ్ పాల‌సీ, పీఎమ్ఎస్‌బీవై, పీఎమ్‌జేజేబీవై, భార‌తీ ఏసీఏ వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా, మోబిక్వీక్ ద్వారా ఐసీఐసీఐ జీవిత బీమా, వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా పాల‌సీలు ఉన్నాయి. ఇవి కాకుండా పీఎఫ్‌పైన ఈడీఎల్ఐ బీమా కూడా ఉంది. నేను ప్ర‌మాదంలో మ‌ర‌ణిస్తే, మా కుటుంబ స‌భ్యులు నా పేరుపై ఉన్న అన్ని బీమా పాల‌సీల‌ను క్లెయిమ్ చేసుకోవ‌చ్చా? లేదా ఏదైనా స‌మ‌స్య ఉండే అవ‌కాశం ఉందా? తెల‌పండి.

ప్రతిపాదన ఫారం(ప్ర‌పోస‌ల్ ఫారం) నింపే స‌మ‌యానికి లేదా భీమా సంస్థ అడిగినప్పుడు, మీకు ఇప్పటికే ఉన్న అన్ని పాలసీల వివరాలను బీమా సంస్థ‌కు అందించాలి. ప్ర‌త......

హయ్ సిరీ నమస్కారం, మా అమ్మాయి కొత్తగా సాఫ్టువేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తూంది. మాకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. తన జీతం తన ఇష్టం అన్నా. కాకపోతే తను 4000- , 5000/- సేవింగ్ చేయలనుకొంటే దేంట్లో చేయాలి. కాల పరిమితి 8,10 సంవత్సరాలు అనుకుంటున్నాం. రిజిస్ట్రార్డ్ ఛిట్ ఫండ్ కంపేనీలో 40 నెలల కాలానికి 5, 10 లక్షల ఛిట్ వేస్తే బాగుంటుందా? , ఇది కాకుండా మ్యూఛఫల్ ఫండ్స్ లో సిప్ చేస్తే బాగుంటుందా? మ్యూచ్ ఫల్ ఫండ్స్ లో అయితే, లార్జ్ క్యాప్ మేలా? మిడిల్ క్యాప్ మేలా? స్మాల్ క్యాప్ మేలా? మ్యూచ్ ఫల్ ఫండ్స్ లో అంటే ఏ కంపేనీ అయితే బాగుంటుందో సలహ ఇవ్వగలరు. అట్లే హెల్త్, టర్మ్ ఇన్సూరెన్స్ లో కూడా ఏదీ బాగుంటుందో సలహ ఇవ్వగలరు. ధన్యవాదములు.

దీర్ఘకాలం కోసం మ్యూచువల్ ఫండ్లలో సిప్ మంచి రాబడి ని అందించగలదు. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ లో ప్రతి నెలా వీలైనంత సిప్ చేయడం మంచిది. టర్మ్ పాలసీ అనేద......

నా వ‌య‌సు 53 సంవ‌త్స‌రాలు. నాకు ఎల్ఐసీలో రూ. 2 ల‌క్ష‌ల‌కు బీమా కిర‌ణ్‌, రూ. 1 ల‌క్ష‌కు జీవ‌న్ మిత్రా, రూ. 4 ల‌క్ష‌ల‌కు జీవ‌న్ ఆనంద్‌, రూ. 3.5 ల‌క్ష‌ల ఐఎన్‌జీలో ఫుల్ ఫిల్ జీవిత బీమా, రూ. 4 ల‌క్ష‌ల ఆరోగ్య బీమా ప‌థ‌కాలు ఉన్నాయి. అయితే ఎల్ఐసీ పాల‌సీలను స‌రెండ‌ర్ చేసి, హెచ్‌డీఎఫ్‌సీ క్లిక్ 2 ప్రొటెక్ట్ ట‌ర్మ్ పాల‌సీ ఎన్ని సంవ‌త్స‌రాల‌కు తీసుకుంటే బాగుంటుంది? 76 సంవ‌త్స‌రాల‌కు తీసుకోవాలా? మొత్తం జీవితానికి తీసుకోవాలా? ప‌్ర‌తీ సంవ‌త్స‌రం ప్రీమియం చెల్లించాలా? కొన్ని 5, 13 సంవ‌త్స‌రాలు క‌డితే మిగ‌తా వాయిదాలు క‌ట్ట‌న‌వ‌స‌రం లేదు అంటున్నారు దీనిపై మీ స‌ల‌హా ఇవ్వ‌గ‌ల‌రు?

మొదట ప్రాధాన్యతగా, మీ వ‌య‌సు ఆధారంగా అర్హ‌త ఉన్న‌ గ‌రిష్ట హామీనిచ్చే ట‌ర్మ్ ఇన్సురెన్స్ ప్లాను తీసుకోండి. మీ వ‌య‌సు 53 సంవ‌త్స‌రాలు కాబ‌ట్టి ప‌ద‌వీ వ......

హ‌లో స‌ర్‌, ఇప్ప‌టివ‌ర‌కు నేను అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు. మీ స‌ల‌హాలు మాకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ్డాయి. నాకు మ‌రో సందేహం ఉంది. ట‌ర్మ్ ఇన్సూరెన్స్ పాల‌సీ భార్య‌, భ‌ర్త ఇద్ద‌రికీ క‌లిపి సింగిల్ ప్లాన్‌లో తీసుకోవ‌చ్చా? ఒకవేళ తీసుకోగ‌లిగితే ఏ ప్లాన్ స‌రైన‌దో మాకు తెలుప‌గ‌ల‌రు. ఐఆర్‌డీఏఐ వెబ్‌సైట్‌లో క్లెయిమ్ నిష్ప‌త్తి గురించి తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ వీలుకాలేదు. అది ఎలా చూడాలో చెప్ప‌గ‌ల‌రు. అదేవిదంగా స‌రైన ప్లాన్‌ను ఎలా ఎంచుకోవాలో తెలియ‌జేయ‌గ‌ల‌రు.

టర్మ్ బీమా పాల‌సీ కుటుంబంలో సంపాదించేవారి పేరు మీద తీసుకోవాలి. ఉమ్మ‌డి ప్లాన్‌ల కంటే వ్య‌క్తిగ‌త పాల‌సీలు మేలు. పాలసీలో మీ వార్షిక ఆదాయానికి కనీసం 10......

ప్రశ్న- సర్, నా వయస్సు 34 సంవత్సరాలు. నాకు ఇద్దరు పిల్లలు. ఒకరి వయస్సు 5 సంవత్సరాలు, ఇంకొకరి వయస్సు ఏడాది. ఇప్పటి వరకు నాకు సొంత ఇల్లు లేదు. నాకు 4 బీమా పాలసీలున్నాయి. వాటికి సంబంధించిన వివరాలు క్రింది ఉన్నాయి. వీటిలో ఒక పాలసీని వెనక్కి ఇవ్వాలని అనుకుంటున్నాను. దయచేసి ఎలాంటి పాలసీలు తీసుకుంటే మంచిదో చెప్పగలరు. 1. ఎల్ఐసీ మనీ బ్యాక్ పాలసీ 2008 లో కొనుగోలు చేశాను. దాని హామీ మొత్తం రూ.2,05,000 /- అలాగే ప్రీమియం సంవత్సరానికి రూ.13213 /- 2. ఎల్ఐసీ జీవాన్ ఆనంద్ 2011 సంవత్సరానికి కొనుగోలు చేశాను. దాని హామీ మొత్తం రూ.5,00,000 /- అలాగే ప్రీమియం సంవత్సరానికి రూ.27124 /- 3. పీఎన్బీ మెట్ లైఫ్ యూలిప్ హామీ మొత్తం రూ.14.5 లక్షలు, ఆలాగే ప్రీమియం సంవత్సరానికి రూ.30,000 /- 4. పీఎన్బీ మెటలైఫ్ స్మార్ట్ ప్లాటినం పాలసీ హామీ మొత్తం రూ.45.5 లక్షలు, అలాగే ప్రీమియం సంవత్సరానికి రూ. 22,000 /-

టర్మ్ లైఫ్ బీమా పథకాలతో పోలిస్తే ఎండోమెంట్, మనీ బ్యాక్, యూలిప్ పాలసీలకు మనం అధిక మొత్తంలో ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. అలాగే దాని హామీ మొత్తం కూడా త......

నా పేరు అమ‌ర్‌నాథ్‌. మాకు 2017 న‌వంబ‌ర్‌లో పాప పుట్టింది. కుటుంబంలో ఆర్జించేది నేనొక్క‌డినే. ప్ర‌స్తుతం నాకు రూ.2 ల‌క్ష‌ల విలువ చేసే ఎల్ఐసీ జీవ‌న్ ఆనంద్‌, రూ.7 ల‌క్ష‌ల విలువ గ‌ల ఎల్ఐసీ జీవ‌న్ స‌ర‌ళ్ పాలసీలు ఉన్నాయి. నేను ట‌ర్మ్ పాల‌సీ తీసుకోవాల‌నుకుంటున్నాను. పాల‌సీ తీసుకునేటప్పుడు ప్యూర్ ట‌ర్మ్ పాల‌సీ తీసుకోవాలా లేదా మ‌నీబ్యాక్‌, హోల్ లైఫ్ పాల‌సీ తీసుకోవాలా తెల‌ప‌గ‌ల‌రు. పాల‌సీకి రైడ‌ర్ల‌ను జోడించాలా లేదా కూడా తెలుప‌గ‌ల‌రు.

మీరు ప్యూర్ ట‌ర్మ్ పాల‌సీ తీసుకోవ‌డం మంచిది. ఎందుకంటే వీటిలో త‌క్కువ ప్రీమియానికే, అధిక హామీ మొత్తం(స‌మ్ అస్యూర్డ్‌) ఉంటుంది. అదే మ‌నీబ్యాక్, హోల్ లైఫ......

నా వ‌య‌సు 32 సంవ‌త్స‌రాలు. ప్ర‌భుత్వ ఉద్యోగం చేస్తున్నాను. నెల‌కు రూ.30వేలు ఆదాయం వ‌స్తుంది. ప్ర‌స్తుతం ఎస్‌బీఐ బ్లూచిప్ ఫండ్ లో రూ.5000; ప్రిన్సిప‌ల్ ఎమ‌ర్జింగ్ బ్లూచిప్ ఫండ్ రూ.2000; ఎల్ అండ్ టీ వ్యాల్యూ ఫండ్ రూ.2000; మీరే ఎమ‌ర్జింగ్ ఫండ్ రూ.2000; రిల‌య‌న్స్ స్మాల్ క్యాప్ ఫండ్ రూ.2000; పీపీఎఫ్ రూ.1000పెట్టుబ‌డి చేస్తున్నాను. ట‌ర్మ్ పాల‌సీ క‌వ‌రేజీ మొత్తం రూ. 60 ల‌క్ష‌లకు ప్రీమియం చెల్లింపు రూ.5900. ప్ర‌భుత్వ ఇచ్చిన ఆరోగ్య బీమా ఉంది. వేరేగా తీసుకోలేదు. నా పోర్టుఫోలియో స‌రిపోయిందా లేదా ఏమైనా మార్పులు అవ‌స‌ర‌మో సూచించ‌గ‌ల‌రు.

మీ ట‌ర్మ్ బీమా పాల‌సీ స‌మ్ అస్యూర్డ్ స‌రిపోతుంది. అయితే మీ పాల‌సీ కి రైడ‌ర్లు (యాక్సిడెంట్, డిసెబులిటీ త‌దిత‌రాల‌ను) ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. మీ......

మాకు ఇద్దరు అమ్మాయిలు, 6 , 4 సంవత్సరాల వయసు. వారి భవిష్యత్తు కోసం ఒక్కొక్కరికీ నెల నెలా రూ. 5000 పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నాను. ఇలా 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టగలను. ప్రస్తుతానికి బీమా పాలసీలకు సంవత్సరానికి రూ. 1,20,000 చెల్లిస్తున్నాను, పీపీఎఫ్ లో నెలకు రూ. 1000, పెద్ద అమ్మాయి పేరుతో పోస్ట్ ఆఫీస్ పధకంలో సంవత్సరానికి రూ. 30 వేలు పెట్టుబడి పెడుతున్నాను. ఎలాంటి మార్పులు చేసుకోవాలి.. భవిష్యత్తు లక్ష్యాలకు ఎలా పెట్టుబడి పెట్టాలో సలహా ఇవ్వండి.

పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నందుకు ముందుగా మీకు అభినందనలు. నెల నెలా రూ. 5 వేలు ఎస్ ఐ పీ విధానం ద్వ......

నా వ‌య‌సు 31. నా వార్షిక ఆదాయం 2.4ల‌క్ష‌లు. ఏజెంటు ద్వారా ఎల్ఐసీలో ఇటీవ‌లే ఒక ట‌ర్మ్ పాల‌సీ తీసుకున్నాను. ఏటా ప్రీమియం రూ.8614. దీనికి బీమా హామీ సొమ్ము 25ల‌క్ష‌లు. మొత్తం 35ఏళ్ల కాలానికి ఈ పాల‌సీ వ‌ర్తిస్తుంది. పాల‌సీ పేరు అమూల్య జీవ‌న్‌ మ్యూచువ‌ల్ ఫండ్లో రూ.5వేలు పెట్టుబ‌డి పెట్ట‌మ‌ని ఏజెంటు స‌ల‌హా ఇచ్చాడు. ఒక సారి చెల్లించి 35ఏళ్లు వ‌దిలేస్తే రూ.3ల‌క్ష‌లు అవుతుంద‌ని చెప్పాడు. ప్రీమియంల రూపంలో చెల్లించిన డ‌బ్బంతా ఈ ఫండ్‌లోని రాబ‌డితో వ‌చ్చేస్తుంద‌ని ఆయ‌న అంటున్నాడు. మ‌రో సంస్థకు చెందిన ప్రతినిధి నెల నెలా రూ.500 పెట్టుబ‌డితో ఓ ఫండ్‌ను సూచిస్తున్నారు. ఆ సంస్థ పేరు అంత ప్ర‌ఖ్యాతిగాంచిన‌ది కాదు. ఏజెంటు చెప్పిన విధంగా అదే ఫండ్‌లో పెట్టుబ‌డి చేయాలా లేదంటే ప్రాచుర్యం పొందిన నమ్మకమైన మ్యూచువ‌ల్ ఫండ్ కంపెనీలో పెట్టుబ‌డి పెట్టాలో తెలియ‌జేయ‌గ‌ల‌రు.

మీరు ఎంచుకున్న ఇన్సూరెన్సు పాలసీ మంచిదే, అది అందించే మొత్తం కూడా సరిపడానే ఉంది. టర్మ్ పాలసీ సాధారణంగా ఒక వ్యక్తికీ మరణం సంభవిస్తే బీమా హామీ మొత్తం చ......
బీమా అవ‌స‌రం ఏమిటి?

జీవితంలో అనుకోని సంఘ‌ట‌న‌ల వలన కలిగే ఆర్ధిక ఒడిదుడుకుల నుంచి ర‌క్ష‌ణ పొందేందుకు బీమా అవ‌స‌రం.

బీమా తీసుకునే ముందు గ‌మ‌నించాల్సిన అంశాలేమిటి?

సంభవించే నష్టం భర్తీ చేసే మొత్తానికి బీమా హామీ, కోల్పోయే ఆదాయం, చెల్లించ వలసిన ప్రీమియం, వంటి వివిధ అంశాలను పరిగణించి బీమా తీసుకోవాలి.

బీమా పాల‌సీని ఎలా కొనుగోలు చేయాలి?

వ్య‌క్తిగ‌త ఏజెంటు, కార్పొరేట్ ఏజెంటు, బ్రోక‌ర్‌, ఆన్‌లైన్‌లో బీమా పాల‌సీని కొనుగోలు చేయ‌వ‌చ్చు.

జీవిత బీమాలోని ర‌కాలు?

జీవిత బీమా పాలసీలలో కేవలం బీమా కల్పించే ట‌ర్మ్‌ పాలసీ, బీమాతో బాటు పొడుపు / పెట్టుబడి అంశం తోడయిన మ‌నీబ్యాక్‌, ఎండోమెంట్‌, యులిప్స్‌ వంటి పాలసీలు అందుబాటులో ఉన్నాయి.

మెడిక్లెయిం అంటే ఏమిటి?

పాల‌సీ కాల‌ప‌రిమితి లోపు అనారోగ్యం/ వ్యాధుల‌కు అయ్యే ఖ‌ర్చుల‌కు క‌ల్పించే రీయింబ‌ర్స్‌మెంట్ స‌దుపాయాన్ని మెడిక్లెయిమ్ అంటారు.

ఆరోగ్య బీమా పాల‌సీ కింద క‌వ‌రేజీ వేటికి ఉండ‌దు?

క‌ళ్ల‌ద్దాలు, కాంటాక్ట్‌లెన్సులు, వినికిడి సాధ‌నాలు, దంత చికిత్స, సౌందర్య సంబందిత శాస్త్ర చికిత్సల వంటి వాటికి ఆరోగ్య బీమా పాల‌సీ క‌వ‌రేజీ వ‌ర్తించ‌క‌పోవ‌చ్చు.

ఆరోగ్య బీమా పాల‌సీల‌కు ప‌న్ను ప్ర‌యోజ‌నం ఎంత ఉంటుంది?

ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 80(డీ) కింద రూ. 25 వేల ప్రీమియం వ‌ర‌కూ ప‌న్ను ప్ర‌యోజ‌నాలు వ‌ర్తిస్తాయి

మోటారు బీమా ఏయే సంద‌ర్భాల్లో వ‌ర్తిస్తుంది?

అగ్ని ప్ర‌మాదం, వ‌ర‌ద‌లు, దొంత‌నం, ప్ర‌కృతి విప‌త్తులైన వ‌ర‌ద‌లు, తుపాన్లు వంటివి వ‌చ్చిన‌ప్పుడు వాహ‌నానికి జ‌రిగే న‌ష్టానికి

నో క్లెయిం బోన‌స్ అంటే ఏమిటి?

ఒక నిర్దిష్ట‌మైన సంవ‌త్స‌రంలో పాల‌సీదారులు ఎటువంటి క్లెయిం చేయ‌న‌ప్పుడు ఇచ్చే బ‌హుమానం

మోటార్ బీమా పాల‌సీ పోగొట్టుకుంటే ఎలా?

బీమా కంపెనీ కార్యాల‌యాన్ని సంప్ర‌దించి నామ‌మాత్ర‌పు రుసుముల‌తో పాల‌సీ న‌క‌లును పొంద‌వ‌చ్చు.

ఆస్తికి బీమా అవ‌స‌రం ఏమిటి?

అగ్ని ప్ర‌మాదాలు, చోరీ, ప్ర‌కృతి వైప‌రీత్యాలు, విద్యుత్తు షార్ట్‌స‌ర్కూట్‌, తుపానులు, వ‌ర‌ద‌లు, వ‌డ‌గ‌ళ్లు, భూకంపాలు, మంచుతుపాను, నిర‌స‌న‌లు, అల్ల‌ర్లు, ఉగ్ర‌వాద చ‌ర్య‌లు మొద‌లైన ప్ర‌మాదాల వ‌ల్ల క‌లిగే ఆర్థిక న‌ష్టాన్ని ఆస్తి బీమాతో కొంత‌వ‌ర‌కూ పూరించుకోవ‌చ్చు.

బీమా పాల‌సీని ట‌ర్మ్ మ‌ధ్య‌లో ర‌ద్దు చేసుకోవ‌చ్చా ?

చేసుకోవచ్చు. కానీ అలా రద్దు చేసుకునే ముందు వేరొక పాలసీ తీసుకుని రద్దుకు ప్రయత్నించాలి. ఒక వేళ పాత పాలసీ రద్దు అయి కొత్త పాలసీ లేని సమయం లో ఏదినా నష్టం సభావిస్తే రక్షణ ఉండదు.

ప్ర‌యాణ బీమా ఉద్దేశం ఏమిటి?

విదేశ ప్రయాణం చేసినప్పుడు జరిగే ఆర్ధిక నష్టాలకు, ప్రయాణ భీమా రక్షణ కల్పిస్తుంది.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

కొత్త పాలసీలు

ఓ అంచనాకు రండి

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

డివిడెంట్ అంటే ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%