వడ్డీ రేట్లను సవరించిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్.....

సీనియర్ సిటిజన్లు తమ డిపాజిట్లపై 0.5 శాతం అదనపు వడ్డీ రేటును పొందుతారు

వడ్డీ రేట్లను సవరించిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్.....

ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ) పై వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన వడ్డీ రేట్లు 1 జూలై 2019 నుంచి అమల్లోకి వస్తాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ కనిష్టంగా ఏడు రోజుల నుంచి ఒక సంవత్సరం వరకు స్వల్పకాలిక ఎఫ్‌డీలను, అదే విధంగా ఒకటి నుంచి పది సంవత్సరాల వరకు దీర్ఘకాలిక ఎఫ్‌డీలను అందిస్తుంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు 6.50 శాతం నుంచి 8.50 శాతం వరకు ఉన్నాయి. సీనియర్ సిటిజన్లు తమ డిపాజిట్లపై 0.5 శాతం అదనపు వడ్డీ రేటును పొందుతారు. 366 రోజుల నుంచి 2 సంవత్సరాల కాలపరిమితి కలిగిన డిపాజిట్‌లకు అత్యధికంగా 8.50 శాతం వడ్డీ రేటును బ్యాంకు అందిస్తుంది.

ఇటీవల రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన రుణ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన తరువాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వడ్డీ రేట్లను సవరించాయి. తాజాగా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు కూడా వడ్డీ రేట్లను సవరించింది.

idfc.png

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు ఏడు రోజుల నుంచి 90 రోజుల కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.5 శాతం వడ్డీ రేటును, అలాగే 91 రోజుల నుంచి ఒక సంవత్సరం వరకు కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

అయితే 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కాలపరిమితి గల దీర్ఘకాల ఫిక్స్డ్ డిపాజిట్లపై మాత్రం బ్యాంకు మంచి వడ్డీ రేటును అందిస్తుంది. 2 నుంచి 5 సంవత్సరాల కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.50 శాతం, అలాగే 5 నుంచి 10 సంవత్సరాల కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీ రేటును బ్యాంకు అందిస్తుంది. బ్యాంక్ ఎఫ్‌డి డిపాజిట్లపై మంచి రాబడిని ఇస్తున్నప్పటికీ, నెలకు రూ. 25,000 కనీస బ్యాలెన్స్ ను తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది.

ఈ రోజు ఉదయం 9:45 గంటలకు, బ్యాంక్ షేర్లు బీఎస్ఈలో 0.60 శాతం తగ్గి రూ. 41.55 వద్ద ట్రేడ్ అయ్యింది. ఈ స్టాక్ 1 ఏప్రిల్ 2019వ తేదీన 52 వారాల గరిష్ట స్థాయి రూ. 56.90 ను తాకింది.

నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ క్యాపిటల్ ఫస్ట్‌లో విలీనం అయిన తరువాత, ఐడీఎఫ్‌సీ బ్యాంక్ పేరు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్‌గా మారింది. ఈ కొత్త పేరు 12 జనవరి 2019 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు 203 బ్యాంకు శాఖలు, 129 ఏటీఎంలు, 454 గ్రామీణ వ్యాపార కరస్పాండెంట్ కేంద్రాల ద్వారా 7.2 మిలియన్ ఖాతాదారులకు సేవలు అందిస్తుంది.

(source - livemint)

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly