పెట్టుబడి పెట్టడానికి ఉత్తమైన మార్గం..

చాలా మంది మ‌దుప‌ర్లు పెట్టుబ‌డి చేస్తూ మంచి మొత్తాన్ని పొంద‌డంలో స‌మ‌స్య‌లు ఎదుర్కొంటుంటారు

పెట్టుబడి పెట్టడానికి ఉత్తమైన మార్గం..

సిప్ విధానంలో మ్యూచువ‌ల్ ఫండ్లో పెట్టుబ‌డి చేయ‌డం, రిక‌రింగ్ డిపాజిట్లు రెండూ వేర్వేరు ర‌కాలైన పెట్టుబ‌డి సాధ‌నాలు. సిప్ పెట్టుబ‌డి విధానంలో రిక‌రింగ్ డిపాజిట్లు (ఆర్‌డీ) కంటే కూడా సుల‌భంగా, లిక్విడిటీ, రాబ‌డి, ప‌న్ను విధానం త‌దిత‌ర విష‌యాల్లో మెరుగ్గా ఉంటుంది.

చాలా మంది మ‌దుప‌ర్లు పెట్టుబ‌డి చేస్తూ మంచి మొత్తాన్ని పొంద‌డంలో స‌మ‌స్య‌లు ఎదుర్కొంటుంటారు. అయితే వీరు సుల‌భ‌మైన మార్గాల్లో చిన్న‌చిన్న పెట్టుబ‌డులు చేయ‌డం ద్వారా మంచి మొత్తాన్ని పొంద‌వ‌చ్చు. వీటికి రిక‌రింగ్ డిపాజిట్లు, సిప్ విధానంలో మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి విధానం చాలా ఉప‌క‌రిస్తుంది.

రిక‌రింగ్ డిపాజిట్ :

  • మ‌దుప‌రి ప్ర‌తీ నెల కొంత మొత్తాన్ని క్ర‌మంగా చెల్లించ‌డం ద్వారా భ‌విష్య‌త్తులో మంచి సంప‌ద‌ను పొంద‌వ‌చ్చు.
  • రిక‌రింగ్ డిపాజిట్ల‌లో కాల‌ప‌రిమితి 12 నెల‌ల నుంచి 120 నెల‌ల వ‌ర‌కూ ఉంటుంది. రిక‌రింగ్ డిపాజిట్లు స్థిరాదాయ పెట్టుబ‌డి వ‌ర్గానికి చెంద‌న‌వి.
  • వీటిలో న‌ష్ట‌భ‌యం చాలా త‌క్కువ‌. రాబ‌డి కూడా త‌క్కువ‌గానే ఉంటుంది.
  • న‌ష్ట‌భ‌యం త‌క్కువ ఉన్న మ‌దుప‌ర్లు, స్వ‌ల్ప‌కాలిక ల‌క్ష్యాలు క‌లిగిన వారికి ఆర్‌డీలు మంచివి.

సిప్ :

  • మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌దుప‌ర్లు సిప్ విధానంలో లేదా లంప్ స‌మ్ గా మ‌దుపు చేయ‌వ‌చ్చు.
  • మ్యూచువ‌ల్ ఫండ్లలో డెట్,ఈక్విటీ, హైబ్రిడ్ ప‌థ‌కాల ప్ర‌కారం రాబ‌డి ఉంటుంది. వీటి ద్వారా వ‌చ్చే రాబ‌డికి హామీ ఉండ‌దు.
  • సిప్ విధానంలో పెట్టుబ‌డి చేస్తే మార్కెట్ హెచ్చుత‌గ్గుల‌ ప్ర‌భావం ప‌డ‌కుండా యూనిట్ ధ‌ర ఎక్కువున్నా,త‌క్కువున్నా రెండు సంద‌ర్భాల్లో కొనుగోలు చేస్తుంటారు. త‌ద్వారా దీర్ఘ‌కాలంలో యూనిట్ ధ‌ర స‌రాస‌రి అవుతుంది.
  • సిప్ విధానంలో స్థిర‌మైన మొత్తాన్ని క్ర‌మంగా రోజు,వారం,నెల, త్రైమాసికానికి ఒక‌సారి చెల్లించ‌వ‌చ్చు.

ఏది మంచిది?

సిప్ విధానంలో చేసే పెట్టుబ‌డి ఆర్ డీ కంటే కొన్ని విష‌యాల్లో ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది. సిప్ మ‌నం మ‌ధ్య‌లో ఆపివేయాల‌నుకుంటే కుదురుతుంది. దీనికి 15 రోజుల ముందు ఫండ్ నిర్వాహ‌కుల‌కు తెలియ‌జేస్తే స‌రిపోతుంది. దీని ద్వారా రాబ‌డిపై ఎటువంటి ప్ర‌భావం ఉండ‌దు.

రిక‌రింగ్ డిపాజిట్ల‌లో నెల‌వారీ పొదుపు మ‌ధ్య‌లో ఆపివేస్తే దాని ప్ర‌భావం రాబ‌డిపై చూపుతుంది.ముందు అనుకున్నంత వ‌డ్డీ కంటే త‌క్కువ వ‌స్తుంది. రిక‌రింగ్ డిపాజిట్ల ద్వారా వ‌చ్చే ఆదాయం స్థిరంగా ఉంటుంది. సిప్ ద్వారా డెట్ ఫండ్ల‌పై చేసే పెట్టుబ‌డుల పై వ‌చ్చే ఆదాయం ఆర్‌డీల కంటే ఎక్కువ‌గా ఉంటుంది.

అయితే ఆర్‌డీల‌తో పోలిస్తే వీటికి ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. ఆర్‌డీ ల ద్వారా వ‌చ్చే వ‌డ్డీపై పూర్తిగా ప‌న్ను చెల్లింపు ఉంటుంది. త‌క్కువ ప‌న్ను శ్లాబులో ఉన్న‌వారికి, క‌చ్చిత‌మైన రాబ‌డి కోరుకునే వారికి రిక‌రింగ్ డిపాజిట్లు స‌రిప‌డ‌తాయి

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly