బంగారంలో మ‌దుపు చేసేందుకు ప‌థ‌కాలు

భౌతిక రూపంలో కాకుండా ఎల‌క్ట్రానిక్ రూపంలో బంగారంలో పెట్టుబ‌డి పెట్టేందుకు అందుబాటులో ఉండే మార్గాలు.

బంగారంలో మ‌దుపు చేసేందుకు ప‌థ‌కాలు

బంగారంలో పెట్టుబ‌డి పెట్టేందుకు వివిధ ర‌కాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. నేరుగా బంగారం కొన‌డంతో పాటు ఎల‌క్ట్రానిక్ రూపంలో కూడా కొనుగోలు చేయోచ్చు. ఈ విధానంలో కొనుగోలు చేసే వారి పేరుపై బంగారం అధికారికంగా న‌మోదై ఉంటుంది. దాన్ని బంగారంగా మార్చుకుని ఇంటికి తెచ్చుకునే అవ‌కాశం అందుబాటులో ఉంది లేదా మార్కెట్లో అప్ప‌టి ధ‌ర‌కు విక్ర‌యించ‌వ‌చ్చు. బంగారంపై పెట్టుబ‌డి చేసి రాబ‌డి పొందాల‌నుకునే వారికి ఈ విధానంలో మ‌దుపు చేయ‌డం లాభ‌దాయ‌కం. ఈ- గోల్డు కొనుగోలు చేసేందుకు ఉన్న కొన్ని ప‌ద్ధ‌తుల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

గోల్డ్ ఈటీఎఫ్‌: బంగారం పై మ‌దుపు చేయాల‌నుకునే వారికి గోల్డ్ ఈటీఎఫ్‌లు అందుబాటులో ఉన్నాయి. మ్యూచువ‌ల్ ఫండ్ నిర్వాహ‌క సంస్థ‌లు గోల్డు ఈటీఎఫ్ ప‌థ‌కాల‌ను అందిస్తున్నాయి. ఈ ఫండ్‌లో స‌మీక‌రించిన నిధుల‌ను బంగారం పై మ‌దుపు చేస్తారు. అంటే బంగారం ధ‌ర పై మ‌న ఫండ్ ఎన్ఏవీ ఆధారప‌డిఉంటుంది. ఆన్‌లైన్ లో ఈ యూనిట్ల‌ను కొనుగోలు, అమ్మ‌కం చేసేందుకు వీలుంటుంది.

సార్వ‌భౌమ బంగారు ప‌థ‌కాలు: ఈ విధానంలో కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేసే బంగారు బాండ్లను కొనుగోలు చేయ‌వ‌చ్చు. మెచ్యూరిటీ ముగిసిన త‌రువాత బాండ్ల ద్వారా వ‌చ్చే మొత్తం మార్కెట్లో ఆ స‌మ‌యంలో ఉన్న ధ‌ర‌కు స‌మానంగా ఉంటుంది. కాబ‌ట్టి ఆ మొత్తంతో మార్కెట్లో బంగారం కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇవి దీర్ఘ‌కాలం పాటు మ‌దుపు చేయాల్సిన పెట్టుబ‌డి ప‌థ‌కాలు. వీటిపై క్రమంగా వ‌డ్డీ పొంద‌వ‌చ్చు. బాండ్ల కాల‌ప‌రిమితి ముగిశాక అస‌లు మొత్తం పొంద‌వ‌చ్చు.

ఎమ్ఎమ్‌టీసీ-పీఏఎమ్‌పీ: ఎమ్ఎమ్‌టీసీ-పీఏఎమ్‌పీ ద్వారా బంగారాన్ని క్ర‌మ ప‌ద్ధ‌తిలో కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ విధానంలో మీరు 0.5 గ్రాము నుంచి కొనుగోలు చేయ‌వ‌చ్చు. క్ర‌మంగా కొనుగోలుచేస్తూ త‌ద్వారా మీకు అవ‌స‌ర‌మైనంత బంగారాన్ని పొంద‌వ‌చ్చు. ఈ విధానంలో బంగారం నేరుగా రిఫైన‌రీ నుంచి మ‌దుప‌ర్ల‌కు అందుతుంది. ఈ సంస్థ భార‌త ప్ర‌భుత్వం స్విట్జ‌ర్ ల్యాండ్ కు చెందిన పీఏఎమ్‌పీ ఎస్ఏ తో 2008 లో క‌లిపి స్థాపించారు. దీని కార్య‌కాలాపాలు పూర్తి స్థాయిలో 2012 నుంచి ప్రారంభ‌మయ్యాయి. బంగారం కొనుగోలు దారుల‌కు కావ‌ల్సిన ప‌రిమాణాల్లో ఈ సంస్థ అందిస్తుంది. మోతీలాల్ ఓస్వాల్ ఎమ్ఈ గోల్డ్ ప‌థ‌కం ద్వారా ఇందులో బంగారం క్ర‌మంగా సిప్ విధానంలో కొనుగోలు చేసే ప‌థ‌కాన్ని తీసుకొచ్చింది.

నేరుగా రిఫైన‌రీ నుంచి తెచ్చిన బంగారం అందుబాటులో ఉంటుంది. స్వ‌చ్ఛ‌త‌కు ఇది బెంచ్ మార్క్. ఈ ప‌థ‌కం ద్వారా బంగారం కొనుగోలు చేసి ఎమ్ఎమ్‌టీసీ పీఏఎమ్‌పీ వ్యాలెట్ల‌లో భ‌ద్ర‌ప‌రుస్తుంది. దీనికి అద‌నంగా ఛార్జీలు ఉండ‌వు. ఈ విధానంలో మీరు 0.5 గ్రాము నుంచి కొనుగోలు చేయ‌వ‌చ్చు. క్ర‌మంగా కొనుగోలుచేస్తూ త‌ద్వారా మీకు అవ‌స‌ర‌మైనంత బంగారాన్ని పొంద‌వ‌చ్చు. ఎమ్ఎమ్‌టీసీ-పీఏఎమ్‌పీ ద్వారా బంగారాన్ని క్ర‌మ ప‌ద్ధ‌తిలో కొనుగోలు చేసిన బంగారాన్ని డెలివ‌రీ పొంద‌వ‌చ్చు. కావాలంటే వారికి తిరిగి ఆన్ లైన్ లోనే క్ర‌య‌విక్ర‌యాలు చేయ‌చ్చు.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly