సంక్షిప్త వార్తలు:

 • భారీ లాభాల‌తో ముగిసిన మార్కెట్లు ; సెన్సెక్స్ @ 35,843, నిఫ్టీ @ 10,551
 • గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం (2019-20)లో దేశంలో 3వ అతిపెద్ద టెలికాం సంస్థ `వొడాఫోన్ ఐడియా` రికార్డు స్థాయిలో రూ. 73,878 కోట్ల నిక‌ర న‌ష్టాన్ని చ‌విచూసింది.
 • 99ఏక‌ర్స్‌.కామ్ యొక్క స‌ర్వేలో 31% ఇప్ప‌టికీ రియ‌ల్ ఏస్టేట్‌లో పెట్టుబ‌డికి మొగ్గు చూపుతున్నారు.
 • 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రంలో 13 శాతం వృద్ధితో రూ.963 కోట్ల ఆదాయాన్ని న‌మోదు చేసిన సెబీ
 • పాన్-ఆధార్ గ‌డువును జూన్ 30 వ‌ర‌కు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ‌
 • మ్యూచువ‌ల్ ఫండ్ యూనిట్ల రిడెంప్ష‌న్‌కు స్టాంప్ డ్యూటీ వ‌ర్తించ‌ద‌ని `సెబీ` స్ప‌ష్టం చేసింది.
 • కో-ఆప‌రేటివ్ బ్యాంకుల‌ను ఆర్‌బీఐ నియంత్ర‌ణ‌లోకి తీసుకొచ్చేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణ‌యం
 • యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) దేశ‌వ్యాప్తంగా 125 ప్రాంతీయ కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేసింది.
 • నేడు డాల‌ర్‌తో రూ. 74.88 వ‌ద్ద కొన‌సాగుతోన్న రూపాయి మార‌కం విలువ‌
 • ఈ రోజు హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.83.49, డీజిల్ ధ‌ర రూ.78.69

పెట్టుబడుల నిర్వహణలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం !!

భవిష్యత్తు ఆర్ధిక అవసరాలకోసం వివిధ రకాల పెట్టుబడి సాధనాలలో పెట్టుబడి పెడుతుంటాం. వాటి నిర్వహణలో ఏవైనా సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించుకునే విధానం తెలుసుకోవడం ముఖ్యం.

వివిధ రకాల పెట్టుబడి సాధనాల సమస్యల పరష్కార విధానం

పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాల సమస్యల పరిష్కారం

ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ ద్వారా వివిధ రకాల పొదుపు పధకాలను అందిస్తుంది. వాటి నిర్వహణలో ఏవైనా సమస్యలు ఎదురైతే www.indiapost.gov.in వెబ్సైటు ద్వారా ఫిర్యాదు చెయ్య వచ్చు.

ఫిర్యాదు నమోదు చేసేందుకు కింద ఇచ్చిన ఫారంపై క్లిక్ చెయ్యండి

POSTOFFICE-2.png

స్టాక్ మార్కెట్ ఆధారిత పెట్టుబడి సాధనాల సమస్యల పరిష్కారం

 • షేర్ల పెట్టుబడి, ట్రేడింగ్,
 • మ్యూచువల్ ఫండ్లు,
 • కంపెనీలు విడుదల చేసే బాండ్లు / డిబెన్చర్లు ఫిక్స్డ్ డిపాజిట్లు,
 • షేర్ బ్రోకర్, డీపీ,
 • పోర్ట్ ఫోలియో మేనేజర్లకు,
 • కేవైసీ, రేటింగ్ ఏజెన్సీస్ మొదలైన
  పెట్టుబడి సాధనాలు, వాటిని నిర్వహించే సంస్థల సేవలలో లోపాలకు సంబంధించి సమస్యలు ఎదురైతే ముందుగా పెట్టుబడి పెట్టిన సంస్థ ఫిర్యాదుల విభాగానికి సమస్య తెలియజేయాలి.
  వారి నుంచి సరైన స్పందన రాకున్నా, వారు ఇచ్చిన వివరణ/పరిష్కారం సంతృప్తికరంగా లేకున్నా తదుపరి సెబీ (SEBI) ప్రత్యేక ఫిర్యాదుల విభాగం ద్వారా పరిష్కరించుకోవచ్చు.

SEBI-COMP-2.png
సెబీ ప్రత్యేక ఫిర్యాదుల విభాగం SCORESకు ఫిర్యాదు చేసే విధానం.

పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు చిరునామా

Hyderabad Local Office
1st Floor, Indira Chambers,
8-2-622/5/A/1,Road No. 10,Avenue 4,
Banjara Hills,
Hyderabad - 500 034
Tel : +91-040-23384475/ 23384476

ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు ఈ మెయిల్ అడ్రస్:

sebi@sebi.gov.in

ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చెయ్యాలంటే కింద ఇచ్చిన ఫారంను క్లిక్ చెయ్యండి

MCA.jpg
 • ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు పాన్ వివరాలతో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి.

ఫిర్యాదు చేయడమే కాకుండా పెట్టుబడుల నిర్వహణకు సంబంధించిన వివరాలు, చేసిన ఫిర్యాదు పరిష్కారానికి సంబంధించిన వివరాలు సెబీ టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా కూడా సహాయం పొందవచ్చు.

సెబీ టోల్ ఫ్రీ నెంబర్లు - 1800 266 7575 లేదా 1800 22 7575

స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టు కాని పెట్టుబడి సాధనాల సమస్యల పరిష్కారం

లిస్టు కాని, లిస్టైన కంపెనీల‌కు చెందిన పెట్టుబ‌డి సాధ‌నాలకు సంబంధించిన‌ సమస్యలను కేంద్ర కార్పోరేట్ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ‌ (ఎమ్ సీ ఏ) వెబ్ సైటు ద్వారా ఫిర్యాదు న‌మోదుచేసుకోవ‌చ్చు.

ఫిర్యాదు నమోదు చేసేందుకు కింద ఇచ్చిన ఫారంపై క్లిక్ చెయ్యండి

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

ఓ అంచనాకు రండి

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

కంపెనీల షేర్ల‌ను మొద‌టి సారి ఎక్క‌డ జారీ చేస్తారు?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%