ఈక్విటీ, డెట్ రెండూ ఉండేలా ఫండ్ల ఎంపిక‌

మ్యూచువ‌ల్ ఫండ్లను ఎంపిక చేసుకునేముందు మ‌దుప‌ర్లు న‌ష్ట‌భ‌యం, రాబ‌డితోపాటు ఆర్థిక ల‌క్ష్యం, వృద్ధి,న‌గ‌దు ల‌భ్య‌త ల‌ను దృష్టిలో ఉంచుకోవాలి.

ఈక్విటీ, డెట్ రెండూ ఉండేలా ఫండ్ల ఎంపిక‌

పెట్టుబ‌డి చేసేందుకు వివిధ ర‌కాల ఫండ్లు మ‌దుప‌ర్ల‌కు అందుబాటులో ఉన్నాయి. మ‌దుప‌ర్లు త‌మ న‌ష్ట‌భ‌యం ఎంత‌నేది లెక్కించుక‌ని దానికి అనుకూలంగా ఈక్విటీ, స్థిర ఆదాయ‌ ఫండ్ల‌ను ఎంచుకోవాలి. పోర్టుఫోలియో నిర్మించుకునే ముందు మ‌దుప‌ర్లు త‌మ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఉండే ఫండ్లను న‌ష్ట‌భ‌యం, రాబ‌డి అంచ‌నా ఆధారంగా ఎంపిక చేసుకోవాలి. ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లలో న‌ష్ట‌భ‌యం ఎక్కువ ఉంటుంది. వీటిలో రాబ‌డి ఎక్కువ‌గా వ‌చ్చేందుకు ఆస్కారం ఉంటుంది. స్థిరాదాయ ఫండ్ల‌లో న‌ష్ట‌భ‌యం త‌క్కువ ఉంటుంది. వాటిలో రాబ‌డి త‌క్కువ‌గా ఉంటుంది. రెండు వ‌ర్గాలు క‌లిపి ఉండే బ్యాలెన్సెడ్ ఫండ్ల‌ను ఎంపిక చేసుకోవ‌చ్చు. మ‌దుప‌ర్లు త‌మ పెట్టుబ‌డుల్లో కొంత శాతం ఈక్విటీ సంబంధిత పెట్టుబ‌డుల‌లో మ‌దుపుచేయ‌డం ద్వారా ఈక్విటీ పెట్టుబ‌డులు దీర్ఘ‌కాలంలో బాగా వృధ్ధి చెందుతాయి. ఈక్విటీ కేట‌గిరీలో వివిధ ర‌కాల ఫండ్లు అందుబాటులో ఉంటాయి. మార్కెట్ క్యాపిట‌లైజ‌స్త్రస‌న్ ఆధారంగా లార్జ్ , మిడ్ ,స్మాల్ , మ‌ల్టీ క్యాప్ ఫండ్లు ఉంటాయి. లార్జ్ క్యాప్ ఫండ్లు కొంత స్థిరంగా ఉంటాయి. ఇత‌ర ఈక్విటీ ఫండ్ల‌తో పోలిస్తే వీటిలో పెట్టుబ‌డి చేయ‌డం ద్వారా రాబ‌డికి స్థిర‌త్వం ఉంటుంది. ఈక్విటీలో దీర్ఘ‌కాలం పాటు మ‌దుపు చేసే వారు ఎక్కువ భాగం లార్జ్ క్యాప్ ఫండ్ల‌ను ఎంచుకోవ‌డం మంచిది.

వీటితో పాటు ఇండెక్స్ ఫండ్లను ఎంపిక చేసుకోవ‌చ్చు. మ‌దుప‌ర్లు కొంత శాతం ఇండెక్స్ ఫండ్ల‌లో మ‌దుపు చేసే విష‌యం ప‌రిశీలించ‌వ‌చ్చు. వీటిలో త‌క్కువ నిర్వ‌హ‌ణ రుసుము ఉంటుంది. ఈ ఫండ్లు నిఫ్టీ, సెన్సెక్స్ లాంటి మార్కెట్ ఇండెక్స్ ల‌తో పాటు వివిధ‌ రంగాల‌కు చెందిన ఇండెక్స్‌ల ఆధారంగా కూడా ఉంటాయి. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ఈఎల్ఎస్ఎస్) ద్వారా ప‌న్ను మిన‌హాయింపులు పొందేందుకు వీటుంటుంది. సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. వీటికి మూడేళ్ల లాక్ఇన్ పిరియ‌డ్ ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ ప‌థ‌కాల్లో చేసే పెట్టుబ‌డికి వివిధ ర‌కాల మార్కెట్ క్యాప్ట‌లైజేష‌న్లు, రంగాల‌కు చెందిన పెట్టుబ‌డుల‌ను మ‌దుపు చేసేందుకు వీలుంటుంది.

కొంత న‌ష్ట‌భ‌యం ఉన్నా ఫ‌ర్వాలేదు రాబ‌డి రావాల‌ని ఆశించే వారు మ‌ల్టీ క్యాప్ ఫండ్ల‌ను ఎంచుకోవ‌చ్చు. మ్యూచువ‌ల్ ఫండ్ నిర్వాహ‌కులు మ‌ల్టీ క్యాప్ ఫండ్ల‌లో మొత్తం లార్జ్, మిడ్, స్మాల్ మూడుకేట‌గిరీల్లో ఉండే కంపెనీల్లో మ‌దుపుచేస్తారు. కాబ‌ట్టి వీటిలో న‌ష్ట‌భ‌యం కాస్త ఎక్కువ‌గానే ఉంటుంది. రాబ‌డి వ‌చ్చేందుకు అవ‌కాశం కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ఉప‌యోగించుకునేందుకు ఏర్పాటు చేసే అత్య‌వ‌స‌ర నిధికి లిక్విడ్ ఫండ్లలో పెట్టుబ‌డి చేయ‌డం మంచిది. అత్య‌వ‌స‌ర నిధికోసం లిక్విడ్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి చేయ‌డం వెనుక కార‌ణం ఈ ఫండ్ల యూనిట్ల‌ను ఒక్క‌రోజులోనే న‌గ‌దు రూపంలో మార్చుకునేందుకు వీలుంటుంది. దీంతో పాటు సేవింగ్స్ బ్యాంకు ఖాతా పై వ‌చ్చే వ‌డ్డీతో పోలిస్తే ఎక్కువ రాబ‌డి వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly