బీమా పాల‌సీల్లో కొత్త నిబంధ‌న‌లు

బీమా పాల‌సీల్లో కొత్త నిబంధ‌న‌లు మెచ్యూరిటీ కాల‌ప‌రిమితి కంటే ముందు పాల‌సీని ఉప‌సంహ‌రించే వారికి వ‌ర్తించే స‌రెండ‌ర్ ఛార్జీల‌ను కొంత మేర‌కు త‌గ్గాయి.

బీమా పాల‌సీల్లో కొత్త నిబంధ‌న‌లు

కొత్త నిబంధ‌న‌లతో బీమాతో క‌లిపి పెట్టుబడి పెట్టే సాంప్రదాయ పాలసీల ముందస్తు నిష్క్రమణ ఖర్చు కొద్దిగా తక్కువ ఖర్చు అవుతుంది, కానీ ఇంకా పాల‌సీదార్ల‌కు భారంగానే ఉంది. స‌రెండ‌ర్ ఛార్జీలు అంటే పాల‌సీ కాల‌ప‌రిమితి ముగియ‌క‌ముందే పాలసీని ఉప‌సంహ‌రించుకుంటే వ‌ర్తించే ఛార్జీలు ఐఆర్‌డీఏ కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం ఇవి కొంత‌మేర‌కు తగ్గాయి.

గత ఏడాది అక్టోబర్‌లో విడుదల చేసిన ముసాయిదా మార్గదర్శకంలో సూచించినట్లుగా, స‌రెండ‌ర్ ఛార్జీలు కొద్దిగా తగ్గినప్పటికీ, అవి బీమా పథకం మధ్యలో ఉప‌సంహ‌రించుకునే సౌకర్యాన్ని ఇచ్చే విధంగా లేవు. బీమాతో క‌లిపి పెట్టుబడి పెట్టే సాంప్రదాయ పాలసీలపై వ‌ర్తించే స‌రెండ‌ర్ ఛార్జీలు ఐఆర్‌డీఏ నోటిఫై చేసిన‌ కొత్త ఉత్పత్తి నిబంధనల ప్రకారం కొనసాగ‌నున్నాయి.

ప్రస్తుతం,10 సంవత్సరాలకు పైగా సాంప్రదాయ ప్లాన్‌ను కొనుగోలు చేసినప్పుడు, మీరు మూడేళ్ల తర్వాత మాత్రమే సరెండర్ విలువకు అర్హులు. కొత్త నిబంధనలు ఈ కాలాన్ని రెండేళ్లకు తగ్గించాయి. ఉదాహ‌ర‌ణ‌కు రెండు వార్షిక ప్రీమియంలు చెల్లించినట్లయితే, ఒక్కొక్కటి రూ. 100, చెల్లించార‌నుకుందాం. పాల‌సీని స‌రెండ‌ర్ చేసేట‌పుడు 30% ప్రీమియంలను లేదా రూ. 60 తిరిగి అందుతుంది. మూడో ప్రీమియం నుంచి 35% తిరిగి చెల్లించాలని ముసాయిదా ప్రతిపాదించింది. అంటే మూడు ప్రీమియంలు చెల్లించిన తరువాత (మూడవ సంవత్సరంలో) పాల‌సీ స‌రెండ‌ర్ చేస్తే, కనీస హామీ సరెండర్ విలువ మొత్తం పాల‌సీ ప్రీమియంలో 35% అందుతుంది. 4-7 సంవత్సరాల మధ్య పాల‌సీ స‌రెండ‌ర్ చేస్తే కనీస హామీ సరెండర్ విలువ 50% ఉంటుంది. ఏడవ సంవత్సరం తరువాత, నియమాలు ఒకే విధంగా ఉంటాయి-బీమా సంస్థ‌లు సరెండర్ విలువలను పరిష్కరిస్తారు. కొత్త నిబంధనలు సరెండర్ విలువలు సున్నితమైన పురోగతిని అనుస‌రించి పాలసీ మెచ్యూరిటీకి చేరుకున్నప్పుడు కనీసం 90% ప్రీమియం అందుతుంది.

మ‌ధ్య‌లో పాల‌సీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకునే పాలసీదారుల అవ‌కాశం ఇవ్వడానికి, హామీ ఇచ్చిన సరెండర్ విలువ కనీస హామీ సరెండర్ విలువతో పాటు వచ్చే బోనస్‌ల విలువలో కనీసం 30% ఇస్తుందని ముసాయిదా సూచించింది. అయితే అంతిమ నియమాలు హామీ స‌రెండ‌ర్ విలువ బోనస్ లేదా ప్రయోజనాలను కలిగి ఉంటుందని పేర్కొంది.

జీవిత బీమా కంపెనీలు అందించే పెన్షన్ పథకాల సంబంధ‌మైన మార్పు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం మెచ్యూరిటీ స‌మ‌యంలో కార్పస్‌లో 60% వరకు తీసుకోవ‌చ్చు. ఇది ప్ర‌స్తుం 33.33% ఉంది. కనీసం 40% కార్పస్‌ను యాన్యుటైజ్ చేయవచ్చు. ఉపసంహరణపై కొత్త నిబంధనలు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పిఎస్) తో సమానంగా పెన్షన్ ప్రణాళికలను తయారు చేస్తాయి.

పాలసీదారులకు ఏ బీమా సంస్థ నుంచి అయినా పెన్షన్ చెల్లించే యాన్యుటీ స్కీమును కొనుగోలు చేయడానికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడమే లక్ష్యంగా ఉండగా, తుది నియ‌మాల్లో కొంత మేర‌కు మార్పు చేసింది. ప్ర‌స్తుతం పెన్షన్ ప్లాన్‌ను కొనుగోలు చేసిన బీమా సంస్థ ద్వారా మెచ్యూరిటీ కార్పస్‌ను యాన్యుటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. కొత్త నిబంధనలు 50% వరకు కార్పస్‌ను పెన్ష‌న్ ప్లాన్ కొనుగోలు చేసిన బీమా సంస్థ నుంచి యాన్యుటైజ్ చేయవలసి ఉంటుంది. దీంతో ఒక‌వైపు పాల‌సీదార్ల‌కు మార్కెట్లో యాన్యుటీ స్కీములు కొనుగోలు చేసేందుకు, మ‌రోవైపు బీమా సంస్థలను వారి యాన్యుటీ పోర్ట్‌ఫోలియోలను అభివృద్ధి చేయమని ప్రోత్సహించాలనే ఆలోచన ఉంది. కొత్త నిబంధ‌న‌ల్లో మార్పులు పాల‌సీదార్ల‌కు కొంత మేర‌కు లాభం చేకూరుస్తాయి. కానీ ఇప్ప‌టికీ స‌రెండ‌ర్ ఛార్జీల భారం అధికంగానే ఉంది. యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల మాదిరిగా సరెండర్ ఖర్చులను తగ్గిస్తే పాల‌సీదార్ల‌కు మ‌రింత ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly