అతి తక్కువ ధరకే జియో గిగా ఫైబర్ కనెక్షన్?

అలాగే ఈ సేవలను పొందడం కోసం సెక్యూరిటీ డిపాజిట్‌ కింద చెల్లించే మొత్తాన్ని కూడా జియో తగ్గించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి

అతి తక్కువ ధరకే జియో గిగా ఫైబర్ కనెక్షన్?

టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిన రిలయన్స్‌ జియో, అతి త్వరలో బ్రాడ్‌బ్యాండ్‌ రంగంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. గిగా ఫైబర్‌ పేరుతో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను ప్రారంభించనున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు. ప్రస్తుతం బీటా దశలో ఉన్న ఈ సేవలు అతి త్వరలో దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గిగా ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు కేవలం రూ. 600కే అందుబాటులోకి వస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ సేవలను పొందడం కోసం సెక్యూరిటీ డిపాజిట్‌ కింద చెల్లించే మొత్తాన్ని కూడా జియో తగ్గించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో సెక్యూరిటీ డిపాజిట్‌ కింద రూ. 4,500 చెల్లించాల్సి ఉంటుందనే వార్త ప్రచారంలో ఉండేది. అయితే ప్రస్తుతం ఈ కనెక్షన్‌ ను తీసుకున్న వారు గతం కంటే రూ. 2000 తక్కువగా అంటే రూ. 2,500 కే కనెక్షన్‌ ను తీసుకున్నట్లు వారు తెలిపారు. ప్రస్తుతం వీరికి ప్రివ్యూ ఆఫర్‌ కింద ఉచితంగానే సేవలను జియో అందిస్తుంది. అలాగే తాజాగా అందిస్తున్న గిగా ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌లో సంస్థ కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో రెండు రకాల కనెక్షన్స్ అందుబాటులో ఉండనున్నాయి. మొదటిది రూ. 2500 కనెక్షన్‌… దీనికి సింగిల్‌ బ్యాండ్‌ రూటర్‌ ను అందిస్తారు. రెండవది రూ. 4,500 కనెక్షన్… దీనిలో డ్యూయల్‌ బ్యాండ్‌ రూటర్‌ ను అందిస్తున్నారు. ఇది 2.4GHz, 5GHz బ్యాండ్‌ విడ్త్‌ను సపోర్టు చేస్తుంది. రూ. 4,500 కనెక్షన్‌తో పోలిస్తే, రూ. 2500 కనెక్షన్‌లో వేగం తక్కువగా ఉంటుంది. రూ. 4,500 ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్‌ వేగం అందిస్తుంటే… రూ. 2500 ప్లాన్‌లో కేవలం 50 ఎంబీపీఎస్‌ వేగం మాత్రమే లబిస్తుంది. అయితే రూ. 2500 ప్లాన్‌లో వాయిస్‌ సేవలు కూడా అందుతాయి. దీని ద్వారా ఇతరులకు కాల్స్‌ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు జియో టీవీ యాప్‌ను కూడా అందిస్తున్నారు. అయితే, కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌కు సంబంధించి జియో నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల కాలేదు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly