కియా నుంచి మొట్టమొదటి ఎస్‌యూవీ..

ఎస్‌యూవీ కార్లను ఇష్టపడే వారికి ఇది ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు

కియా నుంచి మొట్టమొదటి ఎస్‌యూవీ..

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా తొలిసారి ‘సెల్టోస్‌’ పేరుతో ఒక ఎస్‌యూవీని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. సెల్టోస్‌ చూడడానికి చాలా ఆకర్షణీయంగా, చాలా దృడంగా కనిపిస్తుంది. ఎస్‌యూవీ కార్లను ఇష్టపడే వారికి ఇది ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. ఈ కారు టెక్‌లైన్‌, జీటీ అనే రెండు వేరియంట్లలో లభించనుంది.

ఇక సెల్టోస్‌ ఎస్‌యూవీ ఫీచర్స్ ను ఒకసారి పరిశీలిస్తే… ఈ కారులో నేవిగేషన్‌తో కూడిన 10.25 ఇంచ్ టచ్‌ స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, బోస్‌ 8 స్పీకర్ లతో కూడిన సౌండ్ సిస్టమ్‌, ఎయిర్‌ ప్యూరి ఫైయర్‌, 360 డిగ్రీలను కవర్‌ చేసే కెమేరాను అమర్చారు. ఈ కారును నార్మల్‌, ఎకో, స్పోర్ట్స్‌ మోడ్‌లో నడపవచ్చు. అలాగే వీటితో పాటు సౌండ్‌ మూడ్‌ ల్యాంప్స్‌, రియర్‌ సన్‌షేడ్‌ కర్టెన్లు, యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటోలను కూడా సంస్థ అందిస్తుంది. ఈ కారు 1.4 లీటర్‌ టర్బో జీడీఐ పెట్రోల్‌ ఇంజిన్‌, 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ లతో లభించనుంది. దీనిలో 7 స్పీడ్‌ డ్యూయల్‌ క్లచ్‌ ట్రాన్స్‌మిషన్‌, 6 స్పీడ్‌ టార్క్‌ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌, సీవీటీ ఆటోమేటిక్‌, 6 స్పీడ్‌ మాన్యూవల్‌ ట్రాన్స్‌మిషన్‌ గేర్లు వంటి ఆప్షన్స్ తో అందుబాటులో ఉంటాయి.

దీంతో పాటు ఇందులో ఆరు ఎయిర్‌ బ్యాగ్స్‌, ఏబీఎస్‌ బ్రేకింగ్ సిస్టం, ఈబీడీ, ఈఎస్‌సీ, హెచ్‌ఏసీ, వీఎస్‌ఎం వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ కారు బాడీని అత్యంత శక్తివంతమైన ఏహెచ్‌ఎస్‌ఎస్‌ స్టీల్ తో తయారు చేసారు. దీని కారణంగా ప్రయాణ సమయంలో అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినట్లైయితే, అందులో ప్రయాణించే వారు సురక్షితంగా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కారు హుందయ్‌ క్రెటా, ఎంజీ హెక్టార్‌, టాటా హారియర్‌ కార్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం. ఇక ఈ కారు ధర విషయానికి వస్తే… కారు వేరియంట్ ఆధారంగా ధర రూ. 10 లక్షల నుంచి రూ. 17 లక్షల వరకు ఉంటుందని సంస్థ తెలిపింది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly