పోస్టాఫీసు ప‌థ‌కాల గురించి తెలుసుకోవాల్సిన విష‌యాలు..

ఈ ప‌థ‌కాల‌లో పొదుపు చేసినందుకు గానూ ఆదాయ ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 80సీ ప్రకారం ప‌న్ను మిన‌హాయింపు కూడా పొంద‌వ‌చ్చు

పోస్టాఫీసు ప‌థ‌కాల గురించి తెలుసుకోవాల్సిన విష‌యాలు..

చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల‌లో పోస్టాఫీసు పొదుపు ప‌థ‌కాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఇండియా పోస్ట్ లేదా పోస్ట‌ల్ మంత్రిత్వ శాఖ తొమ్మిది ర‌కాల పొదుపు ఖాతాల‌ను అందిస్తున్నాయి. అవి

 • పొదుపు ఖాతా
 • రిక‌రింగ్ డిపాజిట్ ఖాతా
 • టైమ్ డిపాజిట్ ఖాతా
 • నెల‌వారీ ఆదాయ ప‌థ‌కం ఖాతా
 • సీనియ‌ర్ సిటిజ‌న్ పొదుపు ప‌థ‌కం
 • భ‌విష్య నిధి ఖాతా(పీఎఫ్ అకౌంట్)
 • జాతీయ పొదుపు ప‌త్రాలు
 • కిసాన్ వికాస్ పత్రాలు
 • సుక‌న్యా స‌మృద్ధి ప‌థ‌కం

ఈ పథ‌కాల‌పై ఇచ్చే వ‌డ్డీ రేట్ల‌ను ప్ర‌తీ మూడు నెల‌ల‌కోసారి నిర్ణ‌యిస్తారు. అలాగే ఈ ప‌థ‌కాల‌లో పొదుపు చేసినందుకు గానూ ఆదాయ ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 80సీ ప్రకారం రూ. 1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు కూడా పొంద‌వ‌చ్చు.

పోస్టాఫీసు ప‌థ‌కాల గురించి త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన ఐదు విష‌యాలు:

 1. పోస్టాఫీసులో ఖాతా ఎలా తెర‌వాలి ? దానికి ఏమేం కావాలి ?

పొదుపు, రిక‌రింగ్ డిపాజిట్‌, టైమ్ డిపాజిట్‌, నెల‌వారీ ఆదాయ ప‌థ‌కం ప‌థ‌కంలో చేరాలంటే ఎస్‌బీ3, ఎస్‌బీ 103 ఫారాల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. అలాగే పొదుపు ఖాతా తెర‌వ‌డం కోసం అంత‌కుముందే ఖాతా క‌లిగిన వారి సంత‌కం అవ‌స‌రం. సీనియ‌ర్ సిటిజ‌న్ ప‌థ‌కాల కోసం ప్ర‌త్యేక‌మైన ఫారాలను ఉపయోగించాలి.

 1. ఖాతాలు, ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను బ‌దిలీ చేయ‌డ‌మెలా ?

ఖాతాల బ‌దిలీ కోసం, డిపాజిట‌ర్లు నిర్ధేశించ‌బ‌డిన ఫారం ఎస్‌బీ - 10 లో లేదా భౌతికంగా ధ‌ర‌ఖాస్తు చేయాలి. ఈ ధ‌ర‌ఖాస్తు ఫారంని ప్ర‌స్తుతం మీ ఖాతా ఉన్న కార్యాల‌యంలోగానీ, బ‌దిలీ చేయాల‌నుకుంటున్న కార్యాల‌యంలో గానీ ఇవ్వ‌వ‌చ్చు. అలాగే ధృవీక‌ర‌ణ ప‌త్రాల బ‌దిలీ కోసం ఫారం-NC32 లో ధ‌రఖాస్తు చేయాలి. దీనిని కూడా ప్ర‌స్తుతం మీ ఖాతా ఉన్న కార్యాల‌యంలోగానీ, బ‌దిలీ చేయాల‌నుకుంటున్న కార్యాల‌యంలో గానీ ఇవ్వ‌వ‌చ్చు.

 1. చెక్ బుక్‌ల జారీకి నిబంధ‌న‌లు:

చెక్‌బుక్‌లు జారీ చేయాలంటే ఖాతాలో క‌నీస న‌గ‌దు నిల్వ రూ. 500 ఉండాలి.

 1. నిశ్శ‌బ్ద ఖాతా అంటే ఏంటి, దాని పున‌రుద్ధ‌ర‌ణ ఎలా ?

పొదుపు ఖాతాలో గ‌త మూడు ఆర్థిక సంవ‌త్స‌రాలుగా ఎలాంటి లావాదేవీలు జ‌ర‌గ‌న‌ట్ల‌యితే దానిని నిశ్శ‌బ్ద ఖాతాగా ప‌రిగ‌ణిస్తారు. పున‌రుద్ధ‌ర‌ణ కోసం వినియోగ‌దారుడు ధ‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. నిశ్శబ్ధ ఖాతాలో క‌నీస న‌గదు నిల్వ కంటే త‌క్కువ‌గా ఉంటే, స‌ర్వీస్ ఛార్జీల పేరిట రూ.20 ని మిన‌హాయించుకుంటారు.

 1. డూప్లికేట్ పాస్ పుస్త‌కాలు పొంద‌డ‌మెలా ?

వీటిని స‌బ్ పోస్టాఫీసుల్లో మాత్ర‌మే జారీ చేస్తారు. కావాల‌నుకున్న వినియోగ‌దారుడు నిర్ధేశించిన న‌మూనాలో ధ‌ర‌ఖాస్తుని నింపి, అవ‌స‌ర‌మైన ఫీజును పోస్ట‌ల్ స్టాంప్ రూపంలో అతికించి పోస్టాఫీసులో అందివ్వాలి.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly