యూఏఎన్ ఖాతా సంఖ్య‌ తెలీకపోతే?

ఆన్‌లైన్‌లో యూనివ‌ర్స‌ల్ అకౌంట్ నెంబ‌రును(యూఏఎన్‌) ఎలా తెలుసుకోవాలో చూద్దాం

యూఏఎన్ ఖాతా సంఖ్య‌ తెలీకపోతే?

ఉద్యోగంలో చేరిన‌ప్పుడు పీఎఫ్ కోసం ప్ర‌తి ఒక్క‌రికీ యూనివ‌ర్స‌ల్ అకౌంట్ నంబ‌ర్ లేదా యూఏఎన్ పీఎఫ్ ఖాతా సంఖ్య‌ను కేటాయిస్తారు. ప్ర‌తీ ఉద్యోగికి వేర్వేరు సంఖ్య ఉంటుంది. యూఏఎన్ శాశ్వ‌త సంఖ్య‌. ఎన్ని ఉద్యోగాలు మారిన యూఏఎన్‌ అదే ఉంటుంది. ఉద్యోగం మారిన‌ప్పుడు కొత్త యాజ‌మానికి యూఏఎన్ తెలపాల్సి ఉంటుంది.

యూఏఎన్ ఎలా పొందాలి…

ప్ర‌తీ ఉద్యోగి సంస్థ యాజ‌మాని వ‌ద్ద యూఏఎన్ సంఖ్యను పొందాలి. ప్ర‌తి ఈపీఎఫ్ ఖాతాదారు యూఏఎన్ పొందేందుకు అర్హుడు. సొంతంగా కూడా యూఏఎన్ నంబ‌ర్ తెలుసుకోవ‌చ్చు. దానికోసం ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్క‌డ ‘important links’ సెక్ష‌న్‌లో 'know your UAN status 'ఆప్ష‌న్ ఎంచుకోవాలి. త‌ర్వాత మీ ప్ర‌స్తుత ఐడీ లేదా పీఎఫ్ ఖాతా నంబ‌ర్‌, పేరు ,పుట్టిన తేది, మొబైల్ నంబ‌ర్, ఇ-మెయిల్ వంటి వివరాలు ఎంట‌ర్ చేయాలి. మీ పీఎఫ్ ఐడీ, పే స్లిప్ మీద ప్రింట్ చేసి ఉంటుంది. ఈ వివ‌రాల‌న్నీ పూర్తి చేసిన త‌ర్వాత ఆథ‌రైజేష‌న్ పిన్ మొబైల్ నంబ‌రుకు వ‌స్తుంది మీరు న‌మోదు చేసిన మొబైల్ నంబ‌ర్‌కి ఆథ‌రైజేష‌న్ పిన్ వ‌స్తుంది. పిన్ ఎంట‌ర్ చేసిన త‌ర్వాత మొబైల్ నంబ‌ర్ , ఇ-మెయిల్‌కి యూఏఎన్ నంబ‌ర్ వ‌స్తుంది.

యూఏఎన్ సంఖ్య కేటాయింపు జ‌రిగాక యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు మొబైల్ నెంబ‌రు, యూఏఎన్, పీఎఫ్ ఖాతా సంఖ్య అవ‌స‌ర‌మ‌వుతుంది. చేసుకునేందుకు. ఆ త‌ర్వాత ఆథ‌రైజేష‌న్ పిన్ మొబైల్ నంబ‌రుకు వ‌స్తుంది. ఈ పిన్ నెంబ‌రును ఎంట‌ర్ చెయ్యాలి. లాగిన్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌ను జ‌న‌రేట్ చేసుకుని రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ పూర్తి చేయాలి.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly