మరో స్పోర్ట్స్ బైకును విడుదల చేసిన కేటీఎం...

కేటీఎం 125 డ్యూక్ బైకులో మాదిరిగా ఆర్‌సీ 125 బైకులో కూడా బాష్ సింగిల్ ఛానల్ ఏబీఎస్ ను అమర్చారు

మరో స్పోర్ట్స్ బైకును విడుదల చేసిన కేటీఎం...

చాలా రోజుల నిరీక్షణ తరువాత యూరోప్ కు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ కేటీఎం సరికొత్త స్పోర్ట్ బైకును భారత్ లో విడుదల చేసింది. దాని పేరు కేటీఎం ఆర్‌సీ 125. దీని ధరను రూ. 1.47 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా సంస్థ నిర్ణయించింది. కేటీఎం ఆర్‌సీ 16 బైక్ డిజైన్ ప్రేరణతో దీనిని డిజైన్ చేసినట్లు సంస్థ తెలిపింది. ఆర్‌సీ 125 అనేది స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్, డబ్ల్యుపీ రూపొందించిన అప్ సైడ్ డౌన్ ఫోర్కులు, ట్రిపుల్ క్లాంప్ హ్యాండిల్‌ బార్‌ను కలిగిన పరిపూర్ణమైన మోటార్ సైకిల్. ఇందులో 124 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను ఉపయోగించారు, ఇది 14.3 బీహెచ్పీ గరిష్ట శక్తిని, 12 ఎన్‌ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ ను అమర్చారు. బ్రేకింగ్ విషయానికి వస్తే… బైకు ముందు భాగంలో 300 ఎంఎం డిస్క్, వెనుక వైపు 230 ఎంఎం డిస్క్ ను అమర్చారు. కేటీఎం 125 డ్యూక్ బైకులో మాదిరిగా ఆర్‌సీ 125 బైకులో కూడా బాష్ సింగిల్ ఛానల్ ఏబీఎస్, రియర్ లిఫ్ట్ మిటిగేషన్ (ఆర్ఎల్ఎం) ను అమర్చారు.

కేటీఎం ఆర్‌సీ 16 బైకుకు సంబంధించిన ఇతర ఫీచర్స్ ను ఒకసారి పరిశీలిస్తే… ఇందులో డే టైం రన్నింగ్ లాంప్స్‌తో కూడిన ట్విన్ ప్రొజెక్టర్ హెడ్‌ ల్యాంప్‌లు, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నాయి. అలాగే ఇది 157 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉండడంతో పాటు బైకు మొత్తం బరువు 154.2 కిలోలుగా ఉంటుంది. అయితే కేటీఎం ఆర్‌సీ 125 బైక్ కేటీఎం 125 డ్యూక్ కంటే రూ. 17,000 ఎక్కువ ఖరీదు కాగా, ఆర్‌సీ 200 కంటే తక్కువ ధరకు లభిస్తుంది. ఈ బైకు యమహా ఆర్15 V3.0 కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం. బజాజ్ ఆటో లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ (ప్రో-బైకింగ్) సుమీత్ నారంగ్ మాట్లాడుతూ, "కేటీఎం మోటార్ సైకిళ్ళను మంచి పనితీరు, హ్యాండ్లింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్లు తెలిపారు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly