ఎల్‌జీ నుంచి ఒకేసారి మూడు స్మార్ట్ ఫోన్లు..

ఈ మూడు ఫోన్లలో 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అమర్చారు

ఎల్‌జీ నుంచి ఒకేసారి మూడు స్మార్ట్ ఫోన్లు..

దక్షిణ కొరియాకి చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ ఎల్‌జీ చాలా రోజుల తరువాత ఒకేసారి W10, W30, W30 Pro పేరిట మూడు స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. వీటిలో W10, W30 స్మార్ట్ ఫోన్లు 3 జీబీ+32 జీబీ వేరియంట్లు కాగా, W30 Pro మాత్రం 4 జీబీ+64 జీబీ వేరియంట్‌. W10, W30 మొబైళ్లు వాటర్‌ డ్రాప్‌ నాచ్‌ ను కలిగి ఉండగా, W10 మొబైల్‌ మాత్రం సాధారణ నాచ్‌ ను కలిగి ఉంది. ఈ మూడు ఫోన్లలో 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అమర్చారు. ఈ స్మార్ట్ ఫోన్ల ధరలను ఒకసారి పరిశీలిస్తే… W10 ఫోన్ ధరను రూ. 8,999గా సంస్థ నిర్ణయించగా, W30 ఫోన్ ధరను రూ. 9,999 గా నిర్ణయించింది. అయితే W30 Pro ధరను మాత్రం సంస్థ ఇంకా వెల్లడించలేదు. W10, W30 ఫోన్లు జులై 3న అమెజాన్‌.ఇన్‌లో సేల్ కు రానున్నాయి. ప్రారంభ ఆఫర్ లో భాగంగా రిలయన్స్ జియో వినియోగదారులు రూ.4,950 క్యాష్‌ బ్యాక్ ను పొందొచ్చు. వీటిలో రూ.1,750 వోచర్ల రూపంలో లభిస్తుండగా, మిగిలిన మొత్తాన్ని క్లియర్‌ ట్రిప్ వోచర్ల రూపంలో పొందొచ్చు. ఇక ఈ మూడు స్మార్ట్ ఫోన్ల ఫీచర్స్ ను ఒకసారి పరిశీలిస్తే…

W10 :

 • 6.19 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఫుల్‌విజన్‌ డిస్‌ప్లే
 • ఆండ్రాయిడ్‌ 9 ‘పై’ ఆపరేటింగ్ సిస్టం
 • ఆక్టాకోర్‌ మీడియా టెక్‌ హీలియో పీ22 ప్రాసెసర్‌
 • 3 జీబీ ర్యామ్‌ + 32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ
 • వెనకవైపు 13+5 ఎంపీ డ్యూయల్ కెమెరా సెట్ అప్
 • ముందు వైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
 • ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌
 • 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
 • తులిప్‌ పర్పుల్‌, స్మోకీ గ్రే రంగుల్లో లభించనుంది

W30 :

 • 6.26 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డాట్ ఫుల్‌విజన్‌ డిస్‌ప్లే
 • ఆండ్రాయిడ్‌ 9 ‘పై’ ఆపరేటింగ్ సిస్టం
 • ఆక్టాకోర్‌ మీడియా టెక్‌ హీలియో పీ22 ప్రాసెసర్‌
 • 3 జీబీ ర్యామ్‌ + 32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ
 • ముందు వైపు 13+12+2 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెట్ అప్
 • వెనకవైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
 • ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌
 • 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
 • థండర్‌ బ్లూ, ప్లాటినం గ్రే, అరోరా గ్రీన్‌ రంగుల్లో లభించనుంది

W30 Pro :

 • 6.21 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఫుల్‌విజన్‌ డిస్‌ప్లే
 • ఆండ్రాయిడ్‌ 9 ‘పై’ ఆపరేటింగ్ సిస్టం
 • ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్‌ 632 ప్రాసెసర్‌
 • 4 జీబీ ర్యామ్‌ + 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ
 • వెనకవైపు 13+5+8 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెట్ అప్
 • ముందువైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
 • ఫింగర్‌ ప్రింట్ స్కానర్‌
 • 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
 • ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్
 • పైన్‌ గ్రీన్‌, డెనిమ్‌ బ్లూ, బ్లాక్‌ రంగుల్లో లభించనుంది

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly