డిసెంబ‌ర్ 31 వ‌ర‌కే గ‌డువు

ఒక‌సారి పాన్-ఆధార్ అనుసంధానం చేస్తే.. పాన్ అవ‌స‌ర‌మైన చోట ఆధార్‌ను కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు

డిసెంబ‌ర్ 31 వ‌ర‌కే గ‌డువు

పాన్-ఆధార్ అనుసంధానానికి గ‌డువు ముగ‌స్తోంది. ఇంకా చేయ‌నివారు డిసెంబ‌ర్ 31 లోపు అనుసంధానం పూర్తి చేసుకోవాలి. ఇదివ‌ర‌కే ఆదాయ‌పుప‌న్ను శాఖ డిసెంబ‌రు 31 వ‌ర‌కు గ‌డువు పొడిగించింది. ప‌న్ను చెల్లింపుదారులంద‌రూ వారి పాన్‌, ఆధార్‌ల‌ను ఆన్‌లైన్ ద్వారా లేదా ఎస్ఎమ్ఎస్ ద్వారా ఈ నెల‌లోపుగా అనుసంధానించాలి. పాన్‌, ఆధార్‌ల గ‌డువు పొడిగించ‌డం ఇది ఏడ‌వసారి.

ఆధార్‌తో అనుసంధానించ‌ని పాన్ కార్డుల‌ను చెల్లుబాటులో లేని లేదా ఉప‌యోగంలోలేని కార్డులుగా కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల విభాగం(సీబీడీటీ) ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఆధార్‌తో అనుసంధానించ‌డంలో విఫలం అయితే వ్య‌క్తికి కేటాయించిన పాన్ నెంబ‌రు కూడా చెల్ల‌దు.

ఫైనాన్స్ బిల్లు ప్ర‌కారం ఆధార్‌తో అనుసంధానించ‌ని పాన్ కార్డులు మ‌నుగ‌డ‌లోనివిగా గుర్తించ‌బ‌డ‌తాయి. ఇటువంటి కార్డుల‌ను భ‌విష్య‌త్తులో పున‌రుద్ధ‌రించ‌కునేందుకు ఆదాయ‌పు ప‌న్ను శాఖ అనుమ‌తిస్తుంద‌న్న స్ప‌ష్ట‌త లేదు. అందువ‌ల్ల రిస్క్ తీసుకోకుండా గ‌డువు తేది లోపుగా అనుసంధానించ‌డం మంచింది.

పాన్‌, ఆధార్‌ల‌ను అనుసంధానించే విధానం:

  • ఆదాయపన్ను శాఖ ఈఫైలింగ్‌ పోర్టల్ లేదా ఎస్ఎమ్ఎస్‌ సాయంతో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. incometaxindiaefiling.gov.in వెబసైట్‌లో “Link Aadhaar” విభాగంలో ఇది లభిస్తుంది. పాన్‌, ఆధార్ నెంబ‌ర్లు, ఆధార్ కార్డు ప్ర‌కారం పేరు వంటి వివ‌రాల‌ను పొందుప‌ర‌చాల్పి ఉంటుంది. మీ మొబైల్‌కి ఓటీపీ వ‌స్తుంది. దీని ద్వారా అంథంటికేష‌న్ పూర్తి అవుతుంది.
  • ఇప్పటికే ఐటీశాఖ ఎస్‌ఎంఎస్‌ సౌకర్యాన్ని కూడా కల్పించింది. అవసరమైన వారు 567678 లేదా56161కు UIDPAN<12-digit Aadhaar><10-digit PAN>. అని మెసేజ్‌ చేయాలి.
  • పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించేందుకు ఈ రెండు ధృవ ప‌త్రాల‌లోనూ మీ పేరు, పుట్టిన తేదీ, జెండ‌ర్ వంటి వివ‌రాలు ఒకేలా ఉండాలి.
  • ఒక‌వేళ ఆధార్ డేటాలో ఉన్న పేరుకి మీ తెలియ‌జేసిన పేరుకి మ‌ధ్య చిన్న వ్య‌త్యాసం ఉన్నా ఆధార్ రిజిస్ట‌ర్ మొబైల్ నెంబ‌రుకు ఓటీపీ వ‌స్తుంది.
  • ఒకవేళ ఆధార్ కార్డులోని పేరికి, పాన్ నెంబ‌రులోని పేరు పూర్తిగా వేరుగా ఉంటే అనుసంధానం విఫ‌లం అవుతుంది. ఏ కార్డులో త‌ప్పుగా పేరు న‌మోదు అయ్యిందో… ఆ కార్డును స‌రిచేసుకుని అప్పుడు అనుసంధానించాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly