పీఎఫ్ ఖాతాను ఆధార్ తో లింక్ చేసుకోండిలా..

ముఖ్యంగా ఆధార్‌తో పీఎఫ్ ఖాతాను అనుసంధానించాలంటే, యూనిక్ అకౌంట్ నంబర్ (యూఏఎన్‌) ను అనుసంధానించాల్సి ఉంటుంది

పీఎఫ్ ఖాతాను ఆధార్ తో లింక్ చేసుకోండిలా..

మ‌న జీవితంలో ప్ర‌తీ ప‌నిలో ప్ర‌స్తుతం ఆధార్ ఎంతో కీల‌క పాత్ర పోషిస్తోంది. ఎందుకంటే వివిధ ప‌థ‌కాల‌తో ఆధార్ ను అనుసంధానించడం వలన అనేక ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగ భ‌విష్య నిధి నుంచి న‌గదును బ‌దిలీ లేదా ఉప‌సంహ‌రించుకుకోవాల‌నుకునే వారికి పీఎఫ్ ఖాతాతో ఆధార్ అనుసంధానం చేసుకోవడం ఏంతో అవసరం.

పీఎఫ్ ఖాతాతో ఆధార్ అనుసంధానం ఎలా? దాని వ‌లన క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఆధార్‌తో పీఎఫ్ ఖాతాను అనుసంధానించాలంటే, యూనిక్ అకౌంట్ నంబర్ (యూఏఎన్‌) ను అనుసంధానించాల్సి ఉంటుంది. మీరు యూఏఎన్ సంఖ్య‌ను క‌లిగి ఉన్న‌ట్ల‌యితే ఆధార్‌తో పీఎఫ్ అనుసంధానం ఈ కింద వివ‌రించిన విధంగా చేయండి.

  • ఉద్యోగ భ‌విష్య నిధి కి చెందిన యునిఫైడ్ పోర్ట‌ల్‌(https://unifiedportal.epfindia.gov.in/ ) లో లాగిన్ అవండి.
  • అందులో ఫ‌ర్ ఎంప్లాయిస్ పై క్లిక్ చేసి, మ‌ళ్లీ యూఏఎన్ మెంబ‌ర్ ఇ-సేవ పై క్లిక్ చేయండి. మీ యూఏఎన్ సంఖ్య‌, పాస్‌వ‌ర్డ్‌ల‌ను న‌మోదు చేసి పోర్ట‌ల్‌లోకి లాగిన్ అవండి.

  • పోర్ట‌ల్‌లోని పై భాగంలో గ‌ల మేనేజ్ పై క్లిక్ చేసి, అందులో మ‌ళ్లీ మీ వినియోగ‌దారుడి గురించి తెల‌సుకో(కేవైసీ) పై క్లిక్ చేయండి.

  • త‌దుప‌రి పేజీలోని యాడ్ కేవైసీలో మీ బ్యాంక్, పాన్‌కార్డ్‌, ఆధార్ వివ‌రాల‌ను నమోదు చేసి స‌బ్మిట్ నొక్కండి.

ఒక‌సారి స‌బ్మిట్ చేసిన‌ట్ల‌యితే మీ వివ‌రాలు పెండింగ్ కైవైసీలో ఉంటాయి. అలాగే ఒక‌వేళ ఆ వివ‌రాల‌ను మీ సంస్థ యాజమాన్యం ఆమోదిస్తే (ఇందుకు దాదాపు 15 రోజుల స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చు). ఆ వివరాలు అప్రూవుడ్ కేవైసీలో క‌నిపిస్తాయి.

పీఎఫ్ ఖాతాతో ఆధార్ అనుసంధానం వ‌ల్ల న‌గ‌దు బ‌దిలీ లేదా ఉప‌సంహ‌ర‌ణ వేగంగా జ‌రుగుతుంది. అయితే ఇందుకోసం మీ ప్ర‌స్తుత సంస్థ యాజ‌మాన్యం ఆధార్ తో స‌హా మీ కేవైసీ వివ‌రాల‌ను ప‌రిశీలించి, ఆమోదం తెలపాల్సి ఉంటుంది. తాజాగా ఉద్యోగ భ‌విష్య నిధి సంస్థ‌(ఈపీఎఫ్ఓ) పీఎఫ్ ఖాతాలోని న‌గదు ఉప‌సంహ‌ర‌ణ‌, బ‌దిలీ ప్ర‌క్రియ‌ల‌లో మార్పులు చేసింది.

న‌గ‌దు బ‌దిలీ ప్ర‌క్రియ :

ఉద్యోగి ఒక కంపెనీ నుంచి మ‌రో కంపెనీకి మారాల‌నుకున్న‌ప్పుడు అతడు కొత్త సంస్థ యాజ‌మాన్యానికి కాంపోజిట్ డిక్ల‌రేష‌న్ ఫారం(ఎఫ్‌-11)లో త‌న వివ‌రాలు అన్ని నింపి స‌బ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫారంలో ఉద్యోగి త‌న ప్రాథ‌మిక వివ‌రాలు, పాత యూఏఎన్ సంఖ్య‌, పీఎఫ్ సంఖ్య వివ‌రాలు ఇవ్వాల్సి ఉంటుంది.

ఫారం-11లో స‌మ‌ర్పించిన మీ వివ‌రాల‌ను సంస్థ యాజ‌మాన్యం ఎంప్లాయ‌ర్స్ పోర్ట‌ల్‌లో న‌మోదు చేసినప్పుడు, మీ ఆధార్‌తో యూఏఎన్ సంఖ్య, బ్యాంక్ వివ‌రాలు అప్ప‌టికే మీ పాత యాజమాన్యం చేత ప‌రిశీలించ‌బ‌డ్డ‌ట్ల‌యితే ఆటో ట్రాన్స్‌ఫ‌ర్ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వుతుంది. దీంతో మీ పాత పీఎఫ్ ఖాతాలోని న‌గ‌దు కొత్త ఖాతాలోకి బ‌దిలీ అవుతుంది. అయితే ఆధార్‌తో మీ పీఎఫ్ ఖాతా అనుసంధాన‌మైన త‌ర్వాతే ఈ బ‌దిలీ ప్ర‌క్రియ ఆటోమేటిక్‌గా జరుగుతుంద‌న్న విష‌యం గుర్తుంచుకోండి.

పీఎఫ్ న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ‌ :

ఉద్యోగి త‌న ఉద్యోగానికి రాజీనామా చేసినప్ప‌టి నుంచి రెండు నెల‌ల త‌ర్వాత పీఎఫ్ ఖాతాలోని న‌గ‌దును ఉపసంహ‌రించుకోవ‌చ్చు. దీనిని క్లెయిం చేసుకునేందుకు ఉద్యోగి కాంపోజిట్ క్లెయిం ఫారం నింపి వాటిపై సంస్థ యాజ‌మాన్యం సంత‌కాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే న‌గదు ఉప‌సంహ‌రణ త్వ‌ర‌గా జ‌ర‌గాలంటే ఉద్యోగి ఈపీఎఫ్ఓ నిర్దేశించిన కొన్ని నిబంధ‌న‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. అందులో ఆధార్‌తో పీఎఫ్ అనుసంధానం ముఖ్య‌మైన‌ది.

ఒక‌సారి పోర్ట‌ల్‌లో (https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/) లాగిన్ అయి న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ కోసం ద‌ర‌ఖాస్తు చేసిన‌ట్ల‌యితే, క్లెయిం ప‌రిష్కార ప్ర‌క్రియ పూర్తి కోసం, ఆధార్ డేటాబేస్‌లో నిక్షిప్త‌మైన రిజిస్ట‌ర్డ్ మొబైల్ నెంబ‌ర్‌కు వ‌న్ టైమ్ పాస్‌వ‌ర్డ్(ఓటీపీ) వ‌స్తుంది. దానిని న‌మోదు చేసి, కాంపోజిట్ క్లెయిం ఫారంను సబ్మిట్ చేసాక, న‌గ‌దు బ‌దిలీ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వుతుంది.

సిరి లో ఇంకా :

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly