ఎస్‌బీఐ రుణగ్రహీతలకు కొత్త రేటు విధానానాకి మారే అవకాశం

రుణగ్రహీతలకు గృహ రుణాలపై ప్రత్యేక ఆఫర్లను ఎస్‌బీఐ ప్రకటించింది

ఎస్‌బీఐ  రుణగ్రహీతలకు కొత్త రేటు విధానానాకి మారే అవకాశం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గృహ రుణగ్రహీతలకు రెపో రేటుతో అనుసంధానించిన‌ ప్రస్తుత వడ్డీ రేటుకు మారేందుకు అవ‌కాశాన్ని క‌ల్పించింది. ఇందుకోసం వన్‌టైమ్ స్విచ్‌ఓవర్ ఫీజుతో పాటు జీఎస్టీ చెల్లించాలి. ప్రస్తుత ఎస్‌బీఐ గృహ రుణ వడ్డీ రేట్లు ఎక్స్‌ట‌ర్న‌ల్ బెంచ్‌మార్క్ రేట్ (ఈబీఆర్) ఆధారంగా 7% నుంచి 7.35% పరిధిలో ఉన్నాయి, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) రెపో రేటుతో ముడిపడి ఉంది. రెపో రేటులో ఏదైనా మార్పు ఈబీఆర్‌ ని మారుస్తుంది. మహిళా రుణగ్రహీతలకు వడ్డీ రేట్లపై ఎస్‌బీఐ 0.05% ప్రత్యేక తగ్గింపును అందిస్తుంది. కరోనావైరస్ వ్యాప్తి నేప‌థ్యంలో ఆర్‌బీఐ రెపో రేటును 4 శాతానికి తగ్గించిన తరువాత గృహ రుణాలపై వడ్డీ రేట్లు బాగా పడిపోయాయి.

ఈబీఆర్‌ అనుసంధాన రుణాలు ఎలా పని చేస్తాయి?
బ్యాంకులు అందించే గృహ రుణాలపై వడ్డీ రేట్లు ఇప్పుడు ఎక్స్‌ట‌ర్న‌ల్ బెంచ్‌మార్క్‌తో అనుసంధానించబడ్డాయి. రిటైల్, ఎంఎస్‌ఎంఈ రుణాలపై వడ్డీ రేట్లను ఎక్స్‌ట‌ర్న‌ల్ బెంచ్‌మార్క్ రేటుతో అనుసంధానించాలని ఆర్‌బిఐ అన్ని వాణిజ్య బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులను కోరింది.

రుణగ్రహీతలకు గృహ రుణాలపై ప్రత్యేక ఆఫర్లను ఎస్‌బీఐ ప్రకటించింది. రుణాల కోసం దరఖాస్తు చేసుకునేవారికి మూడు ప్రయోజనాలు లభిస్తాయని ట్వీట్ ద్వారా ప్రకటించింది- ప్రాసెసింగ్ ఫీజు, 30 లక్షల కంటే ఎక్కువ‌, కోటి రూపాయ‌ల కంటే త‌క్కువ రుణాల‌పై ఎక్కువ సిబిల్ స్కోరు ఉన్న రుణగ్రహీతలకు 0.10% వడ్డీ రాయితీ, ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా దాఖ‌లు చేస్తే అదనంగా 0.5% రాయితీ ల‌భిస్తుంది.

రుణాల కోసం ఎంసిఎల్‌ఆర్ (రుణ రేటు ఉపాంత వ్యయం) రీసెట్ ఫ్రీక్వెన్సీని ఎస్‌బీఐ ఒక సంవత్సరం నుంచి ఆరు నెలలకు తగ్గించింది. ''ఒక సంవత్సరం వేచి ఉండకుండా వడ్డీ రేటు తగ్గింపు ప్రయోజనాలను ఆస్వాదించండి. ఎస్‌బీఐ ఎంసిఎల్ఆర్ రీసెట్ ఫ్రీక్వెన్సీని 1 సంవత్సరం నుంచి 6 నెలలకు తగ్గించింది" అని ఎస్బిఐ ట్వీట్ చేసింది.

ఎంసీఎల్ఆర్‌ అనుసంధాన రుణాలు ఎలా పని చేస్తాయి?
గృహ రుణం ఎంసీఎల్ఆర్ ఆధారిత వడ్డీ రేటుతో అనుసంధానిస్తే, అప్పుడు గృహ రుణం రీసెట్ తేదీన మాత్రమే ఈఎంఐ మొత్తం మారుతుంది. ఉదాహరణకు, మీ గృహ రుణ‌ రీసెట్ తేదీ ఆగస్ట్‌, ఫిబ్రవరిలో బ్యాంక్ దాని ఎంసీఎల్ఆర్‌ ని సవరించినట్లయితే, అది మీకు ఆగ‌స్ట్ నుంచి మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. ప్రస్తుతం, ఎస్‌బీఐ ఒక సంవత్సరం ఎంసిఎల్ఆర్ 7 శాతం, ఆరు నెలల ఎంసిఎల్ఆర్ 6.95 శాతం వద్ద ఉంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly