సంక్షిప్త వార్తలు:

 • లాభాల‌తో ముగిసిన మార్కెట్లు; సెన్సెక్స్ @ 34,109, నిఫ్టీ @ 10,061
 • భార‌త్ 'అథ‌మ' రేటింగ్‌కు ప‌డిపోద‌ని పేర్కొన్న బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఓఎఫ్ఓ)
 • గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం మార్చి త్రైమాసికంలో రూ.870 కోట్ల నిక‌ర న‌ష్టాన్ని న‌మోదు చేసిన ఇండిగో
 • ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ 10 శాతం క్షీణించ‌వ‌చ్చ‌ని పేర్కొన ఆర్థిక శాఖ మాజీ కార్య‌ద‌ర్శి సుభాష్ చంద్ర గార్గ్‌
 • ఎల‌క్ర్టానిక్స్ త‌యారీ కోసం రూ.50,000 కోట్ల విలువైన మూడు ప్రోత్స‌హ‌క ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించిన కేంద్రం
 • పొదుపు ఖాతాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించిన ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ
 • భార‌త సార్వ‌భౌమ రేటింగ్‌ను 'బీఏఏ3' కి త‌గ్గించిన మూడీస్ రేటింగ్స్‌
 • గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం నాలుగో త్రైమాసికంలో రూ.600 కోట్ల నిక‌ర లాభాన్ని ప్ర‌క‌టించిన గ్రాన్యూల్స్ ఇండియా
 • నేడు డాల‌ర్‌తో రూ.75.46 వ‌ద్ద కొన‌సాగుతోన్న రూపాయి మార‌కం విలువ‌
 • ఈ రోజు హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.73.97, డీజిల్ ధ‌ర రూ.67.82

రుణ సంబంధ స‌మ‌స్య‌లు - ప‌రిష్కార మార్గాలు

చ‌దువు, పెళ్లి, ఇంటి నిర్మాణం, వాహ‌న కొనుగోలు, వ్య‌క్తిగ‌తం ఇలా…అవ‌స‌ర‌మేదైనా రుణాలు తీసుకోవ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైన విష‌యం. బ‌య‌ట వ‌డ్డీ వ్యాపారుల క‌న్నా బ్యాంకులు అందించే రుణాలు తీసుకోవ‌డం సౌల‌భ్యంగా ఉంటుంది. త‌క్కువ వ‌డ్డీరేట్లు, సుల‌భ చెల్లింపు విధానం, వాయిదా చెల్లించే గ‌డువు అనుకూలంగా ఉండ‌టం లాంటి అంశాలన్నీ బ్యాంకుల ద్వారా రుణాలు పొందేలా ప్ర‌జ‌ల‌ను పురిగొల్పుతున్నాయి. రుణ మంజూరులో, చెల్లింపులో, తిర‌స్క‌ర‌ణ‌కు గురైన సంద‌ర్భాల్లో ఏర్ప‌డే ఇబ్బందులను సంయ‌మ‌నంతో ప‌రిష్క‌రించుకోవ‌డం కూడా తెలిసుండాలి.

బ్యాంకు రుణాల‌కు సంబంధించిన సాధార‌ణ స‌మ‌స్య‌లు

 • స‌రైన కార‌ణం తెల‌ప‌కుండా రుణ ద‌రఖాస్తును తిర‌స్క‌రించ‌డం
 • రిజ‌ర్వు బ్యాంకు ఆదేశాల మేర‌కు వ‌డ్డీ రేట్ల‌లో మార్ప‌లను అన్వ‌యించ‌క‌పోవ‌డం
 • రుణ‌గ్ర‌హీత‌కు ముంద‌స్తు స‌మాచారం లేకుండా వ‌డ్డీలు, రుసుముల‌ను పెంచుకుపోవ‌డం
 • రుణ మంజూరును స‌కాలంలో చేయ‌క‌పోవ‌డం
 • రుణం మంజూర‌య్యాక న‌గ‌దును స‌కాలంలో ఇవ్వ‌క‌పోవ‌డం
 • వినియోగ‌దారుల సేవా కేంద్రాన్ని సంప్ర‌దించిన‌ప్పుడు స‌రైన స్పంద‌న కొర‌వ‌డ‌డం.

బ్యాంకింగ్ సేవ‌ల్లో భాగ‌మైన రుణ స‌మ‌స్య‌లను వివిధ అంచెల్లో ఫిర్యాదు చేసే అవ‌కాశం ఉంది. ఒక అంచెలో స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భించ‌న‌ప్పుడు ఉన్న‌త స్థాయికి తీసుకెళ్లే సౌల‌భ్యాలు బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లో ఏర్ప‌రిచారు.

రుణ స‌మ‌స్య‌లు ఫిర్యాదు చేసే స్థాయులు

20001c91-303b-5145-9e3e-6473a4ede2f1.png
 • ఫిర్యాదులు రాత‌పూర్వ‌కంగా, మెయిల్ ద్వారా, ఆర్‌బీఐ వెబ్‌సైట్, క‌స్ట‌మ‌ర్ కేర్ లాంటి వివిధ మాధ్య‌మాల‌ను ఉప‌యోగించి చేయ‌వ‌చ్చు.
 • ప్ర‌తి ఫిర్యాదు నిర్ణీత గ‌డువులోపు ప‌రిష్కార‌మ‌వ్వాలి. అలా జ‌ర‌గ‌ని ప‌క్షంలో పై స్థాయికి దాన్ని తీసుకెళ్ల‌గలిగే వెసులుబాట్లు అనేకం ఉన్నాయి.

ఫిర్యాదు చేసేందుకు క‌నీస వివ‌రాలు

 • రుణగ్ర‌హీత పేరు, చిరునామా, ఫోన్ నెంబ‌రు
 • అంత‌కుముందు బ్యాంకున‌కు ఫిర్యాదు చేసిన‌ట్ట‌యితే సంబంధిత ఆధారాలు
 • స‌మ‌స్య ఉత్ప‌న్న‌మైన తేదీ, స‌మ‌యం, కార‌ణాలు
 • కింది స్థాయిలో ఫిర్యాదు స్థితిగ‌తి, స‌మ‌స్య ప‌రిష్కారంపై అసంతృప్తికి కార‌ణాలు.

అంబుడ్స్‌మ‌న్‌

రుణానికి సంబంధించిన స‌మ‌స్య‌లు బ్యాంకు ఉన్న‌త‌స్థాయి దాకా తీసుకెళ్లి, ప‌రిష్కారం దొర‌క‌న‌ప్పుడు మాత్ర‌మే చిట్ట‌చివ‌ర‌గా అంబుడ్స్‌మ‌న్‌ను సంప్ర‌దించాలి.
రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన అంబుడ్స్‌మ‌న్ చిరునామా
The Ombudsman
C/o Reserve Bank of India
6-1-56, Secretariat Road
Saifabad, Hyderabad-500 004
STD Code: 040
Tel. No. 23210013/23243970
Fax No. 23210014
Email : bohyderabad@rbi.org.in

గృహ రుణం

బ్యాంక్ వడ్డీ
ఐసీఐసీఐ 8.40% - 8.95%
అలహాబాద్ బ్యాంకు 8.25% - 8.80%
ఆంధ్ర బ్యాంకు 8.45% - 8.60%
యాక్సిస్ బ్యాంకు 8.35% - 8.75%
బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.50% - 8.40%

వ్యక్తిగత రుణం

బ్యాంక్ వడ్డీ

వాహన రుణం

బ్యాంక్ వడ్డీ

విద్యా రుణం

బ్యాంక్ వడ్డీ

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

ఓ అంచనాకు రండి

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

ఒక కంపెనీ షేరు ధ‌ర‌ను ప్ర‌భావితం చేసే అంశం ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%