దీర్ఘ‌కాలానికి ఆర్థిక భ‌ద్ర‌త క‌లిగించే పెట్టుబ‌డి ప‌థ‌కాలు

ప్ర‌భుత్వం అందించే ఈపీఎఫ్ తో పాటు దీర్ఘ‌కాలానికి ఉప‌యోగ‌ప‌డే కొన్ని ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి.

దీర్ఘ‌కాలానికి ఆర్థిక భ‌ద్ర‌త క‌లిగించే  పెట్టుబ‌డి ప‌థ‌కాలు

దీర్ఘ‌కాలంలో మ‌దుప‌ర్లు త‌మ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఆర్థిక ప్ర‌ణాళిక‌లు వేసుకోవాలి. వీటిలో ప్ర‌భుత్వ అందించే ప‌థ‌కాల్లో న‌ష్ట‌భ‌యం త‌క్కువ‌గా ఉండి, పెట్టుబ‌డి భ‌ద్ర‌త ఎక్కువ‌గా ఉంటుంది. అలాంటి ప‌థ‌కాల గురించి తెలుసుకుందాం.

ఉద్యోగుల ఫించ‌ను ఫండ్ (ఈపీఎఫ్): ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ప‌దవీ విరమణ అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన‌వి. అయితే ఎవ‌రైనా త‌మ అవ‌స‌రాల‌కు డ‌బ్బు తీసుకునేందుకు ఉద్యోగం చేసే సమయంలో కూడా ఈపీఎఫ్ఓ అనుమ‌తి ఉంటుంది. ఉద్యోగుల ఫించ‌ను ఫండ్ నిర్వ‌హ‌ణ‌ సంస్థ (ఈపీఎఫ్ఓ) ఈ చ‌ట్టానికి లోబ‌డి ఉంటుంది. సంస్థ‌లు చెల్లించే మొత్తం అంతా ఈపీఎఫ్‌లో 8.33 శాతం ఎంప్లాయి పెన్ష‌న్ స్కీమ్ (ఈపీఎస్) కి జ‌మ‌వుతుంది. 3 .67% ఈపీఎఫ్ లోకి జ‌మ‌ అవుతుంది. ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యంలో ఉద్యోగి, సంస్థ‌ చెల్లించిన మొత్తం వ‌డ్డీతో పాటు అందుతుంది. ఈ మొత్తం ఉద్యోగుల‌కు ప‌ద‌వీవిర‌మ‌ణ అనంతర జీవ‌నానికి ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. ప‌న్ను ప‌రంగా చూస్తే వీటిపై వ‌చ్చే ఆదాయానికి ఆదాయ‌ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80 సీ కింద ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది.

జాతీయ పొదుపు ప‌త్రాలు (ఎన్ఎస్‌సీ): జాతీయ పొదుపు పత్రాలు పదవీ విరమణ తర్వాత ఆదాయ మార్గంలా ఉపయోగపడతాయి. క్రమంగా వీటిలో పెట్టుబడి పెడితే అవి వృద్ధి చెంది వడ్డీతో సహా పదవీ విరమణ కాలంలో ఆదాయం వస్తుంది.

చిన్న మొత్తాల్లో పొదుపు చేయాలనుకునేవారి కోసం భారత ప్రభుత్వం పోస్టాఫీసుల ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించారు. కచ్చితమైన రాబడి ఆశించేవారికి సురక్షితమైన పెట్టుబడి మార్గం ఇది. ఐదేళ్ల మెచ్యూరిటీ పీరియడ్‌తో జాతీయ పొదుపు ప‌త్రాల పథకం అందుబాటులో ఉంది. వీటిలో చేసే మ‌దుపుకు గ‌రిష్ట ప‌రిమితి లేదు.వీటి కాల‌ప‌రిమితి 5ఏళ్లు ఉంటుంది. ఐదేళ్ల జాతీయ పొదుపు ప‌త్రాల ప్రస్తుత వడ్డీ రేటును 7.8 శాతం ఉంటుంది. ఆరు నెలల చక్రవడ్డీ వ‌ర్తింప‌జేసి పెట్టుబ‌డికి జ‌మ‌చేస్తారు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం రూ.1.5లక్ష‌ల వరకు చేసే డిపాజిట్లకు సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. వడ్డీపై మూలం వ‌ద్ద ప‌న్ను చెల్లించ‌న‌వ‌స‌రం లేదు.

ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్( పీపీఎఫ్‌): ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ప‌దవీ విరమణ తరువాత‌ అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన‌వి. ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో క‌నీసం చేయాల్సిన పెట్టుబ‌డి రూ.500. ఒక‌ ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ.1,50,000 వరకూ పెట్టుబడి పెట్టవచ్చు. వీటి కాలపరిమితి 15 ఏళ్లు. ఆ త‌ర్వాత కొన‌సాగించాలంటే ఖాతాను అయిదేళ్ల చొప్పున పొడిగించుకోవచ్చు.పీపీఎఫ్‌ పై ప్రస్తుత వార్షిక వడ్డీ 7.60 శాతం. చక్రవడ్డీ జ‌మ‌చేసి ఖాతాలో చేరుస్తారు. ప‌న్ను చట్టం సెక్షన్‌ 80సీ ప్రకారం రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కూ పన్ను మినహాయింపు ఉంటుంది. వడ్డీపై పన్ను వర్తించదు. మెచ్యూరిటీ సొమ్ముపైనా పన్ను విధించరు

సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్‌ (ఎస్‌సీఎస్ఎస్‌): కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసుల ద్వారా పెద్దల (సీనియర్‌ సిటిజన్స్‌) కోసం ప్రత్యేకమైన పథకాన్ని రూపొందించింది. పదవీ విరమణ చేసినవారికి ఈ పథకం ఎంతో అనుకూలమైంది. పదవీ విరమణ తర్వాత వచ్చే ఆర్థిక అవసరాలను ఈ పథకం తీరుస్తుంది. 60 ఏళ్లు పైబడిన భారతీయులు ఈ పథకానికి అర్హులు. స్వచ్ఛంద పదవీ విరమణ చేసినవారైతే 55 ఏళ్లకే ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు అర్హులు. క‌నీసం రూ.1000 పెట్టుబడితో ఖాతాను ప్రారంభించాల్సి ఉంటుంది. గరిష్ఠంగా రూ.15 లక్షల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు. కాల‌ప‌రిమితి చూస్తే ఈ ప‌థ‌కాన్ని 5 ఏళ్లు కొన‌సాగించాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత కావాల‌నుకుంటే మ‌రో 3 ఏళ్లు పొడిగించుకునే వీలుంది. ఒకరి పేరుపై ఎన్ని ఖాతాలైనా ప్రారంభించవచ్చు. అయితే అన్ని ఖాతాల మొత్తం సొమ్ము రూ.15 లక్షలకు మించరాదు. అయిదేళ్ల కాలపరిమితి ముగిసేవరకూ ఎలాంటి నగదు ఉపసంహరణలకు అనుమతించరు. వార్షిక వడ్డీ విలువ రూ.10 వేలు దాటితే టీడీఎస్‌ విధిస్తారు. ఏడాదికి రూ.1.5ల‌క్ష‌ల వరకూ పెట్టే పెట్టుబడికి ఐటీ చట్టం సెక్షన్‌ 80సీ ప్రకారం పన్ను మినహాయింపు ఉంటుంది.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి [ట్విట్ట‌ర్](https://twitte

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly