మ‌హీంద్ర మ్యూచువ‌ల్ ఫండ్ బాద‌త్ యోజ‌న

మ‌హీంద్ర మ్యూచువ‌ల్ ఫండ్ ఏప్రిల్ 20,2017 తేదీ నుంచి మ‌హీంద్ర మ్యూచువ‌ల్ ఫండ్ బాద‌త్ యోజ‌న ప్రారంభం.

మ‌హీంద్ర మ్యూచువ‌ల్ ఫండ్ బాద‌త్ యోజ‌న

మ‌హీంద్ర మ్యూచువ‌ల్ ఫండ్ ఏప్రిల్ 20,2017 తేదీ నుంచి మ‌హీంద్ర మ్యూచువ‌ల్ ఫండ్ బాద‌త్ యోజ‌న అనే కొత్త ఫండ్ ను ప్రారంభించ‌నుంది. ఫండ్ ఆఫ‌ర్ డాక్యుమెంటులో ఇచ్చిన వివ‌రాల ప్ర‌కారం ఈక్విటీ సంబంధిత పెట్టుబ‌డుల్లో మ‌దుపుచేస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఈ ఫండ్ వివ‌రాలు చూస్తే
mhby.png

ఫండ్ గురించి క్లుప్తంగా

  • మ‌హీంద్ర మ్యూచువ‌ల్ ఫండ్ బాద‌త్ యోజ‌న ఈక్విటీ సంబంధిత పెట్టుబ‌డి సాధ‌నాల్లో మ‌దుపుచేస్తుంది.

  • ఇది ఈక్విటీ వ‌ర్గానికి చెందిన ఒపెన్ ఎండెడ్ ప‌థ‌కం.మ‌ధ్య‌స్థ నుంచి దీర్ఘ‌కాల మ‌దుప‌ర్ల‌కు అనుకూలం. ఈక్విటీలో 75శాతం, డెట్ , మ‌నీ మార్కెట్ సాధానాల్లో 0-25 శాతం పెట్టుబ‌డులు చేస్తుంది.

  • న‌ష్ట‌భ‌యం ఒక మోస్త‌రు కంటే ఎక్కువ‌గానే ఉంటుంది. ఈక్విటీ పెట్టుబ‌డులు ఎక్కువ భాగం ఉండ‌టంతో న‌ష్ట‌భ‌యం కొంత అధికంగా ఉంటుంది.

  • నిష్టీ 200 సూచీని బెంచ్ మార్క్ గా తీసుకున్నారు.

  • ప్ర‌వేశ లోడ్ ఛార్జీలు లేవు. నిష్క్ర‌మ‌ణ లోడ్ 1శాతం ఒక ఏడాది లోపు పెట్టుబ‌డి ఉప‌సంహిరించుకుంటే ఏడాది పైబ‌డి మ‌దుపుచేసేవారికి నిష్క్ర‌మ‌ణ లోడ్ ఉండ‌దు.

  • ఈ ఫండ్లో డైరెక్టు ప్లాన్, రెగ్యూల‌ర్ ప్లాన్ , గ్రోత్ ,డివిడెండు ఆప్ష‌న్లు అందుబాటులో ఉంటాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly