మార్కెట్లు ఎందుకు పడుతున్నాయి? ఇప్పుడు ఏం చేయాలి?

మార్కెట్లు ప‌డిపోవ‌డానికి ఈ సారి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది.

మార్కెట్లు ఎందుకు పడుతున్నాయి? ఇప్పుడు ఏం చేయాలి?

గత కొన్ని రోజుల‌గా మార్కెట్లు నష్టాల్లో ఉన్నట్లు మనం రోజు వింటున్నాం. సాధారణంగా మార్కెట్లు పడిపోవటానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే ఈసారి ప్రత్యేక కారణం ఎఫ్ పీ ఐ ( ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్) తమ వాటాను విక్రయించడం. అందుకు కారణం ఈసారి బడ్జెట్లో ప్రవేశపెట్టిన అంశం. అదే సర్చార్జీలో పెరుగుదల. ఇంతకూ మునుపు రూ. కోటి పైన ఆదాయం ఉన్నవారికి 15 శాతం సర్చార్జీ ఉండేది. ఈ బడ్జెట్ ప్రకారం రూ . 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఉన్న ఆదాయం పై 25 శాతం, అలాగే రూ . 5 కోట్ల ఆదాయం పైన ఉన్న వారికి 37 శాతం సర్చార్జీ విధించారు. దీనివలన ఎఫ్ పీ ఐ లు ఈ కేటగిరీ లోకి వస్తారు కాబట్టి , అధిక పన్నుల వలన తమ పెట్టుబడులను వెనక్కు తీసుకోవడం జరిగింది. తత్ఫలితంగా మార్కెట్లో షేర్ల విలువ పడిపోవడం, అలాగే మ్యూచువల్ ఫండ్ల నెట్ అసెట్ వేల్యూ తగ్గాయి. దీని వలన ఎఫ్ పీ ఐ లు జూలై నెలలో సుమారుగా రూ. 13,500 కోట్లను మార్కెట్ నుండి వెనక్కి తీసుకున్నారు. దీనికితోడు ఆటో రంగంలో మందగమనం, ప్రపంచ ఆర్ధిక మాంద్యం , అమెరికా చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం వంటివి కూడా మార్కెట్ నుండి వెనక్కు తీసుకొనేందుకు దోహదం చేసాయి.

ఎన్ ఏ వీ ని ఉపయోగించి రాబడి ని లెక్కించడం ఎలాగో తెలుసుకుందాం.
fund returns.jpg

ఉదా : ఆదిత్య బిర్లా ఎస్ ఎల్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్ ను తీసుకుందాం. ఆగష్టు8, 2019 న దీని ఎన్ ఏ వీ రూ 213.31 గా ఉంది. అదే ఆగష్టు8, 2016 న రూ 182.74 గా ఉంది. సి ఏ జి ఆర్(CAGR) పద్ధతి ద్వారా దీనిపై 3 సంవత్సరాలకు రాబడి సంవత్సరానికి 5.29 శాతంగా ఉంది. అదే ఆగష్టు8, 2014 న రూ 140 గా ఉంది. సి ఏ జి ఆర్(CAGR) పద్ధతి ద్వారా దీనిపై 5 సంవత్సరాలకు రాబడి సంవత్సరానికి 8.74 శాతంగా ఉంది. దీని యూనిట్ ఎన్ఏవీ 8, 2009 న రూ 67 గా ఉంది.
సి ఏ జి ఆర్(CAGR) పద్ధతి ద్వారా దీనిపై 10 సంవత్సరాలకు రాబడి సంవత్సరానికి 12.26 శాతంగా ఉంది.

డిసెంబరు31, 2018 న దీని ఎన్ ఏ వీ రూ 216.24 గా ఉంది.
అదే డిసెంబరు31, 2015 న రూ 158.77 గా ఉంది.
సి ఏ జి ఆర్(CAGR) పద్ధతి ద్వారా దీనిపై 3 సంవత్సరాలకు రాబడి సంవత్సరానికి 10.84 శాతంగా ఉంది.
డిసెంబరు31, 2013 న రూ 108.51 గా ఉంది.
సి ఏ జి ఆర్(CAGR) పద్ధతి ద్వారా దీనిపై 5 సంవత్సరాలకు రాబడి సంవత్సరానికి 14.78 శాతంగా ఉంది.
డిసెంబరు31 2008 న రూ 41.89 గా ఉంది.
సి ఏ జి ఆర్(CAGR) పద్ధతి ద్వారా దీనిపై 10 సంవత్సరాలకు రాబడి సంవత్సరానికి 17.83 శాతంగా ఉంది.
అంటే డిసెంబర్ 2018 లో 3 సం, 5 సం, 10 సం, లకు వచ్చిన రాబడుల కంటే ఆగష్టు 2019 రాబడులు తగ్గాయి.

మనం చేసిన పెట్టుబడికి ఆరోజు ఉన్న ఎన్ఏవీ ఆధారంగా యూనిట్లు కేటాయిస్తారు. అంటే ఎన్ఏవీ తగ్గితే ఎక్కువ యూనిట్స్ వస్తాయి. ఎన్ఏవీ పెరిగితే తక్కువ యూనిట్స్ వస్తాయి. ఈ కింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు. మార్కెట్లు పడ్డప్పుడు ఎక్కువ మొత్తంలో మదుపు చేయడం ద్వారా అధిక యూనిట్లు పొందవచ్చు. భవిష్యత్తులో మార్కెట్లు పెరిగినప్పుడు అధిక సంపద చేకూర్చుకోవచ్చు.

Units.jpg

మార్కెట్లు పడిపోవడం వలన 3 సం, 5 సం, 10 సం రాబడులపై ఎటువంటి ప్రభావం చూపిందో కింది పట్టికలు ద్వారా తెలుసుకుందాం. దీనికోసం 8 ఆగష్టు 2019 నాటి రాబడులను 1వ తేదీ జనవరి 2019 నాటి రాబడితో పోల్చి చూడడం ద్వారా తెలుసుకోవచ్చు.

  1. లార్జ్ కాప్ ఫండ్లు
Large.jpg
  1. లార్జ్ & మిడ్ కాప్ ఫండ్లు
Large&Mid.jpg
  1. మిడ్ కాప్ ఫండ్లు
Midcap.jpg
  1. స్మాల్ కాప్ ఫండ్లు
Smallcap.jpg
  1. మల్టీ కాప్ ఫండ్లు,
Multicap.jpg
  1. ఈ ఎల్ ఎస్ ఎస్ ఫండ్లు
    ELSS.jpg

ముగింపు:

స్వల్ప కాలంలో ఈక్విటీ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతాయి. కానీ దీర్ఘకాలంలో మంచి రాబడిని అందిస్తాయి. ఇది ఒక ప్రత్యేక అంశం కారణంగా మార్కెట్లు పడ్డాయి. ప్రభుత్వం ఈ సమస్య కు పరిష్కారం చూపితే మార్కెట్లు మళ్ళీ పుంజుకుంటాయి. మదుపరులు ఈ సమయంలో మదుపు చేయటం ద్వారా దీర్ఘకాలంలో లాభపడవచ్చు. ఎటువంటి పరిస్థితులలోను , మదుపరులు నిరాశకు గురికాకుండా, పెట్టుబడులను ఆపరాదు. ఒక విషయం గమనించినట్లైతే లార్జ్ క్యాప్ ఫండ్ల కంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్లు అధిక దిద్దుబాట్లకు లోనౌతాయి . అట్లాగే, దీర్ఘకాలంలో లార్జ్ క్యాప్ ఫండ్ల కంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్లు అధిక రాబడులను ఇచ్చే అవకాశం ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly