52 వారాల గ‌రిష్టాల‌కు చేరిన బ్యాంకింగ్ షేర్లు

మొత్తం 2,286 స్క్రిప్ లు ఉండ‌గా, వాటిలో 1,718 పురోగతి, 440 త‌గ్గుద‌ల, 129 మాత్రం ఎటువంటి మార్పు చెంద‌లేదు

52 వారాల గ‌రిష్టాల‌కు చేరిన బ్యాంకింగ్ షేర్లు

నేడు బెంచ్మార్క్ సూచీలు గ‌రిష్టానికి చేర‌డంతో చాలా కంపెనీల షేర్ల ధ‌ర‌లు 52 వారాల గ‌రిష్టానికి చేరుకున్నాయి. అయితే దాదాపు 120 కంపెనీల షేర్ల‌ల ధ‌ర‌లు 52 వారాల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. మరో వైపు, బయోకాన్, జూబిలంట్, జెపి ఇన్ఫ్రా టెక్, మోన్శాంటో, విబి ఇండస్ట్రీస్ వంటి షేర్లు 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి.

మొత్తం 2,286 స్క్రిప్ లు ఉండ‌గా, వాటిలో 1,718 పురోగతి, 440 త‌గ్గుద‌ల, 129 మాత్రం ఎటువంటి మార్పు చెంద‌లేదు.బీఎస్ఈ స‌మాచారం ప్రకారం 115 సెక్యూరిటీలు ఎగువ సర్క్యూట్ పరిమితిని చేరాయి. 119 దిగువ సర్క్యూట్ను తాకాయి.

సెన్సెక్స్ 39068.32 వద్ద 1,127 పాయింట్ల (2.97 శాతం ) పెరిగే స‌మ‌యానికి ఎస్‌బీఐ, యస్ బ్యాంక్, లార్సెన్ అండ్ టుబ్రో, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్ లాభ‌ప‌డ్డాయి. బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్లు న‌ష్ట‌పోయాయి.

నిఫ్టీ 11746.90 వద్ద 339.75 పాయింట్లు (2.98) శాతంకు పెరిగే స‌మ‌యానికి ఎన్ఎస్ఈలో, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్, యస్ బ్యాంక్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అత్యధికంగా లాభపడ్డాయి. రెడ్డీస్, జీ ఎంటర్టైన్మెంట్, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ నష్టపోయాయి. ప్ర‌స్తుతం బీఎస్ఈ 1468.98 పాయింట్లు (3.87%) లాభ‌ప‌డి 39399.75 కు చేరింది. నిఫ్టీ 432.4 పాయింట్లు (3.79%) లాభ‌ప‌డి 11839.55 కు చేరింది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly