మార్కెట్స్‌ పడినప్పుడు ఎందులో మదుపు చేయాలి?

ప్రధానంగా మ్యూచువల్ ఫండ్స్, యూలిప్స్ లో రాబడి ఎలా ఉందొ చూద్దాం

మార్కెట్స్‌ పడినప్పుడు ఎందులో మదుపు చేయాలి?

స్టాక్ మర్కెట్స్ పడుతున్నప్పుడు ఎన్నో అవకాశాలు కల్పిస్తుంది. మదుపరులకు అధిక రాబడి పొందే వీలుంది. అలాగే, నష్టాలూ రావచ్చు. ఇలాంటి సమయం అసలు ఎక్కడ మదుపు చేయాలి అనే ప్రశ్న అందరికీ వస్తుంది. ఇప్పుడు మనం ప్రధానంగా మ్యూచువల్ ఫండ్స్, యూలిప్స్ లో రాబడి ఎలా ఉందొ చూద్దాం.

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో అధిక రాబడి పొందే అవకాశం ఉంటుందని నిపుణులు చెపుతూ ఉంటారు. ఈ తేదీ నాటికి గత 10 ఏళ్ళ లార్జ్ కాప్ ఫండ్స్ సగటు రాబడి చూసినట్టైతే సుమారుగా 7.50 శాతం గా ఉంది. అదే మిడ్ కాప్ ఫండ్స్ రాబడి సుమారుగా 10 శాతం వరకు ఉంది. గత కొద్ది రోజులుగా మార్కెట్ పతనం అవ్వడం తో రాబడి పై ప్రభావం చూపింది.

యూలిప్ లో కూడా బీమా హామీ తో పాటు మార్కెట్ లో పెట్టుబడులు ఉంటాయి. వీటి రాబడి ఎలా ఉందొ చూద్దాం. ఇందులో సగటు లార్జ్ కాప్ ఫండ్స్ రాబడి సుమారుగా 6.3 శాతం, మిడ్ కాప్ ఫండ్స్ రాబడి 7.30 శాతం వరకు ఉంది. పైగా, వీటికి 5 ఏళ్ళ లాక్ ఇన్ కూడా ఉంటుంది. ఇలాంటి పాలసీలకి దూరంగా ఉండడం మంచిది. వీటిలో అధిక చార్జీలు ఉంటాయి కాబట్టి రాబడి తగ్గుతుంది.

మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం. అయితే, మిడ్ కాప్ ఫండ్స్ లో అధిక రాబడి వస్తుందని ఆశ పది అధిక రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. ఇందులో నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే. ఒక ఇండెక్స్ ఫండ్ తో మొదలు పెట్టడం మంచిది. సిప్ తో పాటు అప్పుడప్పుడు ఒకే మొత్తం లో లంప్సమ్ పెట్టుబడులు కూడా చేయడం మంచిది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly