రెండు ఈపీఎఫ్ ఖాతాలను ఒక ఈపీఎఫ్ ఖాతాలోకి విలీనం చేయండిలా..

యూఏఎన్ నంబరును ఉపయోగించి ఉద్యోగి ఒక పీఎఫ్ ఖాతా నుంచి వేరొక పీఎఫ్ ఖాతాకు త్వరగా, సులువుగా బదిలీ చేసుకోవచ్చు

రెండు ఈపీఎఫ్ ఖాతాలను ఒక ఈపీఎఫ్ ఖాతాలోకి విలీనం చేయండిలా..

ప్రస్తుత రోజుల్లో చాలా మంది నిపుణులు మంచి జీతాలు, మంచి అవకాశాల పేరుతో తరచుగా ఉద్యోగాలు మారుతూ ఉన్నారు. ఏమైనప్పటికీ, ఉద్యోగికి చెందిన పాత, కొత్త పీఎఫ్ ఖాతాలన విలీనం చేయడంతో పాటు మార్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) ను ప్రవేశపెట్టింది, ఇది ఈపీఎఫ్ ఖాతాదారులకు అందించే 12 అంకెల ఖాతా సంఖ్య.

యూఏఎన్ తో ఒక ఈపీఎఫ్ ఖాతాలోకి రెండు ఈపీఎఫ్ ఖాతాలను విలీనం చేయడం ఎలా?

ఈ యూఏఎన్ నంబర్ మీకు చెందిన అన్ని పీఎఫ్ ఖాతాలను ఒకే ఖాతాలోకి అనుసంధానించడానికి అనుమతిస్తుంది, తద్వారా ఇది సులభతరం అవుతుంది. యూఏఎన్ నంబరును ఉపయోగించి ఉద్యోగి ఒక పీఎఫ్ ఖాతా నుంచి వేరొక పీఎఫ్ ఖాతాకు త్వరగా, సులువుగా బదిలీ చేసుకోవచ్చు. అలాగే యూఏఎన్ నెంబర్ వలన కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మీ ఆధార్ నంబర్ ను యూఏఎన్ కు అనుసంధానించవచ్చు, దీని ద్వారా పీఎఫ్ నిధుల బదిలీ లేదా ఉపసంహరణ కోసం మీరు ఎలాంటి పత్రాలపై సంతకం చేయాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. ఒకవేళ మీరు రెండు పీపీఎఫ్ ఖాతాలను కలిగి ఉంటే, వాటిని ఒక ఖాతాలో విలీనం చేయండి.

రెండు ఈపీఎఫ్ ఖాతాలను ఒకటిగా విలీనం చేసే విధానం

 1. ఖాతాదారుడు పాన్, బ్యాంక్ ఖాతా మొదలైన వాటిని ద్రువీకరించి కేవైసీని పూర్తి చేయాలి.

 2. యూఏఎన్ ను కలిగి ఉండి, అది మీ ప్రస్తుత ఈపీఎఫ్ ఖాతాకు లింక్ చేసి ఉండాలి.

 3. ఈపీఎఫ్ ఖాతాలను విలీనం చేయడానికి ముందు యూఏఎన్ ను ఆక్టివేట్ చేసిన తర్వాత మూడు రోజులు వేచి ఉండాలి.

ఆన్లైన్ ద్వారా యూఏఎన్ ను ఉపయోగించి రెండు ఈపీఎఫ్ ఖాతాలను ఒక ఈపీఎఫ్ ఖాతాలో విలీనం చేసే విధానం:

 1. EPFO ​​వెబ్ సైట్ ను సందర్శించండి.

 2. అనంతరం SERVICES పై క్లిక్ చేయండి. అందులో EMPLOYEE పై క్లిక్ చేయండి.

 3. One Employee - One EPF Account లింకును క్లిక్ చేయండి.

 4. One EPF account link ను ఎంచుకున్న తర్వాత, స్క్రీన్ పై మనకు ఒక విండో వస్తుంది. యూఏఎన్, ఫోన్ నంబర్, మొదలైన వివరాలను ఉద్యోగి పూరించాల్సి ఉంటుంది.

 5. వివరాలను నమోదు చేసిన తర్వాత Generate OTP అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి, అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది.

 6. ఓటీపీని నమోదు చేసి verify OTP పై క్లిక్ చేయండి.

 7. అనంతరం మీరు చేరదలుచుకున్న మునుపటి ఈపీఎఫ్ ఖాతాల వివరాలను నమోదు చేయగల మరొక విండోకు వెళతారు.

 8. డిక్లరేషన్ పై మార్క్ చేసి “submit” పై క్లిక్ చేయండి.

రెండు ఈపీఎఫ్ ఖాతాలను విలీనం చేయడం సులభం. అలాగే మీరు ఒకే ఏకీకృత ఖాతాను కలిగి ఉన్నారని ఇది నిర్ధారిస్తుంది. ఎప్పుడైతే మీరు ఉద్యోగ భవిష్య నిధిని ఉపసంహరించుకోవాలని అనుకుంటారో అప్పుడు మీకు పెద్ద మొత్తంలో డబ్బును పొందడం సులభతరం చేస్తుంది. ఆధార్ చట్టం, 2016 (మార్చి 26, 2016) అమలుతో, ప్రాధమిక గుర్తింపుగా ఆధార్ ను సమర్పించాల్సిందిగా ఈపీఎఫ్ఓ కోరుతుంది. యూఏఎన్ కు ఆధార్ నెంబర్ ను లింక్ చేయడం ద్వారా సులభంగా ఉద్యోగులు క్లెయిమ్ లను పొందవచ్చు.

యూఏఎన్ ద్వారా ఆధార్ కార్డ్ సంఖ్య ఎలా ప్రయోజనాలను అందిస్తుంది?

రెండు ఈపీఎఫ్ ఖాతాలను ఒక ఈపీఎఫ్ ఖాతాలోకి విలీనం చేయాల్సిన అవసరం ఎందుకో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. రెండు ఖాతాలను ఒక ఖాతాలోకి విలీనం చేస్తున్నప్పుడు, మీ ఆధార్ కార్డును లింక్ చేయవలసి ఉంటుందని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం ద్వారా బకాయిల చెల్లింపు సులభం అవడంతో పాటు మరింత పారదర్శకంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఇప్పటికీ ఆధార్ కార్డును సమర్పించకపోతే, వీలైనంత త్వరగా సమర్పించడం మంచిది.

ఆన్లైన్ ద్వారా బదిలీ ప్రక్రియ పారదర్శకంగా, సమర్థవంతమైనదిగా, సౌకర్యవంతమైనదిగా ఉంటుంది కావున వ్యక్తులు ఆన్లైన్ ద్వారా ఈపీఎఫ్ ఖాతాను బదిలీ చేసుకోవచ్చు. ఖాతాదారుడు తన ప్రస్తుత యజమాని లేదా మునుపటి యజమాని ద్వారా క్లెయిమ్ ను సమర్పించే ఆప్షన్ ను కలిగి ఉంటాడు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly