ఎంజీ హెక్టార్ ధర, ఫీచర్స్....

ఇది స్టైల్, సూపర్, స్మార్ట్, షార్ప్ అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది

ఎంజీ హెక్టార్ ధర, ఫీచర్స్....

బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇటీవల సరికొత్త హెక్టర్ ఎస్‌యూవీని భారత దేశ మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. మనం మునుపెన్నడూ చూడనటువంటి, లేనటువంటి సరికొత్త ఫీచర్స్ ను సంస్థ ఈ కారులో అందుబాటులోకి తెచ్చింది. ఈ కారు ధర రూ. 12.18 లక్షల (ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభం అవుతుంది. ఇది స్టైల్, సూపర్, స్మార్ట్, షార్ప్ అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. ఈ నాలుగు వేరియంట్లలో మొత్తం 11 కాన్ఫిగరేషన్లలో కారు లభిస్తుంది. ఇది మహీంద్రా ఎక్స్‌యూవీ 500, టాటా హారియర్, జీప్ కంపాస్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

భారతదేశంలో ఎంజీ హెక్టార్ ధరలను ఒకసారి పరిశీలిస్తే…

స్టైల్ :

పెట్రోల్ మ్యానువల్ ట్రాన్స్మిషన్ : రూ. 12,18,000

డీజిల్ మ్యానువల్ ట్రాన్స్మిషన్ : రూ. 13,18,000

సూపర్ :

పెట్రోల్ మ్యానువల్ ట్రాన్స్మిషన్ : రూ. 12,98,000

పెట్రోల్ హైబ్రిడ్ మ్యానువల్ ట్రాన్స్మిషన్ : రూ. 13,58,000

డీజిల్ మ్యానువల్ ట్రాన్స్మిషన్ : రూ. 14,18,000

స్మార్ట్ :

పెట్రోల్ హైబ్రిడ్ మ్యానువల్ ట్రాన్స్మిషన్ : రూ. 14,68,000

పెట్రోల్ డీసీటీ : రూ. 15,28,000

డీజిల్ మ్యానువల్ ట్రాన్స్మిషన్ : రూ. 15,48,000

షార్ప్ :

పెట్రోల్ హైబ్రిడ్ మ్యానువల్ ట్రాన్స్మిషన్ : రూ. 15,88,000

పెట్రోల్ డీసీటీ : రూ. 16,78,000

డీజిల్ మ్యానువల్ ట్రాన్స్మిషన్ : రూ. 16,88,000

CAR-2.jpg

ఎంజీ హెక్టార్ ఫీచర్స్ ను ఒకసారి పరిశీలిస్తే…

హెక్టర్ పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ ఆప్షన్స్ లో లభిస్తుంది. కారు ఇంజన్ విషయానికి వస్తే, ఇందులోని 1.5 లీటర్ టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 250 ఎన్ఎం గరిష్ట టార్క్ వద్ద 143 పీఎస్ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ 350 ఎన్ఎం గరిష్ట టార్క్ వద్ద 170 పీఎస్ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లలో లభిస్తుంది. 48వీ హైబ్రిడ్ ఆప్షన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌లో మాత్రమే లభిస్తుంది.

ఇందులో ఎంబెడెడ్ కనెక్టివిటీ సొల్యూషన్, మ్యాప్స్, నావిగేషన్ సర్వీసెస్, వాయిస్ అసిస్టెంట్, ప్రీ-లోడెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ కంటెంట్, ఎమర్జెన్సీ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, బిల్ట్ ఇన్ యాప్స్ ఉన్నాయి. అలాగే ఇది ఎంబెడెడ్ ఎం2ఎం సిమ్‌తో వస్తుంది. 7 ఇంచ్ కలర్డ్ ఎంఐడీ, 10.4 ఇంచ్ హెచ్డీ సెంట్రల్ టచ్‌స్క్రీన్ సిస్టమ్ ద్వారా వినియోగదారులు ఈ టెక్నాలజీతో సంభాషించవచ్చు. వాయిస్ అసిస్టెంట్ సర్వీస్ ను ఉపయోగించి కారు డోర్ గ్లాస్ లను తెరవడం లేదా మూయడం, సన్ రూఫ్ ను తెరవడం లేదా మూయడం చేయవచ్చు. అలాగే మొబైల్ ను కారుకు కనెక్ట్ చేసి వాయిస్ అసిస్టెంట్ సర్వీస్ ద్వారా కాల్స్ చేయడం కూడా చేయవచ్చు.

STEERING.jpg

ఇక ఈ కారులోని ఇతర ఫీచర్స్ ను పరిశీలిస్తే… ఇందులో 4 వే పవర్ ఎడ్జస్టబుల్ కో-డ్రైవర్ సీట్, సెకండ్ రో సీట్ రీక్లైన్, ఫెటీగ్ రిమైండర్ సెట్టింగ్, పవర్డ్ టెయిల్‌గేట్ ఓపెనింగ్, డ్యూయల్ పేన్ పానోరామిక్ సన్‌రూఫ్, ఎనిమిది రంగుల్లో యాంబియంట్ లైటింగ్ ఉన్నాయి.

పల్స్ హబ్ పేరుతో వినియోగదారుల సేవా కేంద్రాన్ని కంపెనీ ఏర్పాటు చేసింది. ఇది అన్ని ఎంజీ కార్లలో ఈకాల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ను అనుమతిస్తుంది. ఒకవేళ కారు ఏదైనా ప్రమాదానికి గురైతే, వెంటనే ఆటోమేటిక్ గా పల్స్ హబ్ కు సమాచారం అందుతుంది. ఈ సరికొత్త టెక్నాలజీని అందిస్తున్న మొట్టమొదటి సంస్థ ఎంజీ కావడం విశేషం. ఐదు సీట్ల సామర్ధ్యం కలిగిన ఈ కారు 587 లీటర్ బూట్ స్పేస్ తో లభిస్తుంది.

ఇక కారు ఎక్స్టీరియర్ విషయానికి వస్తే… ఈ ఎస్‌యూవీ ముందువైపు క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్ తో స్ప్లిట్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్స్‌ ను అమర్చారు. స్టార్రి బ్లాక్, కలర్డ్ గ్లేజ్ రెడ్, బర్గండ్రి రెడ్, అరోరా సిల్వర్, క్యాండీ వైట్ వంటి ఐదు రంగుల్లో హెక్టార్ అందుబాటులో ఉండనుంది.

CAR-1.jpg

ఎంజీ మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా మాట్లాడుతూ హెక్టర్ కారును “555 సర్వీస్ ప్లాన్” తో అందిస్తున్నట్లు తెలిపారు. “555 సర్వీస్ ప్లాన్” అనగా 5 సంవత్సరాల వారంటీ (అపరిమిత కిలోమీటర్లు), 5 సంవత్సరాల రోడ్ సైడ్ అసిస్టెన్స్ (అపరిమిత కిలోమీటర్లు), 5 లేబర్ ఫ్రీ సర్వీసులను అందిస్తున్నట్లు తెలిపారు. ఎంజీ మోటార్ గుజరాత్‌లోని హలోల్‌ ప్రాంతంలో రూ. 2,200 కోట్లతో ప్లాంట్ ను నిర్మించింది. అందులోనే హెక్టర్ కార్లను తయారు చేస్తున్నారు.

చివరగా:

ఈ కారు మధ్యతరగతి వారు కొనుగోలు చేయడం కొంచం కష్టంతో కూడుకున్న విషయం. అయినప్పటికీ, ఇందులో అందిస్తున్న ఫీచర్స్ కు ఈ ధర సమంజసమే అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. అధునాతన ఫీచర్స్ తో పాటు మంచి పెర్ఫార్మన్స్ కోరుకునే వారికి ఈ కారు సరైనదని చెప్పాలి.

(source - livemint)

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly