ఎంఐ 9టీ ఫోన్‌ ను లాంచ్ చేసిన షామీ..

ఇది రెడ్మీ కే20 స్మార్ట్ ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్ అని సంస్థ తెలిపింది

ఎంఐ 9టీ ఫోన్‌ ను లాంచ్ చేసిన షామీ..

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీ దిగ్గజం షామీ తాజాగా మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని పేరు ఎంఐ 9టీ. అయితే, సంస్థ ప్రస్తుతం దీనిని యూరోపియన్ మార్కెట్‌లో విడుదల చేసింది. అతి త్వరలో మన దేశ మార్కెట్ లో కూడా దీనిని విడుదల చేయనున్నట్లు షామీ ఇండియా హెడ్ మనూ జైన్ తెలిపారు. ఇది రెడ్మీ కే20 స్మార్ట్ ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్ అని సంస్థ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ కార్బన్ బ్లాక్, రెడ్ ఫ్లేమ్, గ్లాసియర్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉండనుంది. ఇక దీని ధర విషయానికి వస్తే… ఇది రూ. 25,800 నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

షామీ ఎంఐ 9టీ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్స్ ను ఒకసారి పరిశీలిస్తే…

 • 6.39 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఆమ్‌లెడ్ డిస్‌ప్లే
 • 1080 x 2340 రిసల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5
 • ఆన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
 • క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 730 ప్రాసెసర్
 • 6 జీబీ ర్యామ్, 64 జీబీ/128 జీబీ ఇంటర్నల్ మెమరీ
 • వెనుకవైపు (48 ఎంపీ+8 ఎంపీ+13 ఎంపీ) ట్రిపుల్ కెమెరా సెట్ అప్
 • ముందు వైపు 20 మెగా పిక్సెల్ పాపప్ సెల్ఫీ కెమెరా
 • ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్‌
 • 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
 • 2.0 టైపు-సీ పోర్ట్
 • 18 డబ్ల్యూ ఫాస్ట్ బ్యాటరీ ఛార్జింగ్

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly