రెండు రోజుల్లో ఎంఐ ఫ్యాన్‌ ఫెస్టివల్‌ 2019 సేల్..

సేల్ లో భాగంగా, స్మార్ట్ ఫోన్ లతో పాటు అనేక రకాల వస్తువులపై డిస్కౌంట్ల‌ను అందించనుంది

రెండు రోజుల్లో ఎంఐ ఫ్యాన్‌ ఫెస్టివల్‌ 2019 సేల్..

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ షియామీ సరికొత్త సేల్ తో వినియోగదారుల ముందుకు రానుంది. ‘ఎంఐ ఫ్యాన్‌ ఫెస్టివల్‌ 2019’ పేరుతో ఏప్రిల్‌ 4 నుంచి ఏప్రిల్‌ 6 వరకూ షియామీ ఈ సేల్ ను నిర్వహించనుంది. సేల్ లో భాగంగా, స్మార్ట్ ఫోన్ లతో పాటు అనేక రకాల వస్తువులపై డికౌంట్లను అందించనుంది. ఎంఐ.కామ్‌, ఎంఐ హోమ్‌, ఎంఐ స్టోర్లు, అధీకృత ఆఫ్‌లైన్‌ స్టోర్లలో సేల్ అందుబాటులో ఉండనుంది. దీనితో పాటు ‘ఫన్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ పేరుతో ఆన్‌లైన్‌ గేమ్‌లను కూడా షియామీ నిర్వహించనుంది. ఈ గేమ్ లో పాల్గొని రెడ్మీ నోట్‌ 7, ఎంఐ స్పోర్ట్స్‌ బ్లూటూత్‌ ఇయర్‌ ఫోన్స్‌ను గెలుచుకోవచ్చు. అలాగే రెడ్మీ నోట్‌ 7ప్రో, పోకో ఎఫ్‌1, ఎంఐ సౌండ్‌బార్‌, ఎంఐ ఎల్‌ఈడీ టీవీ 4 ప్రో వంటి ఉత్పతులను కేవలం రూ.1 కే ఫ్లాష్‌ సేల్‌ లో సొంతం చేసుకునే అవకాశాన్ని సంస్థ కల్పించింది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుతో ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లయితే, అదనంగా 5 శాతం (గరిష్టంగా రూ. 500) డిస్కౌంట్ ను పొందవచ్చు, ఈఎంఐ లావాదేవీలపై కూడా ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. అలాగే మొబిక్విక్‌ వ్యాలెట్‌ ద్వారా కొనుగోలు చేసినట్లయితే, ఇన్‌స్టా సూపర్‌ క్యాష్‌ రూపంలో 15 శాతం డిస్కౌంట్ ని పొందవచ్చు.

రెడ్మీ నోట్ 7, నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ లు సేల్ జరిగే అన్ని రోజులు అందుబాటులో ఉండనున్నాయి. వాటితో పాటు…
రెడ్మీ 6 (3జీబీ+32జీబీ) - రూ. 6,999
రెడ్మీ వై2 (3జీబీ+32జీబీ) - రూ.7,999
రెడ్మీ వై2 (4జీబీ+64జీబీ) - రూ. 9,999
రెడ్మీ 6 ప్రో (3జీబీ+32జీబీ) - రూ.7,999
రెడ్మీ 6 ప్రో (4జీబీ+64జీబీ) - రూ. 9,999
రెడ్మీ నోట్‌ 5 ప్రో (4జీబీ+64జీబీ) - రూ.10,999

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly