ఈక్వీటీ ఫండ్ల‌లోనూ రిస్క్‌ను త‌గ్గించుకోండి..

ఈక్విటీ ఫండ్లలో న‌ష్ట‌భ‌యం ఎక్కువ‌గా ఉంటుంది. అయితే న‌ష్ట‌భ‌యం ఫండ్ ను బ‌ట్టి మారుతుంటుంది.

ఈక్వీటీ ఫండ్ల‌లోనూ రిస్క్‌ను త‌గ్గించుకోండి..

ఈక్వీటీ ఫండ్లన్నింటిలో రిస్క్ ఒకే విధంగా ఉండ‌దు. కొన్ని ఈక్విటీ పండ్ల‌లో రిస్క్ త‌క్కువ‌గాను, మ‌రికొన్నింటిలో ఎక్కువ‌గానూ ఉంటుంది. యాక్టివ్ ఫండ్లలో న‌ష్ట‌భ‌యం ప్యాసివ్ ఫండ్ల కంటే ఎక్కువ‌గా ఉంటుంది.

యాక్టివ్, ప్యాసివ్ ఫండ్లు:

యాక్టివ్ ఫండ్ల మేనేజ‌ర్లు స‌రైన స‌మ‌యంలోమంచి షేర్ల‌ను ఎంపిక చేస్తార‌ని న‌మ్ముతాం. కాని కొన్ని సంద‌ర్భాల‌లో వారి అంచానాలు త‌ప్పు కావ‌చ్చు. మంచి ప‌థ‌కాలుగా కొన‌సాగుతున్న‌వి కూడా ఫండ్ మేనేజ‌ర్ల నిర్ణ‌యాల త‌ప్ప‌డం వ‌ల్ల రాబ‌డిలో హెచ్చ‌త‌గ్గులు ఉండొచ్చు.

ప్యాసివ్ ఫండ్ల విష‌యం చూస్తే ఈక్వీటీ ఫండ్ల‌లో ఇండెక్స్ ఫండ్లు, ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్‌) త‌క్కువ రిస్క్ ఉండే ఫండ్లు. ఫండ్ మేనేజ‌ర్లు సంబంధిత సూచీలో ఉన్న విధంగానే మదుపు చేయడం వ‌ల్ల అవి బెంచ్‌మార్క్ సూచినీ ప్ర‌తిబింబిస్తాయి. చాలా వ‌ర‌కూ మ్యూచువ‌ల్ ఫండ్లు పెద్ద సంస్థ‌ల‌లో ఎక్కువ మొత్తంలో పెట్ట‌బ‌డులు పెట్ట‌డం వ‌ల్ల‌ త‌క్కువ న‌ష్ట‌భ‌యం క‌లిగి ఉంటాయి. మార్కెట్ క్యాపిలైజేష‌న్ లో తొలి 100 సంస్థ‌ల‌ను లార్జ్ క్యాప్ కంపెనీలుగా ప‌రిగ‌ణిస్తారు. ఎక్కువ‌గా వీటి ప‌నితీరును విశ్లేషిస్తుంటారు. సాధారంగా ఇవి మార్కెట్ సూచీల‌కు అనుగుణంగా క‌ద‌లిక‌ల‌ను క‌లిగి ఉంటాయి. స్మాల్ మిడ్ క్యాప్ ఫండ్ల‌లో న‌ష్ట‌భ‌యం కొంత అధికంగా ఉంటుంది.

మార్కెట్ అనుకూలంగా ఉన్న‌పుడు లాభాలు అధిక‌మే, ప్ర‌తికూలంగా ఉన్న‌పుడు న‌ష్టాలు అధికంగానే ఉంటాయి. ఈ సంవ‌త్స‌రంలో లార్జ్‌ క్యాప్ ఫండ్లు 14 శాతం ప‌త‌న‌మ‌యితే స్మాల్‌, మిడ్ క్యాప్ ఫండ్లు 21 శాతం మేర ప‌త‌న‌మ‌య్యాయి. స్మాల్‌, మిడ్ క్యాప్ ఫండ్ల‌ను ఎక్కువ ఫండ్ మేనేజ‌ర్లు, విశ్లేష‌కులు ట్రేక్ చేయ‌రు. పెరుగుతున్న మార్కెట్ల‌తో పాటు అధిక రాబ‌డుల‌ను ఇస్తాయి. కానీ మార్కెట్ల ప‌త‌నం అయితే ప్ర‌మాద స్థాయి కూడా ఎక్కువ‌గానే ఉంటుంది.

థిమేటిక్, సెక్టార్ పండ్లు:

మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాల‌లో థిమేటిక్, సెక్టార్ ఫండ్లలో న‌ష్ట‌భ‌యం ఎక్కువ‌గానే ఉంటుంది. మౌళిక స‌దుపాయ‌ రంగాలు, బ్యాంకులు, ఆర్థిక సంబంధింత రంగాల్లో పెట్టుబ‌డి చేసే వాటిని సెక్టార్ ఫండ్లు అంటారు. సెక్టార్ ఫండ్ ఒక‌టి లేదా రెండు రంగాల‌లో మాత్ర‌మే పెట్టుబ‌డి పెడుతుంది. ఒక థీమ్ ఆధారంగా పెట్టుబ‌డి చేసే ఫండ్ల‌ను థిమాటిక్ ఫండ్లు అంటారు. సెక్టార్ ఫండ్లలోలా నిర్ధిష్ట రంగాల‌లోనే కాకుండా వివిధ రంగాల‌కు చెందిన కంపెనీల్లో మ‌దుపుచేసేందుకు వీలుంటుంది. ఎంచుకున్న రంగాలు,కంపెనీల షేర్లు బాగా రాణిస్తే సెక్టార్, థిమేటిక్ ఫండ్లు అధిక రాబ‌డి నిచ్చే అవ‌కాశం ఉంది. అయితే వీటిలో పెట్టుబడి చేసే వారు ఈ త‌ర‌హా ఫండ్ల‌లో ఎప్ప‌డు పెట్టుబ‌డి పెట్టాలి? ఎప్పుడు విర‌మించుకోవాలి అనే విష‌యాల‌పై అవ‌గాహ‌న ఉండాలి.

ప్రతి మ్యూచువల్ ఫండ్ ఫ‌థ‌కంలోనూ కొంత రిస్క్ ఉంటుంది. అధిక రాబ‌డులు పొందాల‌నుకునే వారు కొంచెం రిస్క్ తీసుకోక త‌ప్ప‌దు. అయితే ఈక్వీటీ ఫండ్ల‌లో మ‌దుపు చేస్తూ న‌ష్ట‌భ‌యాన్ని త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేయాలి. క‌నీసం 5 సంవ‌త్స‌రాలు లేదా అంత‌కంటే ఎక్కువ కాలం పెట్టుబ‌డి చేసే ఉద్దేశం ఉంటేనే వీటిలో మ‌దుపుచేయాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly