గృహిణుల‌ ఆర్ధిక‌ ప్ర‌ణాళిక‌కు 4 నియ‌మాలు

సంపాద‌న ఉన్న వారే ఆర్థిక ప్ర‌ణాళిక చేసుకోవాలి అని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి ఎటువంటి సంపాద‌న లేని గృహిణులకు ఆర్ధిక ప్ర‌ణాళిక అవ‌సరం.

గృహిణుల‌ ఆర్ధిక‌ ప్ర‌ణాళిక‌కు 4 నియ‌మాలు

స‌రిత త‌న కాలేజీలో జ‌రిగే పూర్వ విధ్యార్ధుల స‌మావేశానికి వెళ్ళింది. అక్క‌డ క‌లిసిన త‌న స్నేహితురాలు రాగిణి, ” మీ కుటుంబ ఆర్ధిక అవ‌స‌రాల‌కు నువ్వు ఎలా స‌హాయ‌ప‌డుతున్నావు“ ? అని స‌రిత‌ను ప్ర‌శ్నించింది. ఆ ప్ర‌శ్న విని స‌రిత ఆశ్య‌ర్య‌పోయి “ నేను ఒక‌ గృహిణి “. నేను ఎలా కుటుంబ‌ ఆర్ధిక అవ‌స‌రాల‌ను తీర్చ‌గ‌ల‌ను అని అడిగింది. చాలా మంది డ‌బ్చు సంపాదించిన‌ప్పుడు మాత్ర‌మే ఆర్ధిక ప్ర‌ణాళిక చేసుకుంటారు. కాని నువ్వు కూడా ఆర్ధిక ప్ర‌ణాళిక చేసుకోవ‌చ్చు అని రాగిణి చెప్పిన మాట‌ల‌ను స‌రిత న‌మ్మ‌లేదు. రాగిణి, స‌రిత‌కు 4 మార్గాల‌తో కూడిన ఆర్ధిక ప్ర‌ణాళిక‌ను గురించి వివ‌రించ‌గానే స‌రితకు న‌మ్మ‌కం కుదిరింది. త‌ను కూడా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. అందుకు గాను ఆమె ఏమి చేసిందో చూద్దాం.

  1. నెల‌వారి ఖ‌ర్చులు త‌గ్గింపు:

స‌రిత త‌న కుటుంబ బ‌డ్జెట్ గురించి ఎప్పుడు ఆలోచించ‌లేదు. అయితే ఇప్పుడు త‌ను వేసిన మొద‌టి అడుగు కుటుంబ బ‌డ్జెట్‌ను త‌యారు చేయ‌డం. నెల‌వారి బ‌డ్జెట్‌ను త‌యారు చేస్తున్న‌ప్పుడు ఆమె చేసే ఖ‌ర్చులు చాలా వ‌ర‌కు త‌గ్గించుకోవ‌చ్చు అని ఆమెకు అర్ధమ‌య్యింది.
ఉదాహ‌ర‌ణ‌కి స‌రిత నెల బ‌డ్జెట్ రూ. 50 వేలు అనుకుందాం. నెల‌కు 4 సార్లు రెస్టారెంట్ల‌కు వెళ్ళ‌డాన్ని 2 ప‌ర్యాయాల‌కు త‌గ్గించుకుంది. దీని ద్వారా నెల‌కు రూ.3000 వ‌ర‌కు పొదుపు చేయ‌వ‌చ్చు. హై స్కూల్లో చ‌దువుతున్న త‌న పిల్ల‌ల‌ను ఆటోలో కాకుండా బ‌స్ పాస్ తీసుకుని పంపించ‌డం ద్వారా మ‌రో రూ. 2000 సేవ్ అవుతున్నాయి. నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయ‌డం ద్వారా రూ. 3000 ఖ‌ర్చు త‌గ్గుంది. మొత్తంగా నెల‌కు రూ.8000 వ‌ర‌కు పొదుపు చేయ‌వ‌చ్చ‌ని గ్ర‌హించింది. ఎక్కువ క‌ష్టం లేకుండానే ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకుని పొదుపు చేయ‌డం మొద‌లు పెట్టింది. అయితే త‌రువాత ఏమి చేయాలి?

  1. మ‌దుపు చేయ‌డం:

పొదుపు చేసిన డ‌బ్బును ఎక్క‌డ పెట్టుబ‌డి పెట్టాలి. ఏవిధంగా రాబ‌డి వ‌స్తుందో తెలియ‌డం కూడా ముఖ్య‌మే. స‌రిత త‌ను పొదుపు చేసిన రూ.8 వేల రూపాయిలు ఈక్విటీ ఫండ్ల‌లో మ‌దుపు చేసింది. ఇవి దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డుల‌ను అందిస్తాయి. వార్షింగ్ 15 - 16 శాతం వృద్ధి చెందింతే వ‌చ్చే రాబ‌డుల‌ను వాటిని వార్షికంగా కాంపౌండ్ చేస్తే వ‌చ్చే మొత్తాన్ని ఈ కింది విధంగా లెక్కించి వ‌చ్చే రాబ‌డుల‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోయింది. ఈక్విటీ ఫండ్ల‌లో మ‌దుపు చేసింది.

Untitled1.png
  1. ఖ‌ర్చుల పున‌రుద్ధ‌ర‌ణ‌:
    స‌రిత సిప్ బాగానే ప‌నిచేస్తుంది. కాని ఆమె భ‌ర్తకు ఖ‌ర్చులు పెర‌గ‌డంతో ఈఎమ్ఐ చెల్లింపులు స‌రిగ్గా చెల్లించ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇందుకు గాను స‌రిత త‌న 3వ రూల్ పాటించింది. వారి కుటుంబానికి ఒక గృహ రుణం, కారు రుణం, రెండు ప‌ర్స‌న‌ల్ రుణాలు ఉన్నాయి. వారు ఇంటి రుణం కోసం రూ.70 వేలు, కారు రుణం కోసం రూ. 20 వేలు, ప‌ర్స‌న‌ల్ రుణం ఒక్కోదానికి రూ.8,500 చొప్పున ఈఎమ్ఐ చెల్లిస్తున్నారు. రుణ భారాన్ని త‌గ్గించుకోవ‌డానికి బ్యాంక్ వారితో మాట్లాడింది. మ‌నీ మార్కెట్ రేట్లు పిడిపోవ‌డంతో బ్యాంకు వారు గృహ రుణ వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించారు. దీని వ‌ల్ల గృహ రుణం ఈఎమ్ఐ రూ. 5 వేల వ‌ర‌కు త‌గ్గింది. త‌న భ‌ర్త‌కి ప్ర‌తి సంవ‌త్స‌రం బోన‌స్ వ‌స్తుంది. ఆ బోన‌స్ మొత్తాన్ని ప్ర‌తి సంవ‌త్స‌రం బులెట్లుగా సేక‌రించుకుని ఈఎమ్ఐ మ‌రింత‌గా త‌గ్గించ‌మ‌ని బ్యాంకు అధికార‌ల‌ను కోరింది. ఈ విధంగా గృహ‌రుణం నుంచి రూ.10 వేలు త‌గ్గించుకుంది. అంతేకాకుండా వారికి ఉన్న రెండు ప‌ర్స‌న‌ల్ రుణాల‌ను ఏకం చేసి ఒకే లోనుకు మార్చ‌మ‌ని బ్యాంకు అధికార‌లను కోరింది. దీని కార‌ణంగా ప‌ర్స‌న‌ల్ రుణం చెల్లింపులో రూ.10 వేలు త‌గ్గించుకుంది. ఈ విధంగా నెల‌కు రూ.20 వేల రూపాయిలు నెల‌వారి చెల్లింపుల‌ను త‌గ్గించుకుంది.

  2. నిర్ధిష్ట అవ‌స‌రం కోసం వినియోగించ‌డం:

ఈఎమ్ఐ నెల‌వారి చెల్లింపులు రూ. 20,000 త‌గ్గించ‌కున్న త‌రువాత కుటుంబం సాఫీగా సాగుతుంది. అయితే 5 సంవ‌త్స‌రాల అనంత‌రం త‌మ పెద్ద కుమార్తెను అమెరికాకు ఉన్న‌త చ‌దువులు కోసం పంపించాల్సి వ‌చ్చ‌న‌ప్పుడు అస‌లైన సవాలు ఎద‌రైంది. స‌రిత భ‌ర్త త‌మ పిల్ల‌ల చ‌దువుల కోసం వేసుకున్న ప్ర‌ణాళిక‌లో రూ. 5 ల‌క్ష‌లు త‌క్కువ‌గా ఉంది. స‌రిత ఈ విష‌యాన్నిముందుగానే గ్ర‌హించి త‌న ఈక్విటీ ఫండ్ల‌ను లిక్విడ్ ఫండ్ల‌గా మార్చింది. త‌న చేసిన రూ.8 వేల రూపాయిల సిప్, ఐదు సంవ‌త్స‌రాల త‌రువాత 7.38 ల‌క్ష‌ల వ‌చ్చాయి. వార్షిక కాంపౌండ్‌తో 16 శాతం వ‌డ్డీ నిచ్చాయి. అందులో నుంచి రూ. 5 ల‌క్ష‌లు చ‌దువు కోసం మిగిలిన త‌న కుమార్తె రోజు వారి అవ‌స‌రాల కోసం క్రెడిట్ చేశారు. ఆమె చేసిన పొదుపును చూసి ఆమె భ‌ర్త ఆశ్చ‌ర్య పోయాడు. ఇందంతా ఆమె ఆర్ధిక ప్ర‌ళాణిక చేసుకోవ‌డం ద్వారా సాద్య‌ప‌డింది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly