వాహ‌న బీమా పాల‌సీ ధ‌ర‌లు త‌గ్గొచ్చు

స్థిర ప్రీమియంను నిర్ణ‌యించే విధానాన్ని ఐఆర్‌డీఏఐ నిలిపివేయ‌డం ద్వారా ద్విచ‌క్ర/ నాలుగు చ‌క్రాల వాహ‌న బీమా ప్రీమియంలు త‌గ్గేందుకు అవ‌కాశం ఉంది.

వాహ‌న బీమా పాల‌సీ ధ‌ర‌లు త‌గ్గొచ్చు

వాహ‌న బీమా ప్రీమియంలు త్వరలోనే తగ్గనున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) కూడా నిర్ణ‌యం తీసుకోనుంద‌ని తెలుస్తోంది.

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏఐ) థ‌ర్డ్ పార్టీ బీమాకు సంబంధించి స్థిర ప్రీమియంను నిర్ణ‌యించే విధానాన్నినిలిపివేయాలన్న ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్నందున ఆర్థిక సంవత్సరం 2020-21 నుంచి కారు / బైక్ బీమా కోసం ప్రీమియం తగ్గవచ్చు.

ఇప్పుడు అన్ని బీమా సంస్థలకు థ‌ర్డ్ పార్టీ బీమాకు స్థిర ప్రీమియంని ఐఆర్‌డీఏఐ నిర్ణ‌యిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఈ ప‌ద్ధ‌తిని నిలిపివేసినట్లయితే, బీమా సంస్థలు ఎక్కువ మంది పాల‌సీదారుల‌ను ఆక‌ర్షించేందుకు థ‌ర్డీ పార్టీ ప్రీమియంపై డిస్కౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. రోడ్డు మీద నడుపుతున్న అన్ని వాహనాలకు థ‌ర్డ్ పార్టీ బీమా తప్పనిసరిగా ఉండాలి కాబ‌ట్టి వీటి విక్ర‌యాలు ఎక్కువ‌గా ఉంటాయి. దీంతో పాటు బీమా కంపెనీల మ‌ధ్య భారీ పోటీ ఉంటుంది.

కారు, ద్విచక్ర వాహన‌ డీలర్లు త‌మ వినియోగ‌దారుల‌కు థ‌ర్డ్ పార్టీ, సమగ్ర మోటార్ పాల‌సీల‌ను అందిస్తారు. ప్రీమియం సాధారణంగా వాహన కొనుగోలు ధర (కొత్త వాహనాల విషయంలో మాత్రమే) కలుపుతారు. బీమా అగ్రిగేటర్ వెబ్ సైట్లో ఆన్ లైన్ లో అందుబాటులో ఉండే బీమా పాలసీలు కంటే ధరలు ఎక్కువగా ఉంటాయి. వాహ‌న బీమా అనే కాకుండా వివిధ ర‌కాల పాల‌సీలు నేరుగా కొనుగోలు చేసే ధ‌ర కంటే ఆన్ లైన్ లో పాల‌సీ ధ‌ర‌లు కొంత త‌క్కువ‌గా ఉంటాయి. మోటారు బీమా కవర్ కోసం చూస్తున్న వ్యక్తులు ఆన్లైన్లో లభ్యమయ్యే పాల‌సీ వివ‌రాల‌ను ఒక సారి తనిఖీ చేయాలి.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly