మోటోరోలా నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్..

ఆండ్రాయిడ్ వన్ స్టాక్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది

మోటోరోలా నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్..

ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ మోటోరోలా ఈ రోజు ఒక సరికొత్త మొబైల్ ని భారత్ లో విడుదల చేసింది. దాని పేరు మోటోరోలా వన్ విషన్. ఇది ఆండ్రాయిడ్ వన్ స్టాక్ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది. మొదటిసారి పంచ్‌ హోల్ డిస్‌ప్లే కలిగిన స్మార్ట్ ఫోన్ ను మోటోరోలా విడుదల చేసింది. మోటోరోలా వన్ విషన్ చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దానికి కారణం స్మార్ట్ ఫోన్ ముందు వైపు, వెనక వైపు గ్లాస్ ను అమర్చారు. అలాగే ఫోను వెనకవైపు మోటోరోలా లోగో లోనే ఫింగర్ ప్రింట్ స్కానర్ ను అమర్చారు. మోటోరోలా మొదటిసారి ఎక్సినోస్ 9609 చిప్ సెట్ ను ఈ ఫోన్ లో వినియోగించింది. ఈ ఫోన్ బ్రాన్జ్ గ్రేడియంట్, సాఫైర్ గ్రేడియంట్ కలర్స్ లో లభించనుంది. దీని ధరను సంస్థ రూ. 19,999 గా నిర్ణయించింది. అలాగే జూన్ 27 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా దీనిని విక్రయించనున్నట్లు సంస్థ తెలిపింది.

motorola one vision.jpg

మోటోరోలా వన్ విషన్ స్పెసిఫికేషన్స్ ను ఒకసారి పరిశీలిస్తే…

 • 6.3 ఇంచ్ ఫుల్ హెచ్ డీ ప్లస్ పంచ్ హోల్ డిస్ ప్లే
 • ఆండ్రాయిడ్ పై 9.0 ఆపరేటింగ్ సిస్టం
 • ఎక్సినోస్ 9609 చిప్ సెట్
 • ఆక్టా కోర్ 2.2 GHz
 • 4 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (1 టీబీ వరకు పొడిగించుకోవచ్చు)
 • ముందువైపు 25 ఎంపీ సెల్ఫీ కెమెరా
 • వెనుకవైపు 48ఎంపీ+5ఎంపీ డ్యూయల్ కెమెరా సెట్ అప్
 • వెనుకవైపు ఫింగర్ ప్రింట్ స్కానర్
 • 2.0 టైపు-సీ యూఎస్బీ పోర్ట్
 • 15W ఫాస్ట్ ఛార్జింగ్
 • 3500 ఎంఏహెచ్ బ్యాటరీ

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly