ఈడీఎల్ఐ పథకం గురించి తెలుసుకుందామా?

ఈపీఎఫ్ పథకంలో సభ్యత్వం పొందిన ఉద్యోగులు ఈడీఎల్ఐ పథకంలో ఆటోమేటిక్ గా సభ్యత్వం పొందుతారు

ఈడీఎల్ఐ పథకం గురించి తెలుసుకుందామా?

నెలవారీ జీతాలు పొందే వారికి పదవీ విరమణ పొదుపును ఏర్పాటు చేసుకోడానికి ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) పథకం చాలా సహాయం చేస్తుంది. ఇది ప్రభుత్వ అధీనంలో నడిచే పథకం, ఎవరైతే రిస్క్ లేకుండా, కచ్చితమైన రాబడులు పొందాలని ఆలోచిస్తారో అలాంటి వారికి ఈ పథకం మంచిది. ఈపీఎఫ్ఓ చందాదారులకు ఈపీఎఫ్, ఈపీఎస్, ఈడీఎల్ఐ వంటి మూడు పొదుపు పథకాలను అందిస్తుంది. మొదటి రెండు పొదుపు పథకాలు కాగా, ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీం (ఈడీఎల్ఐ) మాత్రం బీమా పథకం.

ఈడీఎల్ఐ అంటే ఏమిటి?

ఈడీఎల్ఐ పథకంను 1976 సంవత్సరంలో ప్రారంభించారు. ఉద్యోగులకు ఈపీఎఫ్ నియమాన్ని అందించే అందరు యజమానులకు ఇది అందుబాటులో ఉంటుంది. ఈ పథకం ఉద్యోగులకు జీవిత బీమా కవరేజ్ ని అందిస్తుంది.

ఈడీఎల్ఐ సభ్యత్వాన్ని పొందడం ఎలా?

ఈ పథకాన్ని ఈపీఎఫ్, ఈపీఎస్ పొదుపు పథకాలతో అనుసంధానించడం జరిగింది. ఈపీఎఫ్ పథకంలో సభ్యత్వం పొందిన ఉద్యోగులు ఈడీఎల్ఐ పథకంలో ఆటోమేటిక్ గా సభ్యత్వం పొందుతారు.

ఈడీఎల్ఐ పథకం కింద హామీ ప్రయోజనం :

సర్వీస్ లో ఉన్న ఉద్యోగి మరణించిన సందర్భంలో మాత్రమే ఈడీఎల్ఐ పథకం కింద హామీ ఇచ్చిన మొత్తాన్ని చెల్లిస్తారు. మరణించిన ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాకు ఎవరిని అయితే నామినీగా నమోదు చేస్తారో వారే ఈడీఎల్ఐ ప్రయోజనాలను పొందేందుకు కూడా అర్హులు.

ఈడీఎల్ఐ స్కీం వాటాలు :

ఈడీఎల్ఐ పథకంలోని వాటాలు పరోక్షంగా ఉద్యోగి చేస్తారు. నిజానికి వాటాలను యజమాని చేయాల్సి ఉంటుంది. ఈ పథకానికి చేసిన వాటాలను డీఏ, జీతం స్థిర శాతానికి అనుగుణంగా రూపొందించారు.

 • ఉద్యోగి ఈపీఎఫ్ వాటా : 12 శాతం

 • యజమాని ఈపీఎఫ్ వాటా: 12 శాతం - ఈపీఎస్ వాటా

 • ఉద్యోగి ఈపీఎస్ వాటా: లేదు

 • యజమాని ఈపీఎస్ వాటా: 8.33 శాతం (గరిష్టంగా రూ.1,250)

 • ఉద్యోగి ఈడీఎల్ఐ వాటా : లేదు

 • యజమాని ఈడీఎల్ఐ వాటా : 0.50 శాతం (గరిష్టంగా రూ.75)

ఈడీఎల్ఐ స్కీం లక్షణాలు, ప్రయోజనాలు :

 • బ్యాంక్ బజార్ నివేదిక ప్రకారం, బీమా పథకం కింద క్లెయిమ్ మొత్తం జీతానికి 30 రెట్లు అధికం. జీతాన్ని (డీఏ + ప్రాథమిక జీతం) ఆధారంగా లెక్కిస్తారు.

 • బోనస్ కింద రూ. 1.5 లక్షలు కూడా ఉంటాయి, దానిని కూడా క్లెయిమ్ మొత్తంతో పాటు చెల్లిస్తారు.

 • క్వాంటం కవరేజ్ నేరుగా ఉద్యోగి జీతంతో ముడిపడి ఉంటుంది.

 • చెల్లించవలసిన ప్రీమియం అందరు ఉద్యోగులకు సమానంగా ఉంటుంది.

 • ఈడీఎల్ఐ పథకానికి వయస్సు లేదా ఇతర వ్యక్తిగత కారకాలు అర్హతలుగా లేవు.

 • ఒకవేళ యజమాని వారి ఉద్యోగికి మెరుగైన బీమా పాలసీని ఎంచుకున్నట్లయితేనే సెక్షన్ 17 (2ఏ) కింద పథకం నుండి వైదొలగవచ్చు.

ఈడీఎల్ఐ మొత్తాన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?

 • ఈడీఎల్ఐ మొత్తాన్ని నామినీ ద్వారా క్లెయిమ్ చేయవచ్చు.

 • నామినీ చనిపోయినట్లయితే, అతని / ఆమె బంధువు ఈడీఎల్ఐ మొత్తాన్ని పొందవచ్చు. అయితే, పెద్ద కుమారుడు, భర్త సజీవంగా ఉన్న పెళ్లైన కుమార్తె ద్వారా క్లెయిమ్ చేయడం కుదరదని బ్యాంక్ బజార్ నివేదిక తెలిపింది.

 • క్లెయిమ్ చేయడానికి ముందుగా, ఫారం 5 ను పూర్తి చేసి సమర్పించాల్సి ఉంటుంది.

ఈడీఎల్ఐ పథకం కింద క్లెయిమ్ కోసం అవసరమైన పత్రాలు :

ఒక వ్యక్తి విజయవంతంగా క్లెయిమ్ పొందడానికి, ఫారంతో పాటు సమర్పించవలసిన పత్రాలను కింద తెలియచేశాము :

 • ఈడీఎల్ఐ సభ్యుడి మరణ ధ్రువీకరణ సర్టిఫికేట్.

 • సంరక్షక సర్టిఫికేట్ : ఒకవేళ మైనర్ కుటుంబ సభ్యుడు లేదా నామినీ లేదా చట్టపరమైన వారసుడి తరఫున క్లెయిమ్ ధాఖలైతే, చట్టపరమైన సంరక్షకుడు సంరక్షక సర్టిఫికేట్ ను కూడా సమర్పించాల్సి ఉంటుంది.

 • వారసత్వ సర్టిఫికేట్ : మరణించినవారి చట్టపరమైన వారసుడి ద్వారా క్లెయిమ్ దాఖలు చేయాలంటే వారసత్వ సర్టిఫికేట్ ను సమర్పించాల్సి ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly