గ‌ణ‌నీయంగా పెరుగుతున్న మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల విలువ

ఆస్తుల విలువ నెలనెలా పెరగడానికి పరిశ్రమల ద్వారా పెట్టుబడిదారులకు అవగాహన కల్పించడం, రిటైల్ పెట్టుబడిదారుల నుంచి బలమైన భాగస్వామ్యం ప్రధాన కారణం

గ‌ణ‌నీయంగా పెరుగుతున్న మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల విలువ

మ్యూచువల్ ఫండ్స్ ఆస్తి విలువ జులై చివరి నాటికి 5 శాతం పెరిగి రూ. 23.96 లక్షల కోట్లకు చేరుకుంది. రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం, మ్యూచువల్ ఫండులపై పెట్టుబడిదారులకు అవగాహన కల్పించడం ద్వారా భారీ మొత్తంలో నిధులు వచ్చి చేరాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) గణాంకాల ప్రకారం జూన్ చివరి నాటికి పరిశ్రమల నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ. 22.86 లక్షల కోట్లు.

గత సంవత్సరం జులై నాటికి మొత్తం ఫండ్ హౌసుల ద్వారా జమైన ఆస్తుల విలువ రూ. 19.97 లక్షల కోట్లు.

“ఆస్తుల విలువ నెలనెలా పెరగడానికి పరిశ్రమల ద్వారా పెట్టుబడిదారులకు అవగాహన కల్పించడం, రిటైల్ పెట్టుబడిదారుల నుంచి బలమైన భాగస్వామ్యం ప్రధాన కారణమని” ఏఎంఎఫ్ఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎన్ఎస్ వెంకటేష్ తెలిపారు.

అంతే కాకుండా, రిటైల్ పెట్టుబడిదారులు, ప్రజలు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) ద్వారా క్రమం తప్పకుండా ప్రతినెలా కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెడుతూ వస్తున్నారు. ఇది కూడా మ్యూచువల్ ఫండ్స్ ఆస్తి విలువ పెరగడానికి దోహదపడుతుందని ఆయన తెలిపారు.

రిటైల్ ఈక్విటీ ఏయూఎం గత నెలలో రూ. 10 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది జూన్ నెల చివరి నాటికి రూ. 9.61 లక్షల కోట్లుగా ఉంది.

అంతేకాకుండా, గత నెలలో తొమ్మిది లక్షల కొత్త ఫోలియోస్ జత అవ్వడంతో జులై నెల చివరి నాటికి మొత్తం 7.55 కోట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు నెలలో ఇది 7.46 కోట్లుగా ఉంది.

మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన పెట్టుబడులు దీర్ఘ కాలంలో కచ్చితమైన రాబడులను అందిస్తాయని కొత్త పెట్టుబడిదారులు నమ్మకంగా ఉన్నారని వెంకటేష్ తెలిపారు.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly