సిప్ తో ఉచిత బీమా..ఎంత వరకు ఉపయోగకరం?

మ్యూచువల్ ఫండ్ కంపెనీలు తమ ద్వారా సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్టుమెంట్ ప్లాన్) చేస్తే జీవిత బీమాను అందిస్తున్నాయి

సిప్ తో ఉచిత బీమా..ఎంత వరకు ఉపయోగకరం?

కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచంలోని దేశాలలో వస్తుసేవా కార్యకలాపాలు నిలిచిపోవడంతో , స్టాక్ మార్కెట్లు కూడా 25-30 శాతం పడిపోయాయి. దీనిని అవకాశంగా తీసుకుని కొందరు మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు ప్రారంభించాలనుకుంటున్నారు. అలాగే కోవిద్ 19 వలన జరుగుతున్న ప్రమాదాన్ని చూసి కొత్తగా జీవిత బీమా , ఆరోగ్య బీమాలను తీసుకోవడం లేదా ఉన్న బీమాను పెంచుకోవాలని చూస్తున్నారు .

చాలా మందికి తెలియని విషయం అనేక మ్యూచువల్ ఫండ్ కంపెనీలు తమ ద్వారా సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్టుమెంట్ ప్లాన్) చేస్తే జీవిత బీమాను అందిస్తున్నాయి. ఉదా : ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ద్వారా సిప్ చేస్తే జీవిత బీమా పేరు SIP ప్లస్, అలాగే, ఆదిత్య బిర్లా సెంచురీ SIP , నిప్పన్ ఇండియా పేరు SIP ఇన్స్యూర్. తమ ద్వారా సిప్ చేస్తే ఫండ్ హౌస్ లు ఈ గ్రూప్ బీమా పాలసీలను ఉచితంగా అందిస్తున్నాయి .

ఇటువంటి బీమా సదుపాయం ఉచితంగా ఇవ్వడం ద్వారా మదుపరులు దీర్ఘకాలం సిప్ చేస్తారని, ఒకవేళ
దురదృష్టవశాత్తూ మదుపరుడు మరణించినచో వారి వారసులు బీమా సొమ్ము పొందుతారు . ఈ ఉచిత బీమా సదుపాయాన్ని సిప్ మొదలుపెట్టేటనప్పుడు ఎంచుకోవచ్చు. ఇది గ్రూప్ బీమా అయినందున ఎటువంటి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. 18-51 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి ఈ బీమా అందిస్తున్నారు. ఇవి మదుపరుకి 55 ఏళ్ల వయసు వరకు పనిచేస్తాయి. ఉదా : ఒక వ్యక్తి 51 వ ఏట 10 ఏళ్ల కాలానికి సిప్ మొదలుపెడితే, అతని/ ఆమె 55 ఏళ్ల వయసు వరకు ఈ బీమా పనిచేస్తుంది. అదే ఆదిత్య బిర్లా మ్యూచువల్ ఫండ్ వారు అందిస్తున్న బీమా 60 ఏళ్ల వరకు పనిచేస్తుంది .
ఈ ఉచిత జీవిత బీమా పొందడానికి కనీసం 3 ఏళ్ళు సిప్ చేయాలి . మధ్యలో సిప్ ఆపివేసినా , కొంత లేదా పూర్తి సొమ్ము వాపసు తీసుకున్నా , లేదా మరే ఇతర స్కీం కి బదిలీ అయినా బీమా వర్తించదు. కనీసం 3 ఏళ్ళు సిప్ చేసి ఆపివేసినా, స్కీం లో తెలిపిన వయసు వరకు బీమా కొనసాగుతుంది .
ఈ బీమా హామీ చేసే సిప్ మొత్తం ఫై ఆధారపడి వుంటుంది . ఉదా : ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్స్ వారి SIP ప్లస్ లో మొదటి ఏడాది బీమా హామీ మొత్తం, సిప్ కి 10 రెట్లు , రెండవ ఏడాది సిప్ కి 50 రెట్లు , మూడవ ఏడాది సిప్ కి 100 రెట్లు ఉంటుంది. అయితే మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఈ బీమాను అన్ని స్కీం లకు కలిపి గరిష్టంగా రూ 50 లక్షల వరకు అందిస్తున్నాయి .

ఒకవేళ నెలసరి సిప్ రూ. 1,000 లు అయితే, మొదటి ఏడాది బీమా హామీ 10 రెట్లు అంటే రూ. 10 వేలు . రెండవ ఏడాది 50 రెట్లు అంటే రూ. 50 వేలు , మూడవ ఏడాది 100 రెట్లు అంటే రూ 1 లక్ష .
ఫారం లో ఉన్న బీమా ఆప్షన్ ఎంచుకోవాలి. క్లెయిమ్ సమయంలో నేరుగా బీమా సంస్థను సంప్రదించాలి .
ఫండ్ హౌస్ స్కీం ద్వారా సిప్ చేయదలిస్తే , ఉచిత బీమాను ఎంచుకోవచ్చు.అయితే స్కీం ఎంచుకునే ముందు మీ రిస్క్ సామర్ధ్యం, మీ ఆర్ధిక లక్ష్యం , ఆ లక్ష్యానికి ఉన్న సమయం , ఫండ్ తాలూకు గత పనితీరు, వంటి వాటిని పరిశీలించాలి.

అంతేకానీ కేవలం బీమా కోసం స్కీం లో సిప్ చేయరాదు అని నవీన్ కుక్రేజా , పైసా బజార్ . కామ్ తెలిపారు. అలాగే కేవలం ఈ జీవిత బీమా మీద ఆధారపడకూడదు. ఈ ఉచిత జీవిత బీమా ఫై పూర్తిగా ఆధారపడకుండా, విడిగా టర్మ్ జీవిత బీమా పాలసీ తీసుకోవాలి. క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ప్రీమియం చెల్లిస్తూండాలి .

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly